వంగీపురం నీరజాదేవి

వంగీపురం నీరజాదేవి తెలంగాణ రాష్ట్రంకు చెందిన కూచిపూడి నృత్యకారిణి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ నృత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

వంగీపురం నీరజాదేవి
జననండిసెంబరు 31, 1968
జాతీయతభారతీయురాలు
వృత్తికూచిపూడి నృత్యకారిణి

జీవిత విషయాలు

మార్చు

నీరజాదేవి 1968, డిసెంబరు 31న వనపర్తిలో జన్మించింది.

కళారంగం

మార్చు

1979లో స్వర్ణముఖి పేరుతో ఆర్ట్స్‌ అకాడమీని స్థాపించిన నీరజాదేవి, అనేకమంది ఔత్సాహిక కళాకారులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చింది. 2008లో గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన నీరజాదేవి ‘నాట్యవిద్యాదరి’, ‘మువ్వలసవ్వడి’ వంటి అవార్డులను అందుకుంది.[2]

పురస్కారాలు

మార్చు
  1. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015లో కూచిపూడి ఉత్తమ కళాకారిణి అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2.
  2. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[3]
  3. జి.వి.ఆర్‌. ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ పురస్కారం (మహబూబ్‌నగర్‌, 2016 అక్టోబరు 2) [4]

మూలాలు

మార్చు
  1. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 13 March 2020.
  2. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 13 March 2020.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 13 March 2020.
  4. ఆంధ్రప్రభ, మహబూబ్‌నగర్‌ (2 October 2016). "మహబూబ్‌నగర్‌ : నేడే జివిఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ వారి పురస్కారాల ప్రధానోత్సవం". Archived from the original on 13 మార్చి 2020. Retrieved 13 March 2020.