Akkala Manoj
నా పేరు అక్కల మనోజ్. నేను 2018లో ఈనాడు జర్నలిజం స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ జర్నలిజం పూర్తి చేశాను. ఆ తరువాత ఈనాడు డిజిటల్‌లో అనేక విభాగాల్లో పని చేశాను. ఈ సంస్థ మెల్లిగా తొమ్మది జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్, సబ్ ఎడిటర్‌గా నా సేవలను వినియోగించుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ములుగు నియోజకవర్గానికి ఇంఛార్జీగా బాధ్యతలను నిర్వర్తించాను. 2019 నుంచి ఈనాడు స్పెషల్ డెస్క్‌లో పని చేశాను. ఆ తరువాత సినిమా బ్యూరో రిపోర్టర్‌గా పని చేశాను. ఈ కాలంలో దాదాపుగా వందకు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ఇంటర్వ్యూలను తీసుకున్నాను. 2020 సెప్టెంబర్ నుంచి INSHORTSలో అసిస్టెంట్ కంటెంట్ మేనేజర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. మనకు తెలిసిన విషయాల గురించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో తీరిక వేళల్లో వికీపీడియా వ్యాసాలు రాస్తాను.