వగరు అనేది ఆరు ప్రాథమిక రుచులైన షడ్రుచులలో ఒక రుచి. సాధారణంగా మామిడి పిందెలలో ఈ రుచిని గమనించవచ్చు. అనేక తినదగిన కాయలు ముదరక మునుపు వగరు రుచిని కలిగివుంటాయి. పక్వానికి వచ్చిన మామిడి కాయల యొక్క చెక్కు వగరు రుచిని కలిగివుంటుంది. వెలగపండు రుచి కొంచెం వగరుగా కొంచెం పుల్లగా వుంటుంది. సీమ చింత చెట్టు యొక్క కాయలు కొంచెం వగరుగా కొంచెం తీయగా ఉంటాయి.

వెలగ కాయ వగరు రుచిని కలిగివుంటుంది.
ఉగాది పచ్చడి, పదార్థాలు - ఈ చిత్రంలో వగరు రుచి కోసం వాడిన మామిడి పిందెల ముక్కలను చూడవచ్చు.

ఉగాది పచ్చడి

మార్చు

షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు వగరు రుచి కోసం మామిడి పిందెలను కట్ చేసి ముక్కలను అందులో కలుపుతారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వగరు&oldid=4077286" నుండి వెలికితీశారు