ఉల్లిపాయ వడియాలు

ఉల్లిపాయ వడియాలు ఒక రకం వడియాలు. వీటిని మినప్పప్పు - ఉల్లిపాయల మిశ్రమంతో తయారు చేస్తారు. గారెలకు చేసే తరహాలో మినప్పప్పును నానబెట్టుకుని పిండిగా రుబ్బుకొని అందులోకి రుబ్బుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని కలిపి ఉండలుగా చేసి, ఎండలో వడియాలుగా పెట్టుకుంటారు. అవసరమయినపుడు నూనెలో వేపుకుని తినవచ్చు.

తయారీకి అవసరమైన పదార్థాలు

మార్చు
  • మినపప్పు పావు కిలో
  • ఉల్లిపాయలు 1/2 కిలో
  • పచ్చిమిర్చి 5
  • జీలకర్ర 1 స్పూన్
  • అల్లం చిన్న ముక్క
  • ఉప్పు తగినంత

తయారీ విధానము

మార్చు

మినపప్పు ఐదు గంటల ముందు నానపెట్టుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి అల్లం,పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి .మినపప్పు కొంచెం గట్టిగగారెల పిండిలా గ్రైండ్ చెయ్యాలిఅపిండిలో ఉల్లిపాయముక్కలు,ఉప్పు,జీలకర్ర,అల్లం,పచిమిర్చిముద్దకలిపి చిన్న,చిన్న ఉండలుగ వడియాలు పెట్టుకోవాలిబాగా ఎండపెట్టుకోవాలి.[1]

సాహిత్యంలో ప్రస్తావన

మార్చు

ముళ్ళపూడి వెంకటరమణ తన ఆత్మకథ కోతి కొమ్మచ్చిలో ఈ ఉల్లిపాయ వడియాల గురించి రాసుకున్నారు.

సూచికలు

మార్చు
  1. "తయారీ విధానము". Archived from the original on 2015-10-19. Retrieved 2013-07-24.

యితర లింకులు

మార్చు