వాడుకరి:ద్వారపురెడ్డి రవితేజ/వేదనాయగం శామ్యూల్ అజరియా
దళిత్ నాయక్ వేదనాయగం శామ్యూల్ అజరియా, CoE, LL. D. Honoris causa (Cantab.)[1] డోర్నకల్ బిషప్పు (1912-1945) | |
---|---|
ది రైట్ రెవరెండ్ | |
చర్చి | Church of England in India |
బిషప్ పర్యవేక్షణ ప్రాంతం | డోర్నకల్ |
In office | 1912 to 1945 |
అంతకు ముందు వారు | Position created |
తర్వాత వారు | ఎ. బి. ఇలియట్, సిఎస్ఐ |
ఆదేశాలు | |
సన్యాసం | 1909 |
సన్యాసం | బెంగాల్ ప్రెసిడెన్సీ) | 1912 డిసెంబరు 29 , సెయింట్ పౌల్స్ కేథడ్రాల్, కలకత్తా (
ర్యాంకు | బిషప్పు |
వ్యక్తిగత వివరాలు | |
జన్మనామం | వేదనాయగం శామ్యూల్ అజరయ్య |
జననం | వెల్లలన్విలై, మద్రాసు ప్రెసిడెన్సీ (బ్రిటిషు పాలన) | 1874 ఆగస్టు 17
మరణం | 1945 జనవరి 1 డోర్నకల్, హైదరాబాదు రాష్ట్రము | (వయసు 70)
Buried | ఎపిఫెనీ కేథడ్రాల్ కంపౌండు, డోర్నకల్ |
విలువ గలది | క్రైస్తవ్యం |
మునుపటి పోస్ట్ | జట్టు సభ్యుడు, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైఎంసిఎ) |
విద్య | అండర్ గ్రాడ్యుయేషన్ (పూర్వస్నాతకం) |
పూర్వ విద్యార్థి | మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ, తాంబరం |
Sainthood | |
విందు రోజు | 2 జనవరి |
Venerated in | ఆంగ్లికన్ కమ్యూనియన్ |
బిషప్పు వేదనాయగం శామ్యూల్ అజరియా (17 ఆగష్టు 1874 - 1 జనవరి 1945)[2](వేదనాయకం శామ్యూల్ అజరియా అని కూడా లిప్యంతరీకరించబడింది) ఒక భారతీయ సువార్తికుడు మరియు ఆంగ్లికన్ కమ్యూనియన్ చర్చిలలో మొదటి భారతీయ బిషప్పుగా , డోర్నకల్[3] డయోసీస్ యొక్క మొదటి బిషప్పుగా పనిచేశారు. భారతదేశంలో క్రైస్తవ మతానికి మార్గదర్శకుడైన అజారియా, మహాత్మా గాంధీతో సంక్లిష్ట సంబంధాన్ని కలిగి ఉన్నాడు. గాంధీ కనీసం ఒక్కసారైనా అతనిని వలస పాలనలో ఉన్న భారతీయుల "ప్రథమ శత్రువు" అని పిలిచాడు.
ప్రారంభం మరియు కుటుంబ జీవితం
మార్చువేదనాయకం శామ్యూల్ అజరియా 1874లో భారత దేశానికి దక్షిణాన ఉన్న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వెల్లలన్విలై గ్రామంలో క్రైస్తవ (ఆంగ్లికన్) మతాధికారియైన థామస్ వేదనాయకం మరియు అతని రెండవ భార్యయైన ఎలెన్‌లకు జన్మించారు. అతని కుటుంబం గతంలో సాంప్రదాయ హిందువులు అంతేకాక శివునికి అంకితం చేయబడినవారు ( అందుకే ఆ తమిళ కుటుంబ పేరైన వేదనాయకం అనేది బహుశా శివుని త్రిశూలన్ని లేదా అతని కుమారుడు మురుగన్ యొక్క అనేక పేర్లలో ఒకటిగా ప్రతిబింబిస్తుంది ). [4] థామస్ 1839లో చర్చి మిషనరీ సొసైటీ పాఠశాలలో ఉన్నప్పుడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అతను తన కొడుకుకు పాత నిబంధన ప్రవక్త పేరు మీద శామ్యూల్ అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఈ జంటకు ఒక కుమార్తె జన్మించిన తర్వాత 13 సంవత్సరాల వ్యవధి వచ్చింది. థామస్ 1889లో మరణించాడు, కానీ భక్తురాలైన తల్లి శామ్యూల్‌ను పెంచింది, అతనిని 10 సంవత్సరాల వయస్సులో క్రిస్టియన్ మిషనరీ బోర్డింగ్ పాఠశాలలకు పంపింది. అంతేకాక శామ్యూల్ సవతి సోదరుడైన ఆంబ్రోస్ నడుపుతున్న మేగ్నానపురం మిషనరీ బోర్డింగ్ పాఠశాలకు కూడా పంపినది ఎందుకంటే దానికి సంబంధిత బాలికల పాఠశాలకు గృహ మరియు వైద్య ఏర్పాట్లకు బాధ్యత వహించే మహిళగా తను నియమించబడింది. తిరునెల్వేలిలోని పాఠశాలలో (బ్రిటీష్ పాలనలో దీనిని తిన్నెవెల్లి అని పిలిచేవారు), అజారియా కుల భేదాలను అధిగమించడానికి ఒక సమాజాన్ని స్థాపించడంలో సహాయం చేశాడు. అది అతని కులం వారిలో పెద్దగా పేరుగాంచనలేప్పటికీ , తన వృత్తి ఎలా ఉండబోతోందో ముందుచూపునిచ్చింది.
శామ్యూల్ వేదనాయకం ప్రాంతీయ రాజధాని అయిన చెన్నైకి(అప్పట్లో మద్రాస్ అని పిలిచేవారు) పంపబడ్డాడు , అక్కడ మద్రాస్ క్రిస్టియన్ కళాశాల యొక్క బ్రిటీషు ప్రిన్సిపాల్ అతన్ని ఇతర అబ్బాయిల నుండి వేరు చేయడానికి అజరియా అనే పేరు పెట్టారు.[6] అక్కడ, అతని క్లాస్‌మేట్స్‌లో కెటి పాల్ (1876-1931) ఉన్నారు, అతనితో కలసి అజారియా తరువాత పని చేస్తాడు. అమెరికన్ మిషనరీ షేర్వుడ్ ఎడ్డీతో కూడా ఆజరియా పరిచయం కలిగి ఉన్నాడు తరువాత అతను జీవితకాల స్నేహితుడయ్యాడు. అజారియా తన అన్నయ్యలలో ఒకాయనలానే గణితాన్ని అభ్యసించాడు, ఆ అన్నయ్య మిషనరీ అయ్యాడు. కానీ అజారియా ఎప్పుడూ డిగ్రీని అందుకోలేదు ఎందుకంటే అతను 1893లో తన కోర్స్‌వర్క్‌ను పూర్తి చేసినా కానీ తన చివరి గణిత పరీక్షకు కొద్దిసేపటి ముందు అనారోగ్యం పాలయ్యాడు తరువాత దానిని తిరిగి పరీక్ష వ్రాయకూడదని నిశ్చయించుకున్నాడు. తరువాత అజారియా బి. ఎ(ఆంగ్లంలో బోర్న్ ఎగైన్ లేదా తిరిగి జన్మించుట) కాకుండా తమ బి.ఎ డిగ్రీలను గొప్పగా చూపించే వారిని ఎద్దేవాచేసేవాడు.
డిగ్రీకి చేయడానికి బదులుగా అజారియా 19 సంవత్సరాల వయస్సులో నాన్‌డెనామినేషనల్ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వై.ఎమ్.సి.ఎ) లో సువార్తికుడు అయ్యాడు. 1895 నాటికి, అతను వై.ఎమ్.సి.ఎ ఆధ్యాత్మిక సమావేశాలకు నాయకత్వం వహించాడు మరియు మద్రాసులో కొత్త శాఖను ప్రారంభించాడు. 1896లో అతను సువార్తికుడు జాన్ మోట్‌ను కలిశాడు , అతను ఆజరియా ఉత్సాహాన్ని సానుకూలతతో గుర్తించాడు. 1902లో అజారియా తమిళుల మధ్య సువార్త ప్రకటించడానికి శ్రీలంకలోని జాఫ్నాకు వెళ్లాడు , ఇది తిన్నెవెల్లీ చర్చి సువార్తీకరణకు ఎంతగా అవకాశముందో తనని పునఃపరిశీలించేలా చేసింది. మరుసటి సంవత్సరం, అజారియా దీర్ఘకాలంగా ఆచరణలోలేని ప్రతిపాదనను పునరుద్ధరించాడు మరియు తద్వారా భారతీయ మిషనరీ సొసైటీ (తిన్నెవెల్లిలో ఆధారితం) ఏర్పాటు చేయడంలో సహాయపడింది. దీని ద్వారా తోటి తమిళ క్రైస్తవులు వారి సోదరుల మధ్య సువార్త ప్రచారం చేయవచ్చు. అజరియా 1895 నుండి 1909 వరకు దక్షిణ భారతదేశంలోని వై.ఎం.సి.ఎ కార్యదర్శిగా కూడా పనిచేశాడు అంతేగాక క్రైస్తవ మిషన్‌లో స్వదేశీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి నమ్మకం కలిగి ఉన్నాడు. 1905 సంవత్సరంలో క్రిస్మస్ రోజున, పశ్చిమ బెంగాల్‌లోని సెరాంపూర్‌లోని కేరీ యొక్క లైబ్రరీలో , అజరియా కార్యదర్శిగా ఇంటర్‌డినామినేషనల్ నేషనల్ మిషనరీ సొసైటీ స్థాపించబడింది, మరియు ఇది భారతదేశంలోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ మరియు నేపాల్‌లో కూడా సువార్త ప్రచారం చేసే ఉద్దేశ్యంతో స్థాపించబడింది . 17 మందితో కూడిన ఆ సొసైటీ వ్యవస్థాపకులలో ఇతర ప్రముఖ వ్యక్తులుగా కే.టి. పాల్, జె. డబ్ల్యూ.ఎన్. హెన్స్మన్, సవరిరాయన్ జేసుదాసన్ మరియు ఎర్నెస్ట్ ఫారెస్టర్ పేటన్ ఉన్నారు.[ citation needed ] ఇంకా 1907లో, అజరియా టోక్యోలో జరిగిన వరల్డ్ స్టూడెంట్ క్రిస్టియన్ ఫెడరేషన్ సమావేశానికి మరియు షాంఘైలో జరిగిన వై.ఎం.సి.ఎ సమావేశానికి హాజరయ్యాడు అంతే కాకుండా జపాన్ మరియు చైనాతో పాటు భారతదేశానికి కూడా సువార్త ప్రచారం చేసే వ్యూహాలపై ఆసక్తి చూపించాడు. అతను పాశ్చాత్య ఆధిపత్యం నుండి ఆసియాను విముక్తి చేయాలనే జాతీయవాదుల పిలుపు కంటే ఆసియా వారిని క్రైస్తవులుగా మార్చే ఆసియా ప్రాపంచిక ధ్యేయంపై దృష్టి సారించాడు.
1898లో అంబు మరియమ్మల్ శామ్యూల్‌ను అజరియా వివాహం చేసుకున్నాడు, దక్షిణ భారతదేశంలో కళాశాల కోర్సును అభ్యసించిన మొదటి క్రైస్తవ మహిళల్లో ఒకరైన ఆమెను "తిరునెల్వేలిలో అత్యంత ఆధ్యాత్మికంగా ఆలోచించే అమ్మాయిగా అజరియా అభివర్ణించాడు.[4]వారి వివాహం అనేక స్థానిక మత సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసింది లేదా పునర్నిర్వచించింది. ఎందుకంటే పెళ్లికి ముందు వధువు మరియు వరుడు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకున్నారు. కట్నం ఆచారాలను అలక్ష్య పెట్టి వేడుకకు కేవలం 40 రూపాయల బడ్జెటు కేటాయించారు అంతే కాకుండా బుధవారం రోజున వివాహం జరుపుకున్నారు. [8] ఈ జంటకు నలుగురు కుమారులు (జార్జ్, హెన్రీ, ఎడ్విన్ మరియు ఆంబ్రోస్) ఉన్నారు . ) మరియు ఇద్దరు కుమార్తెలు (గ్రేస్ మరియు మెర్సీ) .[9]
పరిచర్య
మార్చు1909లో, 35 సంవత్సరాల వయస్సులో, అజరియా ఆంగ్లికన్ మతగురువుగా నియమితుడయ్యాడు, వై.ఎం.సి.ఎ లో తన పదవులను విడిచిపెట్టి, తెలుగు నేర్చుకుని డోర్నకల్‌లో మిషనరీగా జీవితాన్ని మొదలుపెట్టాడు . ఆ మిషన్‌ను ఇండియన్ మిషనరీ సొసైటీ ఆఫ్ తిన్నెవెల్లీ ప్రారంభించింది మరియు రెవ. అజరియా 1910 లో ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ మిషనరీ సమావేశంతో సహా స్వదేశీకరణ ఆవశ్యకతపై విస్తృతంగా మాట్లాడటం కొనసాగించారు.
మూడు సంవత్సరాల మతాధికారిగా పనిచేసిన తర్వాత 1912 లో 29 డిసెంబరున, కలకత్తాలోని సెయింట్ పాల్స్ కేథడ్రల్‌లో డోర్నకల్ యొక్క క్రొత్త డయోసిస్‌కి మొదటి బిషప్పుగా అజరియాను నియమించారు . [5] ఈ సందర్భంగా హాజరైన మిషనరీ డాక్టర్. జె.ఆర్.మోట్ , ఇది తాను చూసిన అత్యంత ఆకర్షణీయమైన వేడుకలలో ఒకటిగా పేర్కొన్నాడు. భారతదేశ కార్యాచరణ పరిధిలోని 11 మంది బిషప్పులు ఆ నియమించే కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనివల్ల రైట్. రెవ. అజరియా, ఆంగ్లికన్ కమ్యూనియన్ బిషప్పుగా నియమించబడిన మొదటి భారతీయుడయ్యాడు . అన్ని ప్రాంతాల నుండి మరియు ముఖ్యంగా కొత్త బిషప్ సొంత ప్రదేశం అయిన తిన్నెవెల్లీ నుండి భారతీయులు తమ విశిష్ట సోదరుడిని సత్కరించడానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. [6] ఆ సందర్భంగా కేనన్ ఎడ్వర్డ్ సెల్ చేసిన ఉపన్యాసం వెంటనే ప్రచురించబడింది మరియు అందుబాటులో ఉంది.[7]
ప్రారంభంలో డోర్నకల్ డయోసిస్ చిన్నది, బిషప్ అజారియా అధికారిగా ఉన్న సమయంలో అభివృద్ధి చెందింది. మొదట్లో అది నిజాం ఆధిపత్యంలోనున్న హైదరాబాదులోని ఆగ్నేయ మూలను కలిగిఉంది , అది త్వరగానే చర్చి మిషనరీ సొసైటీ (సి. ఎం.ఎస్) పనిచేసిన దుమ్మగూడెం జిల్లాలోకి చేర్చబడింది. 1920లో, ఎపిస్కోపల్ సైనాడ్ తెలుగుదేశంలో సువార్త ప్రచారం చేసిన అన్ని ప్రాంతాలు అనగా చిన్న చర్చి(సి. ఎం.ఎస్) గాని లేదా హై చర్చి సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ గాస్పెల్(ఎస్.పి.జి) గాని ఈ డయోసిస్‌లో భాగంగా మారాలని తీర్మానించింది తద్వారా ఆ డయోసిస్ భారతదేశంలోనే అతిపెద్దదిగా(క్రైస్తవుల సంఖ్య పరంగా) పరిణామం చెందింది. ఆ విధంగానే కృష్ణా మరియు గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలు జోడించబడ్డాయి ; ఎస్.పి.జి ద్వారా సువార్త ప్రకటించబడ్డ కర్నూలు మరియు కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, అలాగే హైదరాబాద్ స్టేట్‌లోని భారతీయ మిషనరీ సొసైటీ ఆఫ్ తిన్నెవెల్లి, సింగరేణి మిషన్, ఖమ్మంమెట్ మిషన్ (గతంలో చర్చి మిషనరీ సొసైటీ క్రింద ఉండేది) మరియు క్రొత్తగా ఏర్పడిన డోర్నకల్ డయోసీసన్ మిషన్ (ములగ్ తాలూకు) జోడించబడ్డాయి. త్వరలో, కొత్త బిషప్ తన డయోసిస్ యొక్క బహుళ జాతి మరియు సాంస్కృతిక సంప్రదాయాలను (ముస్లిం, హిందూ మరియు క్రైస్తవ నిర్మాణ అంశాలను విలీనం చేసి) ప్రతిబింబించేలా కేథడ్రల్ రూపకల్పన చేయడం మరియు నిధులను సేకరించడం ప్రారంభించాడు, ఇది ఎట్టకేలకు 1936లో పూర్తి చేయబడి మరియు ఎపిఫనీ కేథడ్రల్‌గా ప్రతిష్ఠించబడింది.
బిషప్పు అజరియా తన క్రొత్త కేథడ్రల్ సమీపంలోని ఒక గుడారంలో కొంతకాలం నివసించాడు, కానీ అతని ఎపిస్కోపేట్‌లో ఎక్కువ భాగం తన భార్య మరియు సహోద్యోగియైన అన్బుతో కలిసి తన విస్తారమైన డయోసిస్‌లో ఎద్దుల బండి లేదా సైకిల్ మీద ప్రయాణించాడు. అతని గ్రామ ఉపన్యాసాలు తరచుగా "నాలుగు రాక్షసులపై దాడి చేస్తాయి. అవేంటంటే మురికి, వ్యాధి, అప్పు మరియు మద్యపానం." [8] అతను ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ ఆసియాలోని క్రైస్తవ మతంలో అట్టడుగు స్థాయిలో జరిగే మతమార్పిడులకు సంబంధించి అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిరూపించబడ్డాడు. ఆప్యాయతగల గౌరవప్రదమైన తండ్రిగారు ("పాదరి") అని ప్రసిద్ధి చెందిన అజరియా, దాదాపు 200,000 బహిష్కరించబడిన మాలలు మరియు మాదిగలు, గిరిజనులు మరియు నిమ్న-కుల బ్రాహ్మణేతరులను తన అభివృద్ధి చెందుతున్న చర్చిలోకి తీసుకువచ్చిన సామూహిక ఉద్యమాలను ప్రేరేపించాడు. [9] అతను బాలికలకు విద్యనందించడానికి ఒక పాఠశాలను కూడా స్థాపించాడు, తరువాత కాలంలో అది అతని పేరునకు మార్చబడింది. 1924 నాటికి, డోర్నకల్ డయోసిస్‌లో 8 మంది ఆంగ్లేయులుగా జన్మించిన మతాధికారులు మరియు 53 మంది భారతీయ మతాధికారులు ఉన్నారు. 1935 నాటికి, అతని డయోసిస్‌లో 250 మంది నియమించబడిన భారతీయ మతాధికారులు మరియు 2,000 మందికి పైగా గ్రామ ఉపాధ్యాయులు, వైద్యశాలలు, సహకార సంఘాలు మరియు ముద్రణా యంత్రాలు ఉన్నాయి. [10]
బిషప్పు, మతపరమైన ప్రాతినిధ్యం మరియు మతపరమైన స్వేచ్ఛకై పోరాటాలు జరుగుతున్న సమయంలో ఎం.కె.గాంధీకి మిత్రుడు మరియు ప్రధాన శత్రువు రెండూ అయ్యాడు.[9] ఒక భారతీయ జాతీయవాది అయినప్పటికీ, అజరియా హిందూమతం స్వాభావికంగా అణచివేత మరియు విధ్వంసకరమైన కుల వ్యవస్థచే స్థాపించబడిందని నమ్మాడు. మరోవైపు, గాంధీ క్రైస్తవ్యంలోనికి మత మార్పిడులు జరగడాన్ని ముప్పుగా భావించారు.
రైట్. రెవ. అజరియా, 1912 నుండి 1945లో మరణించే వరకు ఆంగ్లికన్ డయోసిస్‌కి చెందిన మొదటి బిషప్పుగా మరియు స్థానిక భారతీయ బిషప్పుగా కొనసాగిన ఏకైక వ్యక్తి అయ్యాడు . 1920లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అతనికి గౌరవ పట్టాని ప్రదానం చేసింది. భారతీయ గ్రామీణులకు సమర్థవంతమైన సువార్తికుడుగా మరియు బ్రిటిష్ చర్చి సోపానక్రమంలో గౌరవనీయమైన బిషప్పుగా, అజరియా బ్రిటీషు వారి సామ్రాజ్య సంఘాల చివరి దశలో సాధారణ భారతీయుల మరియు బ్రిటీష్ ఉన్నతవర్గాల మధ్య ప్రత్యేకమైన వారధిని ఏర్పరచాడు. అతను ముఖ్యంగా గ్రామీణ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందాడు, అక్కడ అతను "దళిత నాయక్" (కుల బహిష్కరణ చేయబడిన వారి నాయకుడు) అనే పేరుతో పిలువబడ్డాడు. అతను భారతదేశంలో ప్రొటెస్టంట్ ఏకీకరణకు గౌరవనీయమైన నిర్మాత మరియు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాల ఐక్యతా ఉద్యమానికి మార్గదర్శకుడు. [11]
బిషప్పు హెన్రీ వైట్‌హెడ్‌తో కలిసి బిషప్పు వేదనాయకం అజరియా క్రైస్ట్ ఇన్ ద ఇండియన్ విలేజస్ (1930) అనే పుస్తకాన్ని వ్రాసాడు . [12] దాని మునుపటి సంవత్సరం, అతను "ఇంటర్నేషనల్ రివ్యూ ఆఫ్ మిషన్స్"లో రెండు కథనాలను ప్రచురించాడు. 1936లో వి.ఎస్.అజరియా, "ఇండియా అండ్ ది క్రిస్టియన్ మూవ్‌మెంట్" మరియు "సౌత్ ఇండియా యూనియన్: యన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది స్కీమ్ ఫ్రమ్ ది ఆంగ్లికన్ పాయింట్ ఆఫ్ వ్యూ" అలాగే "ది చర్చ్ అండ్ ఇవాంజెలిజం: బీయింగ్ స్టడీస్ ఆన్ ది ఇవాంజలైజేషన్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ఎర్లీ చర్చి హిస్టరీ" లను ముద్రించాడు. అతని అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకం, క్రిస్టియన్ గివింగ్ (1940), ఆన్‌లైన్‌లో ఇంకా ఉచితంగా అందుబాటులో లేనప్పటికీ, తరువాత 15 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. అజరియా క్రైస్తవ మిషన్ పై 'ప్రపంచంలోని మిషనరీ సంస్థకు క్రైస్తవ ఐక్యత యొక్క ఆవశ్యకత' మరియు 'క్రైస్తవ మత విస్తరణ' వంటి కథనాలను కూడా రాశాడు, అలాగే తన మాతృభాష అయిన తమిళంతో పాటు తెలుగులోనూ అనేక రచనలను ప్రచురించాడు.
మరణం మరియు వారసత్వం
మార్చుబిషప్పు అజరియా 1945 జనవరి 1న డోర్నకల్‌లో మరణించారు. ఆయన మరణించే సమయానికి డోర్నకల్ 200,000 మంది సభ్యులతో డయోసిస్‌గా ఉండేది. రెండు సంవత్సరాల తరువాత, అతని కలలలో ఒకటి సాకారం చేయబడింది అదేంటంటే సంస్కరణ మొదలుకొని మొదటిసారిగా ఎపిస్కోపల్ చర్చ్ (ఆంగ్లికన్)ను నాన్-ఎపిస్కోపల్ చర్చిలతో (కాంగ్రిగేషనల్, ప్రెస్బిటేరియన్, మెథడిస్ట్) ఏకీకృతం చేస్తూ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏర్పడింది.
డయోసిస్ యొక్క ఏకైక కళాశాల, డోర్నకల్‌లోని బిషప్పు అజరియా కళాశాల, అతని పేరు మీద పెట్టబడింది మరియు ఆ కళాశాల క్రైస్తవులకు మరియు క్రైస్తవేతరులకు ఇద్దరికీ విద్యనందించింది. అతను స్థాపించిన బాలికల పాఠశాల పేరు కూడా అతని గౌరవార్థం మార్చబడింది. [13] అతని స్వస్థలమైన వెల్లలన్విలైలోని మాధ్యమిక పాఠశాల కూడా ఇప్పుడు అతని గౌరవార్థం అతని పేరు పెట్టబడింది.
ఆగ్నేయ లండన్లోని బ్రోమ్లీలోని సెయింట్ మార్క్స్ చర్చిలో బిషప్ అజరియాకు స్మారక కిటికీ ఉంది, అక్కడ ఆయనతో పాటు బిషప్లు శామ్యూల్ అజయ్ క్రోథర్ మరియు జాన్ ప్యాట్సన్ ఉన్నారు.
వేదనాయకాన్ని 2వ జనవరి స్మారకోత్సవంతో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో జ్ఞాపకం చేసుకున్నారు. [14]
మరింత చదవండి
మార్చు- కె. హీబెర్గ్, వి.ఎస్. అజారియా (1950)
- బి.పి. ఎమ్మెట్, అపోస్టిల్ ఆఫ్ ఇండియా, అజరియా, బిషప్ ఆఫ్ డోర్నకల్ (1949)
- సి. గ్రాహం, అజారియా ఆఫ్ డోర్నకల్ (1946)
- జె.జి.హోడ్జ్, బిషప్ అజరియా ఆఫ్ డోర్నకల్ (1946)
ప్రస్తావనలు
మార్చు- Melton, J. Gordon (2005). Encyclopedia of Protestantism. New York: Facts on File, Inc., pp. 59-60.
- Sundaram, K. J. G. (February 1931). "A Deccan Village in India". Journal of Geography. 30 (2): 49–57. Bibcode:1931JGeog..30...49S. doi:10.1080/00221343108987303.
- Billington at p. 16n.24
- [1]
- Malden Richard (ed) (1920). Crockford's Clerical Directory for 1920 (51st edn). London: The Field Press. p. 424.
- Chatterton, Eyre (1924). "The Diocese of Dornakal, 1912. A Diocese of Mass Movements". A History of the Church of England in India since the early days of the East India Company. London: SPCK – via Project Canterbury.
- "Strengthened with Might, by Edward Sell (1912)".
- [2]
- "Azariah, Vedanayagam Samuel (1874-1945) | History of Missiology".
- [3]
- Harper, S. B. (2000). In the Shadow of the Mahatma: Bishop V. S. Azariah and the Travails of Christianity in British India. Grand Rapids, MI: William B. Eerdmans Publishing Company.
- Azariah, V. S.; Whitehead, Henry (1930). Christ in the Indian Villages. London: SCM Press.
- "Bishop V. Samuel Azariah, 2 January".
- "The Calendar". The Church of England (in ఇంగ్లీష్). Retrieved 2021-03-27.
బాహ్య లంకెలు
మార్చు- లెక్షనరీ వనరులు
- ప్రాజెక్ట్ కాంటర్బరీ నుండి గ్రంథ పట్టిక డైరెక్టరీకాంటర్బరీ ప్రాజెక్ట్
[[వర్గం:1945 మరణాలు]] [[వర్గం:1874 జననాలు]]
- ↑ Constance M. Millington, An Ecumenical Venture: The History of Nandyal Diocese in Andhra Pradesh, 1947-1990, ATC, Bangalore, 1993, p.12.[4]
- ↑ Melton, J. Gordon (2005). Encyclopedia of Protestantism. New York: Facts on File, Inc., pp. 59-60.
- ↑ Sundaram, K. J. G. (February 1931). "A Deccan Village in India". Journal of Geography. 30 (2): 49–57. Bibcode:1931JGeog..30...49S. doi:10.1080/00221343108987303.
- ↑ [5]