పుష్పించే మొక్కలు

(Flowering plant నుండి దారిమార్పు చెందింది)


సృష్టిలో జీవులన్నింటిలో సుందరమైనవి పుష్పించే మొక్కలు.

పుష్పించే మొక్కలు
కాల విస్తరణ: Late Jurassic - Recent
Magnolia virginiana flower
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
మాగ్నోలియోఫైటా
Classes

మాగ్నోలియోప్సిడా - ద్విదళబీజాలు
లిలియోప్సిడా - ఏకదళబీజాలు

ప్రధాన లక్షణాలు సవరించు

 • పుష్పించే మొక్కలు దాదాపుగా ఈ భూప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి.
 • ఇవి గుల్మాలుగా గానీ, పొదలుగా గానీ, వృక్షాలుగా ఉండవచ్చు.
 • ఇవి ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలనుగాని లేదా పుష్పాలతో క్రియాసామ్యమైన శంకులనుగాని ఏర్పరుస్తాయి.
 • వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలు ఉంటాయి. సిద్ధబీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. అందువల్ల సంయోగబీజదం పోషణకోసం పూర్తిగా సిద్ధబీజదంపై ఆధారపడి ఉంటుంది.
 • పిండాన్ని కలిగిన బహుకణ విత్తనం ఏర్పడుతుంది.
 • ఇవి సంక్లిష్ట నాళికా కణజాలాలతో బాగా సంవిధానం చెందిన సిద్ధబీజదాన్ని కలిగి ఉండే నిజమైన మొక్కలు.

వర్గీకరణ సవరించు

 
ఏకదళ, ద్విదళబీజాల మొలకలు.

పుష్పించే మొక్కలు ఉపరాజ్యంలో ఒకే ఒక విభాగం ఉంది. అది స్పెర్మటోఫైటా (Spermatophyta). ఇవి ఫలయుతమైన లేదా ఫలరహితమయిన బీజయుత మొక్కలు. వీటిని రెండు ఉపవిభాగాలుగా విభజించారు.

వివృతబీజాలు సవరించు

వివృతబీజాలు (Gymnospermae) అండాశయం, ఫలంలేని పుష్పించే మొక్కలు. వీటి విత్తనాలను కప్పుతూ ఫలకవచం ఉండకపోవడం వల్ల విత్తనాలు నగ్నంగా ఉంటాయి.

ఆవృతబీజాలు సవరించు

ఆవృతబీజాలు (Angiospermae) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే పుష్పంచే మొక్కలు. వీటి విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఆవృతబీజాలు రెండు రకాలు. అవి: 1. ద్విదళబీజాలు: విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం వీటి ప్రధాన లక్షణం. 2. ఏకదళబీజాలు: విత్తనంలో ఒకే బీజదళం ఉండటం వీటి ప్రధాన లక్షణం.

వైవిధ్యం సవరించు

 
వివిధ ఆకారాలు, రంగుల పుష్పాలు.

The most diverse families of flowering plants, in order of number of species, are:

 1. ఆస్టరేసి లేదా కంపోజిటే (daisy కుటుంబం): 23,600 జాతులు[1]
 2. ఆర్కిడేసి (ఆర్కిడ్ కుటుంబం): 21,950 జాతులు[1]
 3. ఫాబేసి లేదా లెగూమినేసి (pea కుటుంబం): 19,400 జాతులు[1]
 4. రూబియేసి (madder కుటుంబం): 13,183 జాతులు[2]
 5. పోయేసి లేదా గ్రామినే (గడ్డి కుటుంబం): 10,035 జాతులు[1]
 6. లామియేసి or Labiatae (mint కుటుంబం): 7,173 జాతులు[1]
 7. యుఫోర్బియేసి (spurge కుటుంబం): 5,735 జాతులు[1]
 8. సైపరేసి (sedge కుటుంబం): 4,350 జాతులు[1]
 9. మాల్వేసి (mallow కుటుంబం): 4,225 జాతులు[1]
 10. అరేసి (aroid కుటుంబం): 4,025 జాతులు[1]

మూలాలు సవరించు

te:ఆవృతబీజాలు