- నేలమీద నిటారుగా కూర్చుని కాళ్ళు తిన్నగా చాపండి.
- ఒక కాలిని మడిచి పక్కకి తీసి దాని పాదం మరో మోకాలి పక్కన వచ్చేలా పెట్టాలి.
- ఏ కాలైతే వంచామో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలిమీదుగా పెట్టి పాదాన్ని పట్టుకోవాలి. వీలైనంత వరకు నడుమును అటువైపుగా తిప్పాలి,
- ఇదే మాదిరిగా రెండవ కాలిని మడిచి మరల అదే విధంగా చేయిని, నడుమును తిప్పాలి,
- ఇలా కనీసం మూడు సార్లు కుడి వైపు, మూడు సార్లు ఎడమ వైపు తిప్పాలి.
- వక్రాసనం వేయడం వలన, అర్ధ మత్స్యేంద్రాసనం సులభంగా వేయగలుగుతారు.
- ఈ ఆసనం వేయడం మూలంగా కాలేయం, ప్లీహం, చిన్న ప్రేగుల పనితీరును బాగుచేస్తుంది.
- మెడ, భుజాలకు సంబంధించిన కండరాల నొప్పులు, ఇతర సమస్యలు పోతాయి.
- నడుం దగ్గర కొవ్వు కరుగుతుంది.