వడియం

(వడియాలు నుండి దారిమార్పు చెందింది)

వడియం (బహువచనం వడియాలు) ఒక ప్రత్యేకమైన ఆహార పదార్ధాలు. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే మూల పదార్థాల ఆధారంగా వివిధ రకాలుగా ఉంటాయి.

వడియాలలో రకాలు

మార్చు
  1. పిండి వడియాలు
  2. బియ్యం పిండి వడియాలు
  3. సగ్గుబియ్యం వడియాలు
  4. మినపపిండి వడియాలు
  5. పెసరపిండి వడియాలు
  6. బూడిదగుమ్మడి వడియాలు
  7. సొరకాయ వడియాలు
  8. టమాట వడియాలు
  9. ఉల్లిపాయ వడియాలు
  10. రేగు వడియాలు

తెలగ పిండి వడియాలు

మార్చు

తగినన్ని నీళ్లల్లో తెలగపిండిని సుమారు 8 గంటలు నానబెట్టాలి. పచ్చిమిర్చి, ఉప్పు, వాము, వెల్లుల్లి... మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని తెలగపిండికి కలపాలి. చపాతీపిండిలా తయారు చేసుకున్న తరువాత దానిని ∙చిన్నచిన్న ఉండలు తీసుకుని అరచేతితో ఒత్తి వడియాల మాదిరి ఒత్తి, నువ్వులు అద్ది ఎండలో ఆరబెట్టాలి. ఒక్కరోజు ఎండితే చాలు. వీటిని వేయించవలసిన అవసరం లేదు. పెరుగన్నంలో కాని, మజ్జిగతో కాని తింటే రుచిగా ఉంటాయి.[1]

గుమ్మడి వడియాలు

మార్చు

మినప పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ముందు రోజు రాత్రి నానబెట్టాలి. బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. గుమ్మడి గింజలను తొలగించాలి. ఉప్పు, పసుపు, ఇంగువ జత చేసి ఒక వస్త్రంలో గట్టిగా మూట కట్టి, దాని మీద పెద్ద బరువు పెట్టి రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం మినపపప్పు పొట్టు తీసి, పచ్చిమిర్చి, ఉప్పు జత చేసి మెత్తగా రుబ్బాలి. బూడిదగుమ్మడికాయ ముక్కలు జత చేయాలి. ∙ప్లాస్టిక్‌ కాగితం మీద నిమ్మకాయ పరిమాణంలో వడియాలు పెట్టాలి. రెండు రోజులపాటు ఎండిన తరవాత, వాటిని జాగ్రత్తగా తీసి, రెండవ వైపుకి తిరగేసి, మరో రెండు రోజులు ఎండనివ్వాలి. ∙గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వేసవిలో మామిడికాయ పప్పులో వడియాలు నంచుకుని తింటే రుచిగా ఉంటుంది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "వేడియాలు". Sakshi. 2018-04-28. Retrieved 2022-06-06.
"https://te.wikipedia.org/w/index.php?title=వడియం&oldid=3574961" నుండి వెలికితీశారు