వడ్రంగి

(వడ్రంగులు నుండి దారిమార్పు చెందింది)

విశ్వకర్మీయుల / విశ్వబ్హ్ పంచ ఈ లింక్‌ని కాపీ చేసి, యు ట్యూబ్‌లో అతికించండి మరియు సభ్యత్వాన్ని పొందండి https://youtube.com/channel/UCQGNB2AjrfG0PwnV1L19FKA Subscribe this channel to listen awesome songs వృత్తి ఈ వడ్.కలపతో వివిధ వస్తువులను తయారుచేయుట వీరి వృత్తి. వడ్రంగి ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క పరికరాలు అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా భారతదేశంలో కూడా విశ్వబ్రాహ్మణులు మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. ఆధునిక కాలంలో ప్రతి వారూ వడ్రంగం నేర్చుకొని చేయుట మొదలెట్టారు. చేతిలో పనివుంటే దేశంలోఎక్కడికైనా పోయి బతకవచ్చు, కులవృత్తికి ఏదీ సాటిరాదు అని సామెతలు. చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి.

ఒక భారతీయ గ్రామంలో వడ్రంగి

వడ్రoగి పనిముట్లు, పరికరాలుసవరించు

 
వడ్రంగి. చంద్ర గిరి లో తీసిన చిత్రము
  1. చిత్రిక (Image)
  2. సుత్తి (Hammer)
  3. ఉలి (chisel)
  4. బాడిత (Battered)

వడ్రంగి పనిలో తయారయ్యే వస్తువులుసవరించు

ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్‌ టేబుల్లు, మంచాలు, వ్యవసాయానికి కావల్సిన నాగలి, కాడి మేడి, బండి,ఇలా ఒకటేంటి అన్నింటినీ వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్‌ తలుపులు, డైనింగ్‌ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేలాది ముస్లింలు వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తినే నమ్ముకుని వందలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో పడుతున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=వడ్రంగి&oldid=3442336" నుండి వెలికితీశారు