కలపతో వస్తువులను తయారుచేయు వారిని వడ్రంగి అంటారు. వీరు కలపతో వివిధ రకాలైన వస్తువులను, గృహ అలంకరణ సామాగ్రిని తయారుచేస్తారు. వీరు వ్యవసాయ పనిముట్లను కూడా చేస్తుంటారు. సాంప్రదాయకంగా ఈ వృత్తిని విశ్వబ్రాహ్మణులు మాత్రమే కులవృత్తిగా చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇతర కులాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ పనిని చేస్తున్నారు.

ఒక భారతీయ గ్రామంలో వడ్రంగి

వడ్రoగి పనిముట్లు, పరికరాలు సవరించు

 
వడ్రంగి. చంద్రరి లో తీసిన చిత్రము
  1. చిత్రిక (Image)
  2. సుత్తి (Hammer)
  3. ఉలి (chisel)
  4. బాడిత (Battered)
  5. రంపం

వడ్రంగి పనిలో తయారయ్యే వస్తువులు సవరించు

ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్‌ టేబుల్లు, మంచాలు, వ్యవసాయానికి కావల్సిన నాగలి, కాడి మేడి, బండి,ఇలా ఒకటేంటి అన్నింటినీ వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్‌ తలుపులు, డైనింగ్‌ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేలాది ముస్లింలు వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కులవృత్తినే నమ్ముకుని వేలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో పడుతున్నారు.

మూలాలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వడ్రంగి&oldid=3805689" నుండి వెలికితీశారు