స్వప్న బర్మన్

మార్చు

స్వప్న బర్మన్ భారతీయ హెప్టాథ్లాన్. అక్టోబర్ 29, 1996లో జన్మించిన బర్మన్ 21 ఏళ్ల వయసులో భారత్ తరపున 2018లో జరిగిన ఏసియా గేమ్స్‌లో పెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. హెప్టాథ్లాన్‌లో భాగంగా మొత్తం 7 క్రీడాంశాలు ఉంటాయి. హెప్టాథ్లాన్ ట్రాక్&ఫీల్డ్ ఈవెంట్స్‌లో అత్యంత క్లిష్టమైనది. తీవ్రమైన పంటి నొప్పి బాధపెడుతున్నప్పటికీ దాన్ని పంటి బిగువనే దాచుకొని విజయం సాధించారు స్వప్న. నొప్పి తగ్గించుకునేందుకు ఒ చెంప వైపంతా క్రీం రాసుకొనే బరిలోకి దిగాల్సి వచ్చింది.[1] [2] 2019 ఆగస్టులో ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వవమ్[1][2]

స్వప్న బర్మన్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంస్వప్న బర్మన్
జననం29 అక్టోబరు 1996
ఘోష్పారా, జల్పైగురి, పశ్చిమ బెంగాల్, భారత దేశం.
క్రీడ
దేశంభారతం
క్రీడఅథ్లెటిక్
పోటీ(లు)అథ్లెటిక్

వ్యక్తిగత జీవితం, నేపథ్యం

మార్చు

బర్మన్ 1996 లో పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురికి సమీపంలో ఉన్న  ఘోస్పరా గ్రామంలో ఓ నిరు పేద కుటుంబంలో జన్మించారు.

బర్మన్ గృహిణి తల్లి , తండ్రి రిక్షా కార్మికుడు. ఆయన సంపాదన కేవలం రెండు పూటలా తినడానికి మాత్రమే సరిపోయేది. తమ బిడ్డను మంచి అథ్లెట్‌గా తీర్చిదిద్దేందుకు తగిన స్థోమత లేకపోయినప్పటికీ చేయగల్గినంత చేసేవారు. ఆమె తండ్రి రోజూ తన రిక్షాపై సమీపంలో ఉన్న మైదానంలో విడిచిపెట్టేవారు. అయితే తన క్రీడా ప్రయాణంలో అడుగడుగునా ప్రోత్సహిస్తూ సహకరించిన తన కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటానంటారు బర్మన్. [3[3]][2[4]]


బర్మన్‌కు ఉన్న మరో పెద్ద చిక్కు ఆమె రెండు కాళ్ల వేళ్లు ఆరేసి ఉండటం. చాలా రోజుల పాటు ఆరు వేళ్లకు సరిపడా షూస్ లేక.. ఉన్న వాటితోనే ఎలాగోలా ఇబ్బంది పడుతూ సాధన చేసేవారు.

మొత్తం ఏడు ట్రాక్ ఫీల్డ్ విభాగాలు ఉండే ఈ క్రీడలో అథ్లెట్‌కు మరింత శక్తి, మరింత ఓర్పు అవసరం. రోజుల పాటు జరిగే ఈ పోటీలో ఎక్కువ స్కోర్ చెయ్యాలంటే బాగా పరిగెత్తే టెక్నిక్స్, అలాగే విసరడంలోనూ, ఎగరడంలోనూ తగిన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.


ప్రతి జంపింగ్ ఈవెంట్ బర్మన్‌కు మరింత నొప్పి తెచ్చి పెట్టేంది. స్ప్రింట్స్ సమయంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది.


మెరుగైన శిక్షణ కోసం 2012 లో బర్మన్ కోల్‌కతా  వచ్చారు. 2013లో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ సిటీలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఎఐ)కి చెందిన నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో కోచ్‌గా పని చేస్తున్న సుభాష్ సర్కార్ ఆమె ఎస్ఏఐ హాస్టల్‌లో చేర్పించారు.

2013లో సుభాష్ సర్కార్ ఆమెను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగిన యూత్ హెప్టాథ్లాన్ పోటీలకు పంపించారు. ఆ పోటీలో మొత్తం 4,435 పాయింట్లతో రజతం సాధించారు బర్మన్. అది ఆమె క్రీడా జీవితం లో తొలి మెట్టుగా నిలిచింది. అప్పటి నుంచి ఆమె కోసం ఆమె పాదానికి తగినట్టు ప్రత్యేకమైన బూట్లను తయారు చేసేందుకు చాలా షూ కంపెనీలు ముందుకు వచ్చాయి. [4][5]

                    

వృత్తిపరమైన విజయాలు:

మార్చు

2014లో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో సీనియర్ విభాగంలో తొలిసారిగా పాల్గొన్నారు.

2017 ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 5,942 పాయింట్లు సాధించి స్వర్ణం కైవసం చేసుకున్నారు.

మరుసటి ఏడాది పాటియాలా ఫెడరేషన్ కప్‌లో 5,897 పాయింట్లతో మరో స్వర్ణాన్ని సాధించారు. 2019లో జరిగిన అదే పోటీలో రజత పతకం కైవసం చేసుకున్నారు.

2018లో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు.

క్రీడారంగంలో అద్వితీయమైన ప్రతిభను ప్రదర్శించినందుకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2019 ఆగస్టులో అర్జున అవార్డుతో సత్కరించింది. [1[6]] [4[7]]

మూలాలు:

మార్చు

://ehttpsn.wikipedia.org/wiki/Swapna_Barman[1]

https://www.bbc.com/news/world-asia-india-45352[2]

https://www.bbc.com/hindi/sport-453569[3 ]

https://scroll.in/field/895090/the-unlikely-rise-of-swapna-barman-from-wrong-body-type-to-asias-finest-athlete[4]

  1. barman. "swapna barman". BBC.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. barman, swapna barman (wikipedia). [://ehttpsn.wikipedia.org/wiki/Swapna_Barman%5b "swapna barman"]. wikipedia. {{cite news}}: Check |url= value (help); Check date values in: |date= (help)
  3. barman, swapna barman (BBC HINDI). %5d "swapna barman". BBC. {{cite news}}: Check |url= value (help); Check date values in: |date= (help)
  4. barman, swapna barman (BBC HINDI). "swapna barman". BBC HINDI. {{cite news}}: Check date values in: |date= (help)
  5. barman, swapna barman (scroll.in). "swapna barman". scroll.in. {{cite news}}: Check date values in: |date= (help)
  6. barman, swapna (WIKIPEDIA). [://ehttpsn.wikipedia.org/wiki/Swapna_Barman "swapna barman"]. WIKIPEDIA. {{cite news}}: Check |url= value (help); Check date values in: |date= (help)
  7. barman, swapna (scroll.in). "swapna barman". scroll.in. {{cite news}}: Check date values in: |date= (help)