వంటచెరకు

(వంట చెరకు నుండి దారిమార్పు చెందింది)

వంట తయారు చేయడానికి పొయ్యి మంటకు ఉపకరించే కర్రలు, చెక్కలు, చెట్టు వ్రేళ్ళు, పుల్లలు వంటి వృక్ష సంబంధితాలను వంటచెరకు అంటారు. దీనిని సాధారణంగా గట్టి చెక్క లేదా మృదువుగా ఉండే చెక్క అని వర్గీకరిస్తారు. వంట చెరకును ఇంగ్లీషులో ఫైర్‌వుడ్ అని అంటారు. స్థానికంగా దీనిని కట్టెలు అని పిలుస్తారు. కట్టెలు పునరుత్పాదక వనరు. కొన్ని రకాల కట్టెలను కాల్చినప్పుడు ఇంధనాన్ని చాలా అధికంగా ఇస్తాయి, వీటిని గట్టి కట్టెలు అని చెప్పవచ్చు. కొన్ని రకాల కట్టెలను కాల్చినప్పుడు ఇంధనాన్ని చాలా తక్కువగా ఇస్తాయి, వీటిని మృదు కట్టెలు అని చెప్పవచ్చు. బాగా ఎండిన కట్టెలు బరువు తక్కువగా ఉండి తొందరగా మండుకుంటాయి. పచ్చి కట్టెలను బాగా ఎండ బెట్టి వాడుకుంటారు. కట్టెలతో వండుకున్న వంటలు బాగా రుచిగా ఉంటాయని ప్రజలలో నమ్మకముంది.[ఆధారం చూపాలి] స్నానం చేయుటకు కట్టెలతో కాచుకున్న వేడి నీరు మంచిదని పెద్దలు చెబుతారు.[ఆధారం చూపాలి] పల్లెలలో కట్టెలను ఎక్కువగా ఉచితంగానే సేకరిస్తారు. సామిల్లులలో వృక్షముల నుండి కలపను తీసుకొని మిగిలిన వుడ్ వర్క్ కు పనికిరాని భాగాలను కట్టెలుగా తక్కువ ధరకు విక్రయిస్తారు. బాయిలర్ మిల్లులలో బాయిలర్ ను వేడి చేయుటకు ఈ కట్టెలను విరివిగా ఉపయోగిస్తారు. పూర్వం అడవులలో చిన్న చిన్న చెట్లను కొట్టి ఆ కట్టెలను ఎడ్ల బడ్లపై వేసుకువచ్చి ఊర్లలో బండికి ఇంత అని విక్రయించేవారు. వంటగ్యాస్ రావటంతో వంటచెరకును ఉపయోగించటం తగ్గిపోయింది.

వంటచెరకు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వంటచెరకు&oldid=3275319" నుండి వెలికితీశారు