ప్రయోగశాలలో పరిశుద్ధ వర్ణపటం ఏర్పరచడానికి వర్ణపటమాపకం అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.దీనిలో ముఖ్యమైన భాగాలు కాలిమేటరు, పట్టక వేదిక, ఖగోళ దూరదర్శిని వృత్తకార ప్రదాన స్కేలు, వెర్నియర్ స్కేలు.[1] [2]లో ఒకదానిలో మరొకటి జరిగే రెండు గొట్టాలు క్షితిజ సమాంతరంగా ఉంటాయి.ఒక గొట్టం చివర వెడల్పు మార్చడానికి వీలున్న నిలువు చీలిక, రెండవదాని చివర కుంభాకార కటకం ఉంటాయి .రేక్-పినియన్ తో వాటి మధ్య దూరాన్ని కటఖ నాభ్యంతరానికి సమానమయేటట్లు చేస్తారు.కాంతిజనకం నుంచి చీలిక ద్వారా కాలిమేటర్ లో ప్రవేశించే అపసారి కిరణాలను కాలిమేటర్ సమాంతర కిరణపుంజంగా చేస్తుంది.తిప్పడానికి వీలులేకుండా మట్టపు మరలున్న ఆధార పీఠానికి కాలిమేటర్ బిగించి ఉంటుంది. ఖగోళ దూరదర్శినిని అక్షంమ్మీదుగా తిప్పవచ్చు.దీనితో పాటు వృత్తకారపు ప్రధాన స్కేలు కూడా తిరుగుతుంది.ఏ స్థానంలో ఆయినా మరసహాయంతో దీనిని తిరగ కుండా బిగించవచ్చు.కొద్ది కోణం తిప్పడానికి స్పర్శ రేఖీయ మర ఉంటుంది. ఖగోళ దూరదర్శినికి గల వస్తు, అక్షి కటకాల మధ్య దూరాన్ని రేక్-పినియన్ మార్చవచ్చు .అక్షి కతకానికి ముందు వస్తు కటక నాభివద్ద ఆద్డ తీగలుంటాయి.కాలిమేటర్ ఎంత ఎత్తులో ఉంటుందో దూరదర్సిని కూడా క్షితిజ సమాంతరంగా అంతే ఎత్తులో ఉంటుంది. కాలిమేటర్, దూరదర్శినుల మధ్యలో పట్టకాన్ని ఉంచడానికి పట్టిక వేదిక ఉంటుంది.వృత్తకారపు స్కేలు కేంద్రం దగ్గర నిలువుకడ్డి మీద రెండు గుండ్రటి పలకలుంటాయి.పలకల మధ్య మూడు మట్టపు మరలుంటాయి.వీటిలో పై పలకను క్షితిజ సమాంతరం చేసి దానితోపాటు రెండు వెర్నియర్ స్కేళ్ళు కూడా తిరుగుతాయి .దీనిని తిరగకుండా బిగించడానికి ఒక మర ఉంటుంది.కొద్దికోణం తిప్పడానికి స్పర్శరేఖీయ మర ఉంటుంది.ఎంత ఎత్తులో కావాలంటే అంత ఎత్తులో పట్టక వేదికను బిగించవచ్చు.Spectrometer - Wikipedia, the free encyclopedia[3]

దస్త్రం:Spectrum
Nitrogen spectrum visible
వర్ణపట మాపకము

మూలాలు మార్చు

  1. ఇంటర్మీడియట్ భౌతిక శస్త్రము ద్వితీయ భాగము
  2. కాలిమేటర్
  3. spectrometer

ఇవి కూడా చూడండి మార్చు

వర్ణపటం

బయట లంకెలు మార్చు