వర్ణపు ఉల్లంఘనం
ఛాయాచిత్రకళలో వర్ణపు ఉల్లంఘనం (ఆంగ్లం: Chromatic aberration లేదా achromatism లేదా chromatic distoration) అనగా ఒక కటకం అన్ని రంగులను ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం అయ్యేలా చెయ్యటంలో విఫలమవ్వటం. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలు గల కాంతికి (అనగా వేర్వేరు రంగులకి) కటకాల యొక్క వక్రీకరణ గుణకముల (Refractive index) లో తేడాల వలన ఈ వైఫల్యం ఏర్పడుతుంది.
దృశ్యమాన వర్ణపటంలోని ఒక్కొక్క రంగు ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం కాలేకపోవటం మూలాన ప్రతిబింబంలోని కాంతివంతమైన, చీకటిమయమైన భాగాలని వేరు చేసే సన్నని గీత పొడవునా వర్ణపు ఉల్లంఘనం చారలుగా ఏర్పడుతుంది. కటక నాభి f వక్రీకరణ గుణకం పై ఆధారపడి ఉండటంతో వివిధ రంగులు వేర్వేరు చోట్ల ప్రసరిస్తాయి.