వర్గం చర్చ:భారతీయ మహిళా గాయకులు
తాజా వ్యాఖ్య: 7 నెలల క్రితం. రాసినది: K.Venkataramana
- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
ఈ వర్గం "భారత మహిళా గాయకులు" అని ఉంది. దీనిని సరైన విధంగా మార్చాలి. ఆంగ్లంలో పురుషులకు male singers అనీ, స్త్రీలకు female singers అనీ వాడబడుతోంది. తెలుగు భాషలో గాయకుడు/గాయని లేదా గాయకుడు/గాయకురాలు అనే పురుష, స్త్రీ లింగ పదాలున్నవి. వాటి బహువచనాలు గాయకులు/గాయనులు అని వాడవచ్చు. కనుక ఈ వర్గాన్ని "వర్గం:భారతీయ గాయనులు" అని మార్చితే బాగుండునని నా అభిప్రాయం. అదే విధంగా "మహిళా గాయకులు" అనే పదం కల శీర్షిక గల అన్ని వర్గాలకు "మహిళా గాయకులు" బదులుగా "గాయనులు" అని వాడితే బాగుండునని నా అభిప్రాయం.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:18, 7 మే 2024 (UTC)