వాడుకరి:రవిచంద్ర/తెవికీ వార్త
భారత్ లో కార్యాలయం ఏర్పాటు చేయనున్న వికీపీడియా
మార్చుభారతీయ భాషల్లో సమాచారం పెంచడానికి వీలుగా ఆరు నెలల్లోపు వికీమీడియా ఫౌండేషన్ భారత్ లో ఓ కార్యాలయం ప్రారంభించనున్నట్లుగా నవంబర్ 1, 2010 న ముంబై ని సందర్శించిన వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ తెలియజేశారు. ఈ కార్యాలయం ఇప్పటికే బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన వికీమీడియా ఇండియన్ చాప్టర్ కు అనుబంధంగా పనిచేస్తుంది.
ఈ కార్యాలయంలో ముగ్గురు లేదా నలుగురు మనుషులు ఉండవచ్చు. ఇది పెద్ద పెట్టుబడేం కాదు. కానీ ఇక్కడ ఆఫీసు ఉండటం వల్ల ప్రాంతీయ భాషల కమ్యూనిటీతో సంప్రదింపులు సులువౌతాయని ఆశిస్తున్నాం. వికీపీడియా విషయ సేకరణ గురించి జిమ్మీ వేల్స్ మాట్లాడుతూ ప్రజల్ని ఉత్తేజితుల్ని చేయడం ద్వారా మరింత సమాచారాన్ని పోగు చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. 2015 సంవత్సరం లోపు ముఖ్యమైన 10 భారతీయ భాషల్లో మెరుగైన సమాచారం లభ్యమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటి దాకా హిందీ వికీపీడియా 57,823; తెలుగు 45,963; గుజరాతీ 17,142, మలయాళం 14,830 వ్యాసాలు రూపుదిద్దుకున్నాయి. ఇలాంటి ప్రోత్సాహకరమైన అభివృద్ధి వల్లే తాము భారత్ వైపు చూస్తున్నట్లు జిమ్మీ వేల్స్ తెలియజేశారు. భారత్ ఖచ్చితంగా మాకు ముఖ్యం. ఇక్కడి నుంచి చాలా మంది ఈ వెబ్‌సైట్ ను వీక్షిస్తున్నారు.
భారత్ నుంచి వికీమీడియాకు జరిగిన దిద్దుబాట్లలో 81% ఆంగ్ల వికీపీడియా వే కావడం గమనార్హం. ఇంకా ప్రాంతీయ భాషల్లో దిద్దుబాట్లు నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి.
గణాంకాలు
మార్చుచాలాకాలంగా భారతీయ భాషల్లో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వికీపీడియాను ప్రస్తుతం హిందీ వికీపీడియా అధిగమించింది. ప్రస్తుతం హిందీ వీకీపీడియాలో 55,000 పై చిలుకు వ్యాసాలు ఉండగా తెవికీ 45000 వ్యాసాలకు చేరువలో ఉంది. భారతీయ భాషల్లో రెండో స్థానంలో ఉన్న తెవికీ ప్రపంచ భాషల వికీల్లో 48 వ స్థానం లో ఉంది.
కొన్ని గణాంకాల వివరాలు
మార్చుభాష | వ్యాసాల సంఖ్య | వాడుకరుల సంఖ్య | దిద్దుబాట్ల సంఖ్య |
---|---|---|---|
హిందీ | 55,303 | 29,574 | 6,47,895 |
తెలుగు | 44,917 | 14,623 | 5,15,678 |
తమిళం | 22675 | 18,505 | 543621 |
వికీపీడియా కొత్త రూపం
మార్చుగత కొద్ది కాలంగా వికీపీడియా వాడుకరి సౌలభ్యం పెంచడం కోసం ఒక బృందం కృషి చేస్తున్నది. దాని ఫలితంగా కొద్ది రోజుల్లో వికీపీడియా రూపం మారుతోంది. ఈ మార్పులు ముఖ్యంగా కొత్తగా వికీలోకి వచ్చేవారికి ఎక్కువ లంకెలతో గందరగోళ పరచకుండా అవసరమైనంత మేరకే లంకెలు ఉండే టట్లుగా జాగ్రత్త తీసుకున్నారు. ఉదాహరణకు ఎడమ వైపున ఉన్న సహాయము, పరికరాల పెట్టె, ఇతర భాషలు మొదలైన మెనూ లు అప్రమేయంగా (డీఫాల్టు) దాచబడి ఉంటాయి. వికీలో సమాచారం కోసం వచ్చేవారికి అత్యంత ముఖ్యమైనవి వెతకడం కోసం ఓ పెట్టె. అందుకనే ఇంతకు ముందు ఎడమవైపున ఉన్న దాన్ని ప్రముఖంగా కనిపించేలా పుట పై భాగంలో చేర్చడం జరిగిండి. కొన్ని ముఖ్యమైన మార్పులు.
- మెరుగైన నావిగేషన్ వ్యవస్థ: సరికొత్త రూపంలో ఒక వ్యాస పుటను చూస్తున్నారా లేక దాని చర్చా పేజీ చూస్తున్నారా, ఒక పేజీని వీక్షిస్తున్నారా లేక దిద్దుబాటు చేస్తున్నారా అన్నది సులభంగా అర్థమవుతుంది. తరచు అవసరం లేని తరలించు నిర్వాహకులకు అందుబాటులో ఉండే తొలగించు, సంరక్షించు లను అప్రమేయంగా దాచి ఉంచారు. ఇవి అవసరమైనప్పుడు మౌసు ను కుడి వైపు చివరన క్రింది వైపు సూచించే బాణం గుర్తు దగ్గరకు తీసుకెళితేనే కనిపిస్తాయి.
- సులభతరమైన దిద్దుబాట్లు: పేజీలో దిద్దుబాట్లు చేయడం చాలా తేలిక. శీర్షికలు, జాబితాలు, ప్రత్యేక అక్షరాలు మొదలైనవి ఒక్క నొక్కుతో వ్యాసంలో చేర్చేయవచ్చు. ఈ పరికరాలన్నీ ఒక్కసారిగా చూపించకుండా కేవలం అవసరమైన వాటినే చూసుకునే అవకాశం కల్పించారు. దిద్దుబాటులో ఏ సహాయం కావాలన్నా పక్కనే ఉన్న సహాయం అన్న మెనూ నుంచి పొందవచ్చు.
- సరికొత్త శోధన పరికరం: పై భాగాన ఉన్న శోధన పెట్టె ఇప్పుడు మరింత వేగవంతమైంది. ఒక పదం టైపు చేస్తుండగానే ఆ పదం వ్యాసం పేరులో కలిగిన పేర్లన్నీ జారుడు జాబితా (డ్రాప్ డౌన్ లిస్ట్) లో చూపబడతాయి.
- మంత్రదండాలు: వికీపీడియా అంతర్గత లంకెలను, బయటి లంకెలను వ్యాసంలో చేర్చడానికి ఒక విజార్డ్ సమకూర్చబడింది. ఇది మొదట్లో వికీ మార్కప్ గురించి పెద్దగా పరిచయం లేని వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే పట్టికలను చేర్చడం కోసం ఒక విజార్డ్ రూపొందించారు. ఈ విజార్డ్ పట్టికలో ఎన్ని అడ్డు వరుసలు, ఎన్ని నిలువ వరుసలు కావాలో ముందుగా తీసుకుని దానికి తగ్గ పట్టికను తయారు చేస్తుంది.
- నావిగేషన్ పాపప్స్: వికీలో ఏదైనా పేజీని వీక్షిస్తున్నపుడు ఏదైనా లంకె మీద నొక్కకుండానే సంక్షిప్తంగా ఆ పుటలో ఏముందో తెలుసుకోవాలంటే నావిగేషన్ పాపప్స్ ఉపయోగపడతాయి. వీటిని ఇంతకు ముందు ఎనేబుల్ చేసుకోవడానికి ప్రత్యేకమైన జావాస్క్రిప్ట్/CSS ను తమ వాడుకరి పేజీకి ఉపపేజీగా చేర్చుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం దాన్ని నా అభిరుచులు→ఉపకరణాలు లోకి వెళ్ళి నావిగేషన్ పాపప్స్ అనే చెక్ బాక్సును టిక్ చేయడం ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు.