యోసేపు​ గురించిన వివరణ...!

( పాపమును నుండి పారిపోయి దీవించబడ్డాడు)

ఓ యౌవనుడా!! పారిపోతున్నావా? లేక పాపం వెంటబడుతున్నావా?

           ​పాపము​ 

👉చూడడానికి అందముగా వుంటుంది. 👉 చేస్తున్నప్పుడు ఆనందాన్నిస్తుంది. 👉 చేసాక ఆవేదన మిగుల్చుతుంది.

          ​పాపము​ 

👉 నిన్ను తరుముతుంది. 👉 పట్టుకొంటుంది. 👉 బంధిస్తుంది 👉దేవునినుండి దూరం చేస్తుంది. 👉 సమాధానం లేకుండా చేసి, 👉 చివరకు నీ ప్రాణం తీసి, 👉 నిన్ను మంటల్లోకి విసిరేసి, అది పగలబడి నవ్వుతుంది.

దానిని పట్టుకోవడానికేనా, నీ ఆరాటం?

🔹 1. ​పాపము తరుముతుంది:​

​"కీడు పాపులను తరుమును"​ సామెతలు 13:21

🔹 2. ​పాపము పట్టుకొంటుంది:​

​"మీ పాపము మిమ్మును పట్టుకొనును"​

సంఖ్యా 32:23

🔹 3. ​పాపము బంధిస్తుంది:​

​"దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును."​ సామెతలు 5:22

🔹 4. ​దేవుని నుండి వేరు చేస్తుంది:​

​"మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను"​ యెషయా 59:2

🔹 5. ​సమాధానం లేకుండా చేస్తుంది:​

​"దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు​". యెషయా 48:22

👉 ఇంతకీ నీవే స్థితిలో వున్నావ్? దాని చేత తరమ బడుతున్నావా? నీవే దానిని తరుముతున్నావా?

👉ఏదో సరదా కోసం, స్నేహితులను కాదనలేక ప్రారంభమైన ఆ అలవాట్లు నిన్ను బానిసను చేసి, అవే నీ బాస్ గా మారిపోయాయా? నీకున్న యౌవనేచ్ఛలు (శరీర కోరికలు) నీకు సమాధానం లేకుండా చేసేసాయా?

👉 ఎవ్వరితోనూ చెప్పుకోలేక, వాటిని వదులుకోలేక, వాటి మధ్య కొట్టిమిట్టాడుతున్నావా?

👉 నీ మార్గం సరియైనది కాదని నీ మనస్సాక్షి నీ మీద నేర స్థాపన చేస్తున్నా, వాని పీక నొక్కేసి అదే దారిలో వెళ్తున్నావు కదూ!

👉 యౌవనంలో వున్నాను. ఇట్లాంటివి సహజం అని నీకు నీవే సర్దిచెప్పేసు కొంటున్నావా?

👉 యవ్వనాన్ని యౌవనేచ్ఛలతో ఎంజాయ్ చేసి, సిలువలో దొంగలా ఒక్క మాటతో పరలోకంలో ప్రవేశిద్దామనే ఆలోచనలో ఉన్నావా?

👉 నీ యవ్వనాన్ని నీయౌవనేచ్ఛల కోసం, పిప్పిలాంటి మిగిలిన నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తావా?

👉 నీ ఎంగిలి జీవితం కాదు ప్రభువుకు సమర్పించాల్సింది. నీ యవ్వన జీవితం.

పాపము నుండి పారిపోయి, తప్పు ఒప్పుకుని యేసు రక్తములో కడిగబడితే గాని దేవుడు నిన్ను ఆశీర్వాదించడు.

అట్టి విమోచన జీవితం నీకు కలగాలి అని ఆశిస్తూన్నాను.

2 Timothy(రెండవ తిమోతికి) 2:22

22.నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము(విడిచి పారిపొమ్ము), పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.