వరూధిని (సినిమా)

1946 సినిమా

వరూధిని, 1946లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది యస్.వి.రంగారావు తొలి చిత్రము. ప్రఖ్యాత తెలుగు ప్రబంధము మనుచరిత్రములోని "వరూధిని" పాత్ర ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఇందులో ప్రవరాఖ్యునిగా ఎస్.వి. రంగారావు, వరూధినిగా దాసరి తిలకం నటించారు.

వరూధిని
(1946 తెలుగు సినిమా)
Varudhini cinema poster.jpg
దర్శకత్వం బి.వి.రామానందం
నిర్మాణం నాగుమల్లి నారాయణమూర్తి,
బి.వి.రామానందం
రచన తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి
తారాగణం యస్.వి.రంగారావు,
ఎ.వి.సుబ్బారావు,
దాసరి తిలకం,
దాసరి కోటిరత్నం,
చిత్తజల్లు కాంతామణి,
రాఘవకుమారి,
అంజనీకుమారి,
కుంపట్ల,
రావులపర్తి
సంగీతం కె.భుజంగరావు
నిర్మాణ సంస్థ అనంద పిక్చర్స్
భాష తెలుగు


ఈ చిత్రం తయారవుతున్న సమయంలో రూపవాణిలో వచ్చిన వార్త ఇలా ఉంది [1] - "ప్రొడ్యూసర్స్ శ్రీ నాగుమిల్లి నారాయణరావు గారు, శ్రీ రామానందంగారు నవనిధులను తృణాలుగా ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని ఈ సంవత్సరమునకు అమూల్యమైన కానుకగా అందిచడానికి రాత్రింబగళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ బి.వి. రామానందంగారి దర్శకత్వంలో విద్యావంతులైన నటీనటులు, విజ్ఞాన సంపన్నులైన టెక్నీషియన్లు, మృదుమధురమైన సంభాషణలు, ఆశ్చర్యకరమగు ట్రిక్కులు, దేశీయమగు భరత నాట్యాలు - సర్వతోముఖంగా వరూధిని తెలుగువారి మన్ననలు పొందడానికి వస్తుంది."


మూలాలుEdit

 
వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా నటించిన ఎస్వీ రంగారావు, వరూధినిగా నటించిన దాసరి తిలకం
 
రూపవాణిలో ప్రకటన