తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం మంచిర్యాల జిల్లా) చెన్నూరు పట్టణానికి చెందిన బొడ్డు మహేందర్ నవ యువ కవి, పాటల రచయిత, బ్లాగర్, సామాజిక కార్యకర్త,పజిల్స్. లఘు చిత్రాల రూపకర్త, మరియు న్యాయవాది. పలు వెబ్ సైట్లతో అంతర్జాలం ద్వారా తెలుగు భాషోన్నతికి విశేషంగా కృషి చేస్తున్న సాహితీ కృషీవలుడు కూడా. వారి తల్లిదండ్రులు : బొడ్డు ఆగయ్య, కమల. తల్లిదండ్రులు ఇరువురూ కూడా చెన్నూర్ వాస్తవ్యులే.

విద్యాభ్యాసం మార్చు

ప్రాథమిక విద్యాభ్యాసం ఐదవ తరగతి వరకు ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్ కాలనీలోని సాందీపని పబ్లిక్ స్కూల్ లో జరిగింది. ఆ తర్వాత ఆరు నుండి పదవ తరగతి వరకు చెన్నూరు లోని సాయి మమత హైస్కూల్ లో , ఇంటర్మీడియేట్ విద్య చిన్నమున్షి జూనియర్ కళాశాలలో అభ్యసించడం జరిగింది. ఉన్నత విద్య కోసం మంచిర్యాలలోని విద్యానికేతన్ డిగ్రీ కళాశాలలో పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో బి.యిడి, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో MA-తెలుగు,MCJ-జర్నలిజం, దూరవిద్యలో ఉస్మానియా యూనివర్సిటీలో PGDBM, ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో LLB- న్యాయవాద విద్య ను అభ్యసించాడు.ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ జర్నలిజం లో పరిశోధన చేస్తున్నాడు.

లఘు చిత్రాలు మార్చు

కథా రచయితగా ఇప్పటివరకు నాలుగు షార్ట్ ఫిలిం లకు పని చేయడం జరిగినది. అవి : ఫస్ట్ లవ్ - ఫస్ట్ పెగ్, తెగులు అసోసియేషన్స్ , లెట్స్ జాయిన్ హాండ్స్ , కపుల్ ఎట్ లవ్. .మరియు ఈటీవీ ప్లస్ లో మూకాబ్ లా అనే పేరడీ షో కోసం 45 పాటలు రచించాడు. మరియు అదే ఛానల్ లో అల్లరే అల్లరి అనే సీరియల్ కోసం కొన్ని ఎపిసోడ్స్ రచించాడు.

రచించిన పుస్తకాలు మార్చు

మహే, మహితోపదేశం,మహితానురాగం, మేఘమాలిక . ఇవి ప్రస్తుతం PDF రూపంలో అంతర్జాలంలో లభ్యమవుతున్నాయి. వీనితో పాటు 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా దుర్భిణి అనే పేరుతో రచయితల డైరెక్టరీ ని ప్రచురించాను. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా రచయితల సాహిత్య చరిత్ర పేరుతో ఒక గ్రంథం ముద్రించడానికి సిద్ధంగా ఉన్నాను.

సామాజిక సేవా కార్యక్రమాలు మార్చు

2011లోనే తన స్వగ్రామం ఉనికిని , ప్రశస్తిని ప్రపంచానికి తెలియజేయడంతో పాటుగా,దాని అభివృద్ధిని కాంక్షించి చెన్నూర్,ఆదిలాబాద్ జిల్లా వెబ్ సైట్ లు పెట్టడం జరిగింది. తెలుగు భాషా , సాహిత్యాలపై ఉన్న అభిమానంతో [/ తెలుగు లిటరేచర్ ] అనే వెబ్ సైట్ రూపకల్పన చేసారు. 2014 లో మహాన్ యూత్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించి ఆదిలాబాద్ జిల్లాలోని తన స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. తెలంగాణ సాహితీ వనం పేరుతో ఒక బృహత్ గ్రంథాలయ స్థాపనకు కూడా పూనుకోవడం జరిగింది.

మూలాలు మార్చు

ఫేస్ బుక్, గూగుల్ ప్లస్, యూట్యూబ్ లలో అత్యధిక ప్రాచుర్యం పొందుతున్న అభినవ తెలుగు భాషాభిమానికి సంబంధించిన ఇతర వివరాల కోసం క్రింది వెబ్ సైట్లు దర్శించవచ్చు. [| బొడ్డు మహేందర్ అధికారిక వెబ్ సైట్ ] [| చెన్నూరు నియోజకవర్గ వెబ్ సైట్ నుండి ]

బయటి లింకులు మార్చు

వర్గాలు: కవి సంగమం కవులు తెలుగు కవులు తెలుగు రచయితలు తెలుగు బ్లాగర్లు వికీ రచయితలు ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధ వ్యక్తులు