వడలి మందేశ్వరరావు
వడలి మందేశ్వరరావు తెలుగు సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. ఇతడు 1922 డిసెంబర్ 21న జన్మించాడు. ఇతడు ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా పనిచేశాడు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా రెండు సంవత్సరాలు పనిచేశాడు. కేంద్రీయ విద్యాలయ సంస్థలలో 16 సంవత్సరాలు ప్రిన్సిపాల్‌గా కూడా తన సేవలను అందించాడు. ఇతడు తెలుగులో సాహిత్యవిమర్శపై తొమ్మిదికి పైగా గ్రంథాలు, ఆంగ్లంలో ఒక గ్రంథం రచించాడు[1].
రచనలు
మార్చు- అనుశీలన
- సాహిత్య తత్త్వవివేచన
- పాశ్చాత్య సాహిత్య చరిత్ర విమర్శ - సిద్ధాంతాలు[2]
- శోకం నుంచి స్వర్గానికి
- ఇది కల్పవృక్షం
- సాహిత్య ప్రస్థానం - కొన్ని మజిలీలు
- స్పందన
- విశ్వనాథ మనిషి మనీష
- సాహిత్యం - విమర్శ
- విమర్శ నాటి నుండి నేటికి
- నూరేండ్ల సాహిత్యంలో కొన్నిధోరణులు-దృక్పథాలు
- శిల్పి నన్నయ
- Modern Poetry in Telugu
పురస్కారాలు
మార్చు- ప్రిన్సిపాల్‌గా ఇతడి సేవలకు గుర్తింపుగా కేంద్రీయ విద్యాలయా సంఘటన్, న్యూఢిల్లీ వారి నుండి అనేక పురస్కారాలు లభించాయి.
- ఇతడి ఇదీ కల్పవృక్షం పుస్తకానికి విశ్వనాథ సాహిత్యపీఠం వారు అవార్డు ఇచ్చారు.
- తిక్కవరపు రామిరెడ్డి స్మారక పురస్కారం 1995లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి లభించింది.