నూరు
100 లేదా ఒక వంద (నూరు) ఒక సంఖ్య. దీనిని రోమన్ సంఖ్యామానంలో Ⅽతో సూచిస్తారు. [1] ఇది 99, 101 ల మధ్య ఉన్న సహజ సంఖ్య. భారతీయ సంఖ్యా మానము ప్రకారం పది పదులు. దీనిని శత అని కూడా అంటారు.
| ||||
---|---|---|---|---|
Cardinal | one hundred | |||
Ordinal | 100th (one hundredth) | |||
Factorization | 22· 52 | |||
Divisors | 1, 2, 4, 5, 10, 20, 25, 50, 100 | |||
Roman numeral | C | |||
Unicode symbol(s) | C, ⅽ | |||
Binary | 11001002 | |||
Ternary | 102013 | |||
Quaternary | 12104 | |||
Quinary | 4005 | |||
Octal | 1448 | |||
Duodecimal | 8412 | |||
Hexadecimal | 6416 | |||
Vigesimal | 5020 | |||
Base 36 | 2S36 | |||
Greek numeral | ρ | |||
Arabic | ١٠٠ | |||
Bengali | ১০০ | |||
Chinese numeral | 佰,百 | |||
Devanagari | १०० | |||
Hebrew | ק (Kuf) | |||
Khmer | ១០០ | |||
Korean | 백 | |||
Tamil | ௱, க00 | |||
Thai | ๑๐๐ |
గణిత శాస్త్రంలో
మార్చు10కి వర్గం 100. దీనిని 102గా సూచిస్తారు. S.I ప్రమాణం ప్రకారం దీనిని ప్రమాణాల పూర లగ్నంగా "హెక్టా" అని ఉపయోగిస్తారు. అనగా ఒక హెక్టా మీటరు అనగా 100 మీటర్లని అర్థం.
శాతాలకు ఆధారం 100. శాతమనగా 100కి అని అర్థం. 35% అనగా 100కి 35 అని అర్థం. పూర్తి భాగాన్ని 100%గా గుర్తిస్తారు.
100ను మొదటి 9 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. అదే విధంగా జంట ప్రధాన సంఖ్యల మొత్తంగా కూడా రాయవచ్చు. ఉదా: 3 + 97, 11 + 89, 17 + 83, 29 + 71, 41 + 59, 47 + 53.
100ను మొదటి నాలుగు ధన పూర్ణసంఖ్యల ఘనాల మొత్తంగా కూడా రాయవచ్చు (100 = 13 + 23 + 33 + 43). అదే విధంగా 100 ను మొదటి నాలుగు సహజ సంఖ్యల మొత్తానికి వర్గంగా కూడా రాయవచ్చు. 100 = 102 = (1 + 2 + 3 + 4)2[2]
26 + 62 = 100, అందువలన 100 అనేది లేలాండ్ సంఖ్య అవుతుంది.[3]
10 భూమిగా గల హర్షాద్ సంఖ్య 100.[4]
విజ్ఞాన శాస్త్రంలో
మార్చుపరమాణు సంఖ్య 100గా గల మూలకం ఫెర్మియం, ఇది ఆక్టినైడ్ మూలకం, మొదటి భారలోహం.
సెల్సియస్ స్కేలులో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్.
సముద్రమట్టం నుండి 100 కి.మీ ఎత్తులోగల రేఖను కార్మాన్ రేఖ అంటారు. ఇది భూ వాతావరణానికి, బాహ్య అంతరిక్షానికి మధ్య గల రేఖ.
ద్రవ్యమానం
మార్చుభారతీయ ద్రవ్యమానంలో ఒక రూపాయికి 100 పైసలు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Reïnforced by but not originally derived from Latin centum.
- ↑ మూస:Cite OEIS
- ↑ "Sloane's A076980 : Leyland numbers". The On-Line Encyclopedia of Integer Sequences. OEIS Foundation. Retrieved 2016-05-27.
- ↑ "Sloane's A005349 : Niven (or Harshad) numbers". The On-Line Encyclopedia of Integer Sequences. OEIS Foundation. Retrieved 2016-05-27.