అందం ఆనందం ఆదర్శం ఉట్టిపడే ఆధునాతన కావ్యం (యశోద నవల )

      అందం ఆనందం కలిగిస్తుంది.ఆనందం అందాన్ని సృజిస్తుంది.అందం ఆనందం ఏకమైతే అమృతత్వం  సిద్దిస్తుంది.అది అత్యంత అపూర్వమైన రసానుభూతి.అట్టి అమృతా తుల్య రసనుభుతితో   సౌందర్యంగా ఉన్నదీ యశోధర కావ్యం.
           గుణం గొప్పది.గుణం వర్ణన గొప్పది. గుణంలోని గొప్పతనం వర్ణనలో అర్ధమవుతుంది.వర్ణనకు గుణంలోని గానత వన్నె తెస్తుంది.అట్టి అనుభూతి మయంగా సాక్షాత్కరించి యశోదార నవల.
           ఇది కావ్యమా, నవల అన్నది శిల్పానికి నామకరణ నిమిత్తం మాత్రమే.వెంకటేశ్వర స్వామి లడ్డు తింటే కానీ, దాని తియ్యధం నాలుకకు తెలియదు.ఇందలి  వస్తువు ఆధ్యంతం చైతన్యం  ప్రాధాన్యం.