నా పేరు భువనేశ్వరి. నేను ఆరో తరగతిలో చదువుతున్నాను. నా వ్యాసం

గరికిపాటి నరసింహారావు

మార్చు

డాక్టర్ గరికపాటి నరసింగారావు గారు ఆంధ్రులు గర్వించదగ్గ కవి మరియు సుప్రసిద్ద అవధానులు. అవధాన ప్రక్రియలోని ధారణ కళలో నిష్ణాతులు. ఇప్పటివరకు దాదాపు 150 అవధాన కార్యక్రమాలను నిర్వహించారు.

పురస్కారాలు

మార్చు
  • శతావధాన గీష్పతి
  • అవధాన శారద
  • ధారణ బ్రహ్మ రాక్షస

అవధానాల్లో సమస్యా పూరణాలంటే పెంకి గుఱ్ఱాల మీద స్వారీ వంటిది. వీటి నిర్వహణలో డా||గరికిపాటి వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత జగమొండి సమస్యల్నైనా మనం ముక్కుమీద వేలువేసుకొని విస్తుపోయే విధంగా పూరించడం వీరి ప్రత్యేకత.

పృఛ్ఛకుడు అవధాని భరతం పట్టడానికి సమస్య ఇస్తే అది వారికే తగిలేలా వీరి పూరణ వస్తుంది. అవధాని నుండి ఒక రసవత్తరమైన పద్యం రాబట్టడానికి ఇస్తే అదే పద్ధతిలో వీరి పూరణ ఉంటుంది. సమస్యలని బట్టి పద్య పూరణ అంతే స్థాయిలో చెయ్యగల సమర్ధులు.

అవధానాన్ని ఒక తపస్సులా భావించి తదేక పవిత్ర దీక్షతో శారదాదేవి కటాక్ష సిద్ధిని పొందిన అవధాని డా||గరికిపాటి నరసింహా రావు.

1992 విజయ దశమి నాడు అవధాన రంగప్రవేశం చేసి ఇంతవరకు 275 కి పైగా అష్టావధానాలు, 8 అర్ధ శత, శత, ద్విశత సహస్రావధానాలు సమర్ధవంతంగా నిర్వహించించి అవధాన బ్రహ్మ రాక్షసుడు వంటి విశిష్టమైన బిరుదులను, అనేకనేక సన్మానాలను, పురస్కారాలను అందుకున్నారు డా|| గరికిపాటి నరసింహారావు.

 
గరికిపాటి నరసింహారావు


గరికిపాటి నరసింహారావు గారి వెబ్‍సైటు: http://www.srigarikipati.com