సామల కిరణ్

వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.ప్రవృత్తి సామాజిక సేవ,ధార్మిక,సాహిత్య రంగాలు.

ముద్రిత రచనలు:

౧.దేశభక్తి ప్రబోధాత్మక "భరతపుత్ర శతకం".

౨.సమాజంలో హెచ్చుతగ్గులు లేకుండా కలిసి సాగాలని ప్రేరేపించే "సమరసతా శతకం".

౩.నైతిక శ్రీ వికాస సూత్రాలు

౪. సమరసత దివిటీలు (40 మంది సంస్కర్తల జీవిత విశేషాలు)

అముద్రిత రచనలు: ౧. భారతీయం- వచన కవితా సంపుటి ౨.సమరసతా నానీలు ౩.అంబేద్కర్-జీవిత దర్శనం

పురస్కారాలు; ౧.పద్మరత్నాలు కవితా ప్రక్రియలో శత రత్నాలు పూర్తి చేసి *పద్మకవి* పురస్కారం పొందారు.

౨.శతాక్షరి కవితా ప్రక్రియలో ప్రవేశించి *స్వచ్ఛ ప్రేమికుడు* పురస్కారం కూడా పొందారు.

౩.నైతిక శ్రీ వికాస సూత్రాలు అను మరో రచనకి *రాజశ్రీ పురస్కారం* లభించింది.

౪.దేశభక్తుల సంక్షేమ సంఘం,తెలంగాణ వారి"సాహిత్య విక్రమార్క" పురస్కారం లభించింది.

    వివిధ దిన,వార,మాస మరియు ఆన్లైన్ పత్రికల్లో అనేక లేఖలు, కవితలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.