వాచికాభినయం

చతుర్విధ అభినయములు లలో రెండవది. మాటల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తూ నటించడమే వాచికాభినయం. నటనలో వాచికభినయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాటలు చదివనట్లుగా ఉండకూడదు. వాచికాభినయం అనేది సంగీతంలో సమానం. పాటలు పాడడానికి శిక్షణ ఎంత అవసరమో వాచికాభినయానికి కూడా అంతే అవసరం. సాధన చేసిన గొంతుతో మాట్లాడినపుడు మాటలు వినసొంపుగా ఉంటాయి. రససిద్ధి కలుగుతుంది. చెబుతున్న మాటలకు అర్థం తెలిసేవిధంగా, దానికనుగుణమైన ధ్వనిని కలిపి, భావాల యొక్క ప్రతిరూపాన్ని సృజనాత్మకంగా ప్రేక్షకుల కళ్లముందుంచగలిగితే వారు ముగ్ధులవుతారు.

మాటలు పలికేటపుడు శబ్ధాలకు, పదాలకు తగిన నిడివి ఇస్తూ దీర్ఘాలు, హ్రస్వాలను లయ తప్పకుండా, ఉచ్చరణ దోషాలు లేకుండా, సమాసాలకు అర్థవంతంగా విరుపులు ఇస్తూ పాత్ర స్వరూపాన్ని అందించాలి. అప్పుడే చెప్పే మాటలకు విలువ, ధరించే పాత్రకు జీవం చేకూరుతాయి.

నాటకంలో పాత్ర అభినయిస్తూ మాట్లాడడంలో అనేక రకాల గమనాలు ఉన్నాయి. వీటిని సందర్భాన్ని బట్టి రకరకాలుగా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాని, ఏ రకమైన గమనానికైనా మాట్లాడేటపుడు స్పష్టమైన ఉచ్ఛారణ, బలమైన ధ్వని తరంగాలు తప్పనిసరిగా ఉండాలి.

ప్రేక్షకులకు వినిపించేవిధంగా తగిన స్థాయిలో ఆరోహణ, అవరోహణలు పాటిస్తూ, లయబద్ధంగా చెబుతూ రసోత్పత్తి జరిగేట్టు స్పష్టంగా చెప్పాలి. సాధన ద్వారా కొన్ని వాచిక దోషాలను కూడా సవరించకునే అవకాశం ఉంది.

మూలాలుసవరించు

వాచికాభినయం, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.546.