బి.గంగాధర్ ఎడిటర్ మరియు పబ్లిషర్, దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రిక.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం తుంగిని గ్రామంలో 1979 మే 06న జన్మించారు. తల్లిదండ్రులు:శ్రీ బి.పోశెట్టి (శక్కరి పోశెట్టిగా ఈ ప్రాంతంలో సుపరిచితమే) శ్రీమతి చంద్రమ్మ. ఈ పుణ్య దంపతులకు ఐదుగురు గంగామణి, భూషణం (పోశెట్టి), సునీత, భారతి, గంగాధర్ సంతానం. శక్కరి పోశెట్టి 1945లో జన్మించిన ఆయన ఎస్సీల్లో చదుఫుకున్న వారిలొ మొట్టమొదటి వారు, ఏడవ తరగతి వరకు చదువుకున్న వారు లెరంటె అతిశయోక్తి కాదు. 1970లో తుంగిని గ్రామంతోపాటు దాదాపు బినోల, నాళేశ్వర్, నిజాంపూర్, లింగాపూర్, శాఖాపూర్ గ్రామాల్లో పౌర సరఫరాల శాఖ రేషన్ డీలర్ గా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు. గ్రామాల్లో ఉండే కులవివక్ష ఆయనను వెంటాడినంది, వేటాడింది కూడా. కులవివక్షకు గురైన  పెత్తందార్లకు భయపడకుండా పని చేసేవారు. ఆ కాలంలోనే ఆయనకు బుల్లెట్ వాహనం (రాయల్ ఎంపీల్డ్) నడపడం ద్వారా అందరికి ఒక్కరకమైన కులవివక్షకు గురి చేసేవారు.