లక్ష్మణ్ కుమార్ చర్ల
- అంధకారం లో ఈ నాలుగు రోజులు* *ఇలా గడిచింది* *నా పేరు లక్ష్మణ్ కుమార్ MA BEd, LLB , జర్నలిస్ట్ టుడే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్.* 9346078988
మొత్తం చదవండి ఇదంతా జరిగింది ........ నవ్వొస్తే నవ్వెయ్యండి ఆరోగ్యం గా ఉండండి .(చర్ల మండలం లో జరిగింది)
********************* గోదావరి వరదల ప్రభావంతో మాచర్ల గ్రామంలో ఏం జరిగిందో మీరే చదవండి.....?2022 లో
ఫ్యాన్లు తిరగలేదు , లైట్స్ వెలగ లేదు , మూడు రోజులు ఫోన్స్ మోగలేదు , పెద్దగా వేహికిల్స్ తిరగ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, మిక్సీలు రెస్ట్ తీసుకున్నయి , ఇంట్లో మహిళలు టిఫిన్స్ తగ్గించారు ,బండ చాకిరీ పెరిగింది గోదావరి వరదలతో, మోటర్లు నిద్రపోయాయి, బిందెలు ,కాన్లు నీళ్ళ కోసం పోటీ పడ్డాయి, నీళ్ళ డ్రమ్ములు కాళీ ఐయ్యయి, జెనరేటర్ ల శబ్దాలు అప్పుడప్పుడు వినిపించాయి, ఇన్వెటర్లు మొరాయించాయి, చుట్టూ గోదారి నీళ్ళు వున్నా ఇంట్లో తాగునీరు నిత్యావసర నీరు కష్టం ఐనది , బస్ లు బస్టాండ్ లోనే వున్నాయి, బడులు బంద్ పెట్టాయి,కళాశాలలు పునరావాసాలు ఐయ్యయి , టీవీ ల గోల లేదు, టార్చ్ మరియు ఛార్జింగ్ లైట్స్ మూలకు నక్కాయి, వేల క్యాండిల్స్ కరిగి పోయాయి, నిద్రా కరువైంది, తెలియని భయం పుట్టింది,మేకలు గొడ్లు ఆవులు గుట్టలు ఎక్కయి , పెంపుడు కుక్కల గోల ఎక్కువైంది, మనసు ఆందోళన చెందింది , రోడ్ల పై జన సంచారం తగ్గింది, రోడ్ల పక్కన చిరు వ్యాపారస్తులు యక్కడ కనబడలేదు *సంత* సందడి లేదు, అధికారుల హడావిడి ,స్వచ్ఛంద సంస్థలు తలుక్ మన్నయి, మెకానిక్ షాప్ లకి పనితగ్గింది , ఐరెన్ దుస్తుల ఊసులేదు, దారి పొడుగునా బ్లీచింగ్ పౌడర్, ఆకాశం లో ఒకటి రెండు సార్లు హెలికాప్టర్ దర్శనం , వార్తల సమాచారము సన్నగిల్లింది , రెండు రోజుల ఆటోల అడ్డలేదు,నాలుగు రోజులు బస్టాండ్ బోసిపోయింది, సూర్యుడు ఒక్క సారి వొచ్చి వెళ్ళాడు , వర్షం ,గోదావరి బురద లో అడుగులో అడుగేస్తు నడిచారు, గోదారి పెరిగిందా తగ్గిందా అని చెవులు కోరుకున్నారు జనం , కరెంట్ ఎప్పుడొస్తుందా అని కలవర పడ్డారు , ఆశగా స్విచ్ బోర్డ్ లైట్స్ వైపు చూశారు రెడ్ లైట్ ఎప్పుడు వెలుగు తుందని, ఫోన్ లో ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు సిగ్నల్స్ లేవు , సిగ్నల్ వున్న సరిగా సిగ్నల్ అందక హాల్లో హాల్లో అని కొందరు గట్టిగా అరిచి అలసిపోయారు ఆ కోపం లో పోన్ నీ తిట్టుకున్నాను,తీరా ఛార్జింగ్ ఐపోయాక సిగ్నల్స్ కరెక్ట్ గా వున్నాయి అని మరి కొందరి మనోభావం దెబ్బ తిన్నది , *ఇలా ఈ నాలుగు రోజులు ఏల గడిచి వుంటుందో మీరే ఊహించండి .మరిన్ని అనుభవాలు మీ ఊహకే వదిలేస్తున్నాను* ..........మీ _లక్ష్మణ్ కుమార్ జర్నలిస్ట్ టుడే రిపోర్టర్ 9346078988_