తెలుగులో వ్రాయడానికి చాలా సంతోషం.సమయం చాలానే తీసుకుంటుంది.తృప్తి గా వుంది. అంతేకాదు ఆశ్చర్యం. రచన:బొట్రేబా.

కలలు ప్రపంచం కావాలి భావాల లోకానికి వెళ్ళాలి కొత్తగా కలలు కనాలి. కొత్తగా భావాలు రావాలి, ఎందుకో మనసు స్పందించడం లేదు మనసు కోరుకున్న విధంగా వ్రాయలేకపోతున్నాను, అన్నీ రోదనలు,వేదనలు, ఛిద్రమయిన దృశ్యాలు, కకావికలయిన దేహశకలాలు, కారణాలు చాలా చిన్నవే. దారుణాలు,మారణకాండలు, ధన,ప్రాణ,మానభంగాలు, క్రోధాలనడుమ,ఆరని కొలనే ఈ కీలాలచలమ, ఎంతగా న్యాయాన్ని చేయమని గొంతుచించుకున్నా ,పొలికేకపెట్టినా బదులు లేదుగాక,ఓదార్చేమనిషే లేడు, బజారుకీడుస్తున్నారు,బద్దలు చేస్తున్నారు, నేరాలు బనాయిస్తూ,బతుకుబద్నాం చేస్తున్నారు. నిజాన్ని నిరూపణ చేయలేని నిస్తేజం, సత్యాన్నిభూస్తాపితంచేసేకల్తీయిజం, చూస్తూనేవుండాలా నేస్తం, కాలానికి తిరగబడే విధం నేర్పవూ ! కావ్యానికి కత్తులుదూసేకళ నేర్పవూ ! గళానికి గుండెలుపిండే శక్తినియ్యవూ! కుంచెతో మనసును కుదిపే చిత్రమెయ్యవూ! ఏమో ఎందుకో మనసు మారాం చేస్తొంది. బొట్రేబా రచనBonthat 16:12, 28 అక్టోబర్ 2008 (UTC)