వలిసె పంట
వలిసె పంట పసుపు రంగు పూల తోట. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సమీపంలోని అరకులో పర్యాటక ప్రధాన ఆకర్షణల్లో ఈ తోటలు ఒకటి.[1]
చరిత్ర:
మార్చువిశాఖ జిల్లా లో ఏజన్సీ ప్రాంతానికి పరిమితమైన ప్రత్యేక పంట వలిసె. దీని నుండి నూనె ను తీస్తారు. వలిసెల సాగు మన్యం లొ ప్రసిద్ధి కెక్కింది. అనంతగిరి మొదలుకొని డుంబ్రిగుడ వరకు అరకు లోయ అందాలను ద్వీగుణీకృతం చేస్తూ ఈ మూడు మండలాల్లో విస్తారంగా వలిసెల సాగు జరుగుతుంది. ఏజన్సీ 11 మండలాల్లోను మెట్ట భూములు, గరువుల్లో గిరిజన రైతులు అనాదిగా వెలిసెల సాగు చేస్తున్నారు.తమ సంప్రదాయ పద్ధతుల్లో వలిసెల నూనె ను తయారు చెసుకుని వంట కు వినియోగిస్తుంటారు.
పంట కాలం:
మార్చుఖరీఫ్ వరి పనులు ముగిసిన తర్వాత గిరిజన రైతులు సెప్టెంబరు లో ఈ వలిసెల సాగును చేపడతారు. తొంబది రోజులకే పంట దిగుబడి వస్తుంది. ఎకరానికి 80-100 కిలోల వరకు వలిసెల దిగుబడీ వస్తుంది. భూసారం తగ్గి, నాణ్యమైన విత్తనాలు దొరకని స్థితి లో రజ్మా, వేరుసెనగ వంటి ఇతర ప్రత్యామ్నాయ పంటలను చేపడుతున్నారు.
విశాఖ జిల్లా లో సాగు విస్తీర్ణం:
మార్చుమండలం | విస్తీర్ణాం (హెక్టార్ల లో) |
---|---|
ముంచంగిపుట్టు | 1348 |
డుంబ్రిగుడ | 1320 |
అరకులోయ | 1231 |
పెదబయలు | 884 |
అనంతగిరి | 605 |
హుకుంపేట | 368 |
జి.మాడూగుల | 177 |
జి.కే.వీధి | 227 |
పాడేరు | 222 |
చింతపల్లి | 462 |
కొయ్యూరు | 45 |
ప్రస్తుత పరిస్తితి
మార్చుఒకప్పుడు విస్తారం గా ఉండి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ఈ పంట కనుమరుగయ్యే పరిస్త్ఘితి నెలకోంటోంది. దశాబ్ద కాలం పాటు అరకు లోయ ప్రాంతం లో ఈ వలిసెల సాగు విస్తారంగా సాగింది.వేలాది ఎకరాల్లో సాగైన ఈ వలిసెలు ప్రస్తుతం మన్యం లో అంతరిస్తున్న పంట గా మారింది.సాగు విస్తీర్ణం గణనీయం గా తగ్గిపోయింది.నాణ్యమైన విత్తనాలు లభ్యం కాని పరిస్తితి. దిగుబడి తగ్గడం. భూసారం లేకపోవడం వల్ల మొక్కల ఎగుమతులలో లోపం ధర తొ పాటు వలిసె నునె వినియోగం తగ్గడం తో ఈ వలిసెల నూలె వినియోగానికి దూరమవుతున్నారు. గత కొన్నేళ్ళుగా గిరిజనుల సమ్ప్రదాయ పంటలపై ఐటిడిఏ తోడ్పాటు కూడా కరువయ్యింది. ప్రత్యామ్నాయ పంటలతో పాటు అనేక రకాల వంట నూనెలు మార్కెట్ లోకి అందుబాటు లొకి రావడం తో వలిసెల సాగు పై గిరిజనులకు ఆశక్తి తగ్గింది. శ్రమ ఎక్కువగా ఉండడం తో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభించక పొవడం
భవిష్యత్ ప్రణాలిక
మార్చుగిరిజన సంప్రదాయ సాగు గా ఉన్న ఈ వలిసెల పంటను విస్తరించాలనేది ఐటిడిఏ,ఉధ్యానవన శాఖల ముఖ్య ఉద్ధేశ్యం ను సఫలం చేసే దిశ గా అడుగులు పడుతున్నాయి.
భుసారం పెంచుకోవడనికి అవసరమైన తొడ్పాటును,నాన్యమైన విత్తణాల సరఫారా ను చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రొత్త వంగడల సరఫరా ను చేయడనికి ప్రభుత్వం ప్రయత్నిస్తుది. ఈ ఏడాది చింతపల్లి వ్యవసాయ పరిశోదనా కేంద్రం ద్వారా కేగిఎన్-2 రకం వలిసె విత్తనాలను చింతపల్లి, గూడెం కొత్తవీధి, పాడేరు మండలాల్లొ పంపిణీ చేసారు.సాగులో మెలకువలను వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారు రైతులకు అవగాహన కల్పించారు.
మూలాలు
మార్చు- ↑ సాక్షి దిన పత్రిక అక్టోబరు 6 , 2018 Visakhapatnam district edition, page.16