వనజా అయ్యంగార్ (1926-1999) ప్రముఖ గణిత శాస్త్రవేత్త,[1] విద్యవేత్త.ఆమె తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు, ఇన్ఫర్మాటిక్స్ యొక్క ఆంధ్ర మహిళా సభ పాఠశాలను స్థాపించిన వారిలో ఒకరు. సంగీత సాహిత్యరంగాల్లో ఆమెకు అభిరుచి, అభినివేశం ఉన్నాయి.

జీవిత చరిత్ర మార్చు

వనజ గారు విభజించని ఆంధ్ర ప్రదేశ్లో జన్మించారు.తన యొక్క ప్రాథమిక చదువు హైదరాబాద్లో జరిగింది.ఆమె తరువాత యుగోస్లేవియా, చెకోస్లోవాకియా, హన్గేరి దేశములలో విద్యార్థి చాచ వేదికల్లో పాల్గొని cambridge విశ్వవిద్యాలయంలో 1950లో గణిత విభాగంలో చేరింది.

వ్యక్తిగత జీవితం మార్చు

1921లో జన్మించిన వనజ కమ్యూనిస్టు మేధావి మోహిత్ సేన్ ను వివాహం చేసుకున్నారు.

వృత్తి మార్చు

ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, ఆ విశ్వవిద్యాలయానికి చెందిన బాలికల విశ్వవిద్యాలయంలో, నిజాం కళాశాలలో ఉపద్యాయినిగా, బాలికల విశ్వవిద్యాలయంలో ప్రధానోపధ్యాయికగ, ఉపకులపతిగా వ్యవహరించారు. వనజ అయ్యంగార్ గణితంలో ఆచార్యవృత్తి నిర్వహించారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ కోఠీ మహిళా కళాశాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషిచేశారు.శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన అప్పటినుంచి ఆ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా 1986 వరకు ఉన్నారు.

అవార్డులు మార్చు

ఆమె 1958లో ఢిల్లీలో విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పురస్కారాన్ని,1987 లో భారతదేశ ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ ఉపాద్యాయ పురస్కారాన్ని పొందారు.

మూలాలు మార్చు

  1. "A man called Mohit Sen". The Hindu. 18 May 2003. Retrieved August 20, 2015.