లక్కుంట జగన్
ఒక పదం ఎలా ఏర్పడిందో తెలియజేసే అర్థాలను వ్యుత్పత్తి అర్థాలు అంటారు.
అంగన : శ్రేష్టమైన అవయవములు కలది. (స్త్రీ)
పురంధ్రి : గ్రహాన్ని ధరించేది. (ఇల్లాలు)
భవాని : భవాని భార్య. (పార్వతి)
అమృతం : మరణం పొందిపనిది. (సుధ)
పుత్రుడు : పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు. (కుమారుడు)
మిత్రుడు : సర్వ భూతాల పట్ల స్నేహం గలవాడు. (సూర్యుడు)
మోక్షం : జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది. (ముక్తి)
ఈశ్వరుడు : స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు. (శివుడు)
గురువు : అంధకారం అంటే అజ్ఞానం భేదించు వాడు. (ఉపాధ్యాయుడు)
విమలము: దీని చేత కల్మషం పోవును.
వేదము: దీని చేత ధర్మాధర్మల నెరుగుదురు.
అహము : దీని యందు జనులు ప్రకాశింతురు.
ఆచార్యుడు: సంప్రదాయం గ్రహింప చేయువాడు.
అన్వయము: దీని చేత సంబంధింపబడును.
పుత్రుడు: పున్నామ నరకము నుండి తప్పించువాడు. (కొడుకు)
ధర్మం: భూమిని ధరించేది (ధర్మువు)
పతివ్రత : పతి సేవయే వ్రతముగా కలది. (సాద్వి)
జ్యోత్స్న: కాంతులను వెదజల్లునది. (వెన్నెల)
మేఘము: తడుపునది (వర్షం)
ఆనందము: ఆనందింప చేయునది.
కవి: వర్ణించేవాడు.
జగము: దీని యందు సర్వం కలుగును.
రక్తము: ఎరుపు రంగు కలది.
అగ్ని: కుటిలముగానైనా జ్వలించువాడు.
ధైర్యం: ధీరుని స్వభావము.
కష్టము: హింసించునది.
సూర్యుడు: లోకమును ప్రకాశింప చేయువాడు.
ధర: భూమిని ధరించినది.
తోయజము: రక్షించునది.
శైలము: శిలలతో కూడినది.
ఉర్వి: పర్వతములచే కప్పబడినది.
హరి: పాపములను హరించువాడు.
నాగము: పాదముల చేత నడువనది.
ఇంద్రుడు: మంచి కిరణాలచే తడిపెడువాడు.
ముని: మౌనముగా జీవించువాడు.
పురారి: త్రిపురాసురులకు శత్రువు.
శంకరుడు: శుభములు కలిగించువాడు.
భూజము: భూమి నుండి పుట్టినది.
వారదము: నీటిని ఇచ్చునది.
గురువు: అజ్ఞానాంధకారాన్ని నశింప చేసేవాడు.
స్వర్ణం: మంచి రంగు కలది.
సూర్యుడు: వ్యాపారాలందు ప్రేరేపించువాడు.
దేహము: అన్నరసాదుల చేత వృద్ధి పొందునది.
చంద్రుడు: మంచు కిరణాలు కలవాడు.
రామ: ఆనందింపచేయునది.
మిత్రుడు: సర్వభూతాల పట్ల స్నేహభావం గలవాడు.
మోక్షం: జీవున్ని పాశం నుంచి విడిపించేది.
కుచేలుడు: చిరిగిన బట్టలు కట్టుకునే వాడు.
స్నేహం: ప్రీతిని కల్గించునది.
విద్య: జ్ఞానమును ఇచ్చునది.
అస్త్రము: దూరము నుండి విసిరేడి ఆయుధము.
శస్త్రము: చేతితో పట్టుకొని యుద్ధం చేయడానికి ఉపయోగించే ఆయుధము.
దుర్యోధనుడు: దుష్టమైన యుద్ధ విద్యా నైపుణ్యం కలవాడు.
దైవము: క్రీడించువాడు.
నాట్యము: నటుని యొక్క స్థానము.
దృష్టి: దీని చేత చూతురు.
అక్షి: దూరముగా వ్యాపించునది.
కావ్యము: కవి కర్మ కావ్యము.
కవి: చాతుర్యము చేత వర్ణించువాడు.
మానవులు: మనవు సంబంధమైన వారు.
నక్షత్రం = నశింపనిది – చుక్క
ఆయుధం = యుద్ధం చేయుటకు తగిన సాధనం
అమృతం = మరణం లేనిది – సుధ
అటవి = వేటకై తిరిగెడు చోటు – అడవి
ఆకాశం = దీనియంతటను సూర్యాదులు ప్రకాశించును
భూమి = ఉదకము వలన పుట్టును .
డమరుకం = డమ అనెడి శబ్దం పలుకునది
వాయువు = విసిరెడువాడు
బృందము = కూర్చబడునది
జంతువు = పుట్టునది
లిపి = దీని చేత పత్రము పూయబడును
దేవుడు = క్రీడించువాడు
నక్షత్రము = నశింపనిది
గ్రహము = పట్టబడునది
అమృతము = మరణము నీయనిది
ఖండం = తుంచబడునది
స్వర్ఱము = మంచి వన్నె కలది
సోదరుడు = (తనతో) ఒకే గర్భమున పుట్టినవాడు
కలశము = ఉదకమును తీసుకొనునది
శుభ్రము = ఒప్పునది