చతుర్వర్ణాలు
సంప్రదాయ హిందూ సమాజాన్ని విభజించేందుకు ఉపయోగించిన నాలుగు విభాగాలను సూచించే పదం వర్ణం[1]. వర్ణాశ్రమ ధర్మం భారతీయ వర్ణ వ్యవస్థను సూచిస్తుంది. వేదాంతాల అనుసారం, ఈ వర్ణక్రమం వ్యక్తిగత, సామాజిక జీవితాల స్థితిగతులను వర్గీకరిస్తుంది. ఇది స్థిరీకరించిన క్రమం ఇలా ఉంది.[2]:
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు - వీటికే చతుర్వర్ణాలు లేదా నాలుగు ముఖ్యమైన వర్ణాలుగా పేర్కొన్నారు.
చతుర్వర్ణాలు
మార్చు- బ్రాహ్మణులు -సాత్విక ధర్మాలు అధిక స్థాయిలో గలిగివుంటారు. వీరిని "విద్వాంసుల వర్గం"లో వుంచారు. వీరిలో పురోహితులు, న్యాయపండితులు, మంత్రులు, దౌత్యవేత్తలు వుంటారు.
- క్షత్రియులు -సాత్విక ధర్మాలు మధ్యమ స్థాయిలో కలిగి వుంటారు. వీరిని "అధిక, అధమ రాజస వర్గం"లో వుంచారు. వీరిలో రాజులు, సామంతులు, సైనికులు, రాజస్థ వ్యవస్థను నడిపేవారు (administrators) వుంటారు.
- వైశ్యులు -సాత్విక ధర్మాలు అధమ స్థాయిలో కలిగి వుంటారు. వీరిని "వర్తక నిర్మాణిక వర్గం"లో వుంచారు. వీరిలో వర్తకులు[3], వాణిజ్యకులు[4],, భూస్వాములు వుంటారు.
- శూద్రులు -సాత్విక ధర్మాలు శూన్యస్థాయిలో కలిగివుంటారు. "సేవారంగ వర్గం"లో వుంచారు. వీరిలో కర్షకులు, కార్మికులు వుంటారు.
ఈ పురాతనమైన సమాజ విభజన మొదట వారు ఎన్నుకున్న వృత్తిని బట్టి ఆధారపడివున్నా తర్వాతి కాలంలో "ప్రధానమైన కులాలు"గా పరిణామం చెందింది; మధ్యయుగాల్లో వృత్తులను ఆధారం చేసుకుని సమాజంలో మరింత పటిష్టంగా, బలంగా ఏర్పడిన కులవ్యవస్థకు వర్ణవ్యవస్థకు తరచు అయోమయం చెందుతూంటారు. [5]
వర్ణవ్యవస్థ దొరికిన ఆధారాలను అనుసరించి తొలిసారిగా రుగ్వేదాంతానికి చెందిన పురుష సూక్తములో ప్రస్తావించబడింది. మానవ సమాజంలో ఇంతకన్నా ప్రాచీనమైన త్రివిభాగ సమాజానికి, చిట్టచివరకు పాశ్చాత్య ఎస్టేట్స్ ఆఫ్ రెలిమ్ వంటివాటికి సైద్దాంతికమైన ప్రాతిపదికగా కొందరు చరిత్రకారులు గుర్తిస్తున్నారు.
ఋగ్వేదకాలంలో వృత్తికీ, వర్ణానికి, సంఘ విభాగానికి మధ్యనున్న సంబంధం చాలా సంక్లిష్టమైనది. వర్ణ విభాగ సమాజంలో స్వచ్ఛత, మలినతల విషయాలే కేంద్రమైనవి.[6] పురుష సూక్తం వచ్చేంతవరకూ ఉన్నతవర్గాల వారు గిరిజనుల శ్రమపై ఆధారపడడం అప్పుడప్పుడే ఆవిర్భవిస్తున్న విషయం, అప్పటివరకూ దానికేవిధమైన ఆచారాలు, క్రతువులు, సైద్ధాంతిక స్థిరీకరణలు జరగలేదు.[7] రామ్ శరణ్ శర్మ ప్రకారం "ఋగ్వేద సమాజం శ్రమను ఆధారం చేసుకుని గానీ, సంపదను ఆధారం చేసుకుని గానీ సాంఘికంగా విభజించినది కాదు.. అది ప్రాథమికంగా కుటుంబం, వంశం, తెగ, పరంపరలను ఆధారం చేసుకున్న సంఘం"[8] ఆపైన వచ్చిన వేద కాలంలో వర్ణవ్యవస్థ స్థిరపడింది.[9]
మూలాలు
మార్చు- హిందూ ధర్మంలో వర్ణాలు
- "Varnaashrama System" from Hindupedia, the Hindu Encyclopedia" |హిందూపీడియా
- లాల్, వినయ (2005), Introducing Hinduism, New York: Totem Books, pp. 132–33, ISBN 9781840466263
- Varnasrama Information Database
సూచికలు
మార్చు- ↑ Flood, Gavin. "Hinduism - Hindu concepts". BBC Online. Retrieved 6 November 2014.
- ↑ "Varnaashrama System" from Hindupedia, the Hindu Encyclopedia"
- ↑ Walter Hazen, (2003) Inside Hinduisum (Milliken Publishing company, St.Louis, Missouri, U.S.A) p.4 [1]
- ↑ Arun Kumar (2002). Encyclopaedia of Teaching of Agriculture. Anmol Publications PVT. LTD. pp. 411–. ISBN 978-81-261-1316-3. Retrieved 4 July 2011.[permanent dead link]
- ↑ Mark Juergensmeyer, (2006) The Oxford Handbook of Global Religions (Oxford Handbooks in Religion and Theology), p. 54
- ↑ Thapar, Romila (2004). Early India: From the Origins to AD 1300. University of California Press. p. 63. ISBN 9780520242258.
- ↑ Ram Sharan Sharma (1983). Material culture and social formations in ancient India. Macmillan. p. 51.
- ↑ Sharma, Ram Sharan (1990). Śūdras in Ancient India: A Social History of the Lower Order Down to Circa A.D. 600. New Delhi: Motilal Banarsidass Publishers. p. 10.