వయ్యారిభామ (కలుపుమొక్క)

వయ్యారిభామ (ఆంగ్లం:Parthenium hysterophorus) అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క అత్యంత ప్రమాధకరమైన కలుపు మొక్క. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతి త్వరగా ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణణీయంగా తగ్గుతుంది. అంతే కాక ప్రజల, పశువుల ఆరోగ్యంపై కూడ అధికమైన దుష్ప్రభావము చూపిస్తుంది.[2]

Parthenium hysterophorus
Parthenium hysterophorus plant with flowers.jpg
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
P. hysterophorus
Binomial name
Parthenium hysterophorus
Parthenium hysterophorus on open land in Hawaii

ప్రస్థానముసవరించు

వయ్యారిభామ మొక్క ప్రస్థానం తొలుత అమెరికాలోని ఉష్ణ ప్రాంతంలో మొదలైంది. అలా మన దేశానికి దిగుమతి అయిన ఆహార ధాన్యాలతోపాటు 1956లో మన దేశం చేరింది. ఆ తర్వాత మొదటి సారిగా 1973లో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్‌ రాషా్ట్రల్లో కనుగొన్నారు.[2]

పంటలపై ప్రభావంసవరించు

వయ్యారిభామ అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. పంట పైరుల ఎదుగుదలను నియంత్రిస్తుంది. అందువల్ల దిగుబడి తగ్గుతుంది. ఈ మొక్కను సీజన్‌కు ముందే నియంత్రిం చాలి. పత్తి, మొక్కజొన్న, గోదుమ, మల్బరి తోటలు, పూల తోటలు, మామిడి, కూరగాయల తోటల్లో ఎక్కువగా పెరుగుతాయి. పంట లకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చి వేస్తుంది. 40 శాతం వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికి ఉంది. నత్రజని, పోషక విలువలు, శూక్ష్మధాతువుల శాతాన్ని తగ్గిస్తుంది. ఈ మొక్క స్రవించే కొన్ని రకాల రసాయనాల వల్ల పంటల పెరుగుదల నశించిపోతుంది. దీని పుష్పాల నుంచి వచ్చే పుప్పడి రేణువులు టమోటా, వంకాయ, మిరప మొక్కలపై పడి పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. అదే విధంగా కొన్ని రకాల వైరస్‌ తెగుళ్లు వ్యాపిస్తాయి. తెగుళ్లను కలుగజేసే వైరస్‌ వయ్యారిభామ కలుపు మొక్కల పుప్పొడిలో ఉండే తామర పురుగులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. పక్వానికి వచ్చిన వయ్యారి భామ విత్తనాలు అతి చిన్నవిగా వుంటాయి. ఇవి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి.

మనుషులకు ప్రమాధంసవరించు

వయ్యారిభామ వల్ల మనుషులకు ప్రమాదకరమైన డర్కాటైటీస్‌, ఎగ్జిమా, హైఫీవర్‌, ఉబ్బసం, బ్రాంకైటీస్‌ వ్యాధులు వస్తాయి. ఈ మొక్క ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వస్తుంది. పుప్పొడిని పీలిస్తే జలుబు, కళ్లు ఎర్రబడడం, కను రెప్పలు వాపు వస్తాయి. పొలాల్లో పని చేసిన రైతులు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దురదలు, తుమ్ములు వచ్చి చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి.

పశువులకు ప్రమాథంసవరించు

వయ్యారి భామ స్పర్శ వల్ల జంతువులకు వెంట్రుకలు వాడిపోవడం, హైపర్‌ టెన్షన్‌ పెరుగుతుంది. సాధారణంగా ఈ మొక్కను పశువులు తినవు. పొరబాటున గడ్డితో బాటు పశువులు వయ్యారభామను తిన్న పశువుల పాలు తాగితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. ఈ రకం మొక్కలు పార్థీనీయం, హైస్టరీస్‌, హైమోనిన్‌, ఎంబ్రోసిన్‌ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వీటిని తిన్న పశువులు జీర్ణక్రియ, కిడ్నీ, లివర్‌ అన్నవాహిక శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరికి మృత్యువాత పడతాయి.[3][4][5]

ఈ మొక్కకున్న ఇతర పేర్లుసవరించు

దీనికి వయ్యారిభామ అనే పేరు ప్రథానమైనా దీనికి ఇతర పేర్లు కూడ వున్నాయి. అమెరికా అమ్మాయి, కాంగ్రెస్‌ గడ్డి, క్యారెట్‌ గడ్డి, నక్షత్రగడ్డి, ముక్కపుల్లాకు గడ్డి, ఛతక్‌ చాందిని మొక్క, అపాది మొక్క, గజర్‌ వంటి పేర్లున్నవి. కాని ఈ మొక్కను మనం వాడుకలో వయ్యారిభామ అంటాం.

నివారణ పద్ధతులుసవరించు

పంట పొలాల్లో మొలిచిన వయ్యారిభామ పూత పూయకముందే వేర్ల తొ సహా పీకి బురదలో తొక్కెయ్యాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చరొట్టె ఎరువుగా మారుతుంది. లేదా ఇది పూత దశకు రాకముందే వేళ్లతో సహా పీకి తగల బెట్టాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారిభామను నివారించే శక్తి తంగేడు మొక్కకు మాత్రమే ఉంటుంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను తొలగించకూడదు. ఈ కలుపు మొక్క పూత దశకు రాకమునుపే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపి ద్రావణాన్ని పిచికారి చేయాలి. అలా చేస్తే వయ్యారిభామ కలుపు మొక్కలు మొలవవు.[6]

మూలాలుసవరించు

  1. "Taxon: Parthenium hysterophorus L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2008-07-18. Retrieved 2010-10-29.
  2. 2.0 2.1 ఆంధ్రజోతి (15/10/2016). "ఆంధ్ర జ్యోతి" (శనివారము.). Retrieved 16 October 2016. Cite journal requires |journal= (help); Check date values in: |date= (help)
  3. National Center for Biotechnology Information. PubChem Compound Database; CID=442288, https://pubchem.ncbi.nlm.nih.gov/compound/442288 (accessed Oct. 21, 2015).
  4. "Parthenium". మూలం నుండి 2003-04-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-10-16. Cite web requires |website= (help)
  5. "Integrated weed management for parthenium". The Hindu. Chennai, India. 2003-12-04.
  6. ARC-PPRI Fact Sheets on Invasive Alien Plants and their Control in South Africa|[1]

ఇతర లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.