ADDICHARLA SAGAR
Joined 13 నవంబరు 2017
ఉమ్మర్ మియ్య చెెరువు
ఈ చెరువు మంచిర్యాల జిల్లా లోని ( పూర్వ ఆదిలాబాద్ జిల్లా) జైపూర్ మండలం నందు మిట్టపెల్లి గ్రామంలో ఉంది. ఈ చెరువు 1980 కి ముందు ఉమ్మర్ మియ్యా అనే ఫారెస్ట్ కంట్రాక్టర్ తన స్వంత ఖర్చుతో నిర్మించినది.
ఈ చెరువు క్రింద రెండు మూడు
సంవత్సరాలు దాదాపుగా మూడు వందల ఎకరాల భూమి సాగు అయింది. ఆ తర్వాత 1982 లో
కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. దానిని
బాగు చేయడానికి కావలసిన ఆర్థిక సహకారం ప్రభుత్వం వద్ద నుండి లభించకపోవడం, అతను తన వ్యాపార వ్యవహారాల్లో భాగంగా దగ్గర లో ఉన్న మంచిర్యాల పట్టణం కు వలస వెళ్లడం వలన ఆ చెరువు కింద పంటలు సాగు చేయడం ఆగిపోయి, ఆ రైతులు కూలీలుగా మారిపోయారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ చెరువు తెలంగాణ వికాస సమితి ప్రతిపాదన తో దాదాపుగా 35 సంవత్సరాల తర్వాత తిరిగి పునరుద్ధరించబడుతుంది.