యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

రాజకీయ పార్టీ

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు, కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి 2010 నవంబరు 29న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, 2010 డిసెంబరు 7న పులివెందులలో నూతన పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి 2011 మార్చిలో తూర్పు గోదావరి జిల్లాలో తన పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) అని ప్రకటించాడు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు[1]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులువై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
Secretaryవిజయసాయి రెడ్డి
పార్లమెంటరీ పార్టీ నేతవిజయసాయి రెడ్డి
లోక్‌సభలో పార్టీ నేతపి.వి.మిధున్ రెడ్డి
రాజ్యసభలో పార్టీ నేతవిజయసాయి రెడ్డి
అసెంబ్లీలో పార్టీ నేతవై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
స్థాపన2011, మార్చి 11
ప్రధాన కార్యాలయంతాడేపల్లి, ఆంధ్రప్రదేశ్
సిద్ధాంతంప్రాంతీయతావాదం
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ 175
11 / 175
0 / 119
లోక్‌సభ
4 / 545
రాజ్యసభ
11 / 245
ఓటు గుర్తు
అభిమానులతో వై.యస్.జగన్

చరిత్ర

మార్చు

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పేరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి అభిమాని తొలిగా నమోదు చేశాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దానిపై హక్కులను పొందాడు.[2]

ఎన్నికలు

మార్చు

2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించింది. ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది.స్వల్ప తేడాతో ఓడి పోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజలకి బాగా చేరువ అయినది. ప్రత్యేక హోదాపై అలుపెరుగని పోరాటం చేయడమే కాక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల మధ్య నుంచే ఎండగట్టింది. 2019 ఎన్నికలలో కేవలం ఆంధ్రప్రదేశ్ పై దృష్టిపెట్టి, ఘన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను 151 స్థానాలతో, భారత లోక్‌సభలో 22 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ విభాగంలోను అత్యున్నత ఫలితాలు అందుకుంది.

2024 ఎన్నికలు

మార్చు

అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంతగా అతి తక్కువ స్థానాలు వైకాపా పార్టీకి లభించింది.ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తీరుతామని ప్రచారం చేసుకున్న ఆ పార్టీ చివరికి ప్రతిపక్ష హోదా కూడా పొందలేక పోయింది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేసిన వైకాపాకు కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సంబంధం లేకుండా ఒక్క తెలుగు దేశం పార్టీ నే 216 సీట్లలో విజయం సాధించగా, అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు దక్కాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు 151 స్థానాలు లభించగా తెలుగు దేశం పార్టీకి 23 దక్కాయి.ఈ ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి వైకాపా పరిస్థితి దారుణంగా మారింది‌.175 స్థానాల్లో పోటీ చేసిన 11 సీట్లకే పరిమితమైంది.

శాసనసభ ఎన్నికలు

మార్చు

ఆంధ్రప్రదేశ్

మార్చు
సంవత్సరం సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతం ఫలితం మూలం
2014 14వ శాసనసభ
67 / 175
44.47% ఓటమి [3]
2019 15వ శాసనసభ
151 / 175
49.95% గెలుపు
2024 16వ శాసనసభ
11 / 175
44.28% ఓటమి

తెలంగాణ

మార్చు
సంవత్సరం సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతం ఫలితం
2014 1వ శాసనసభ
3 / 119
ఓటమి

లోక్‌సభ ఎన్నికలు

మార్చు
సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు గెలిచిన స్థానాలు
2014 16వ లోక్‌సభ
8 / 25
2019 17వ లోక్‌సభ
22 / 25
2024 18వ లోక్‌సభ
04 / 25

ఎన్నికల వాగ్ధాన పత్రం

మార్చు

వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు.[4][5] జనాకర్షక పథకాలలో కొన్ని:[6]

  • రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
  • రైతులకు, కౌలు రైతులతో సహా వడ్డీలేని రుణాలు
  • రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
  • రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
  • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే విద్యుత్
  • రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు. ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
  • కిడ్నీ సహా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
  • వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం
  • ఖాళీగా ఉన్న రెండు లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ
  • ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు నియామకాలు అతి స్వల్ప కాలంలో భర్తీ

వైసీపీ ఆవిర్భావ దినోత్స‌వం

మార్చు

2022 మార్చి 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆ పార్టీ నేతలు జరుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో.. "దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.[7][8]

ప్లీన‌రీ స‌మావేశాలు 2022

మార్చు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) ప్లీన‌రీ స‌మావేశాలు 2022 జూలై 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వ‌హించారు. గుంటూరు జిల్లా ప‌రిధిలోని ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యం స‌మీపంలో ప్లీన‌రీ వేదిక‌పై[9] పార్టీ ప్రారంభించి ప‌దేళ్లు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్. జ‌గ‌న్ మోహన్ రెడ్డి మూడేళ్ల ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకోవ‌డం వంటి కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో ప్లీన‌రీని ఘ‌నంగా ముగిసింది. ఆ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ ప్లీనరీలో రెండోరోజు తీర్మానం చేసి ఆమోదించారు.[10] మొదటిరోజు ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Jagan is national president of YSR Congress Party". 2011-02-22.
  2. "Jagan 'buys' party named after YSR - India News". web.archive.org. 2019-06-15. Archived from the original on 2019-06-15. Retrieved 2024-06-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "TDP vs YSRC: Small margin, big difference in Seemandhra". Deccan Chronicle. 2014-05-18. Archived from the original on 2014-05-18.
  4. "వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్.. ప్రధాన అంశాలివే..!". ఆంధ్రజ్యోతి. 6 Apr 2019. Archived from the original on 7 Apr 2019. Retrieved 7 Apr 2019.
  5. "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2019" (PDF). YSRCP. Archived from the original (PDF) on 2019-04-07. Retrieved 2019-04-07.
  6. "YS Jagan Manifesto: పేదలకు అండగా పథకాలు, నవరత్నాలు.. వైసీపీ మేనిఫెస్టో ఇదే". Samayam. Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  7. "12వ వసంతంలోకి వైఎస్సార్‌సీపీ". Sakshi. 2022-03-10. Retrieved 2022-03-12.
  8. "twitter.com/ysjagan/status/1502524333650251776". Twitter (in ఇంగ్లీష్). Retrieved 2022-03-12.
  9. "జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ.. వేదిక ఖరారు, ఎక్కడంటే..?". web.archive.org. 2022-06-01. Archived from the original on 2022-06-01. Retrieved 2022-06-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "Cm Jagan: వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎన్నిక". web.archive.org. 2022-07-09. Archived from the original on 2022-07-09. Retrieved 2022-07-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు

మార్చు