గుళ్ళపల్లి గారూ, మీరు తెవికీలో సీనియర్ సభ్యులలో ఒకరుగా పరిగణించబడతారు. మీ అనుభవం దృష్ట్యా చూస్తే మీరు తెవికీకి ఒక మూలస్తంభంగా ఉంటూ తోటి వాడుకరులకు సలహాలు-సూచనలు ఇస్తూ, కొత్త వాడుకరులకు మార్గనిర్దేశ్యం చేయాల్సిన దశలో ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మీకు కొత్తసభ్యులతో సహా ప్రతిఒక్కరూ మీ దిద్దుబాట్లపై అభ్యంతరం తెలియజేస్తున్నారు. తెవికీలో ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం లేనప్పటికీ నియమాలపై అవగాహన ఉన్నవారు ఏదేని సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు లేదా దిద్దుబాట్లపై ఏదేని అభ్యంతరం వ్యక్తంచేసినప్పుడు కనీసం మీ దిద్దుబాట్ల వైఖరిలో మార్పు తీసుకురావాల్సింది. కాని తోటిసభ్యుల సూచనలకు మీరు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు, పైగా మీ దిద్దుబాట్లపై రచ్చబండలో కాని చర్చాపేజీలలోకాని ముఖ్యమైన చర్చలు జరిగిన సందర్భాలలో కూడా మీరు చర్చలకు విరుద్ధముగా దిద్దుబాట్లు చేస్తున్నారు. ఒక సమూహంగా ఉంటూ ఇక్కడ పనిచేస్తున్నామంటే తెవికీ అభివృద్ధి దృష్ట్యా సమూహంలోని తోటిసభ్యుల అభిప్రాయాలకు తప్పకుండా విలువ ఇవ్వాల్సి ఉంటుంది. కాని మీరు ఇంతవరకూ కూడా తోటిసభ్యులు ఇచ్చిన సూచనలు పట్టించుకున్నట్లు, ఆ సూచనలను ఆచరించినట్లు కనిపించలేదు. తెవికీ అభివృద్ధి దృష్ట్యా తోటి సభ్యులు చేసిన సూచనలకు తిరస్కరించడమే కాకుండా తెవికీ ప్రయోజనాలకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నట్లుగా మీ దిద్దుబాట్లు తెలుపుతున్నాయి. మీ దిద్దుబాట్ల వల్ల తెవికీకి ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉన్నట్లుగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వివిధ సందర్భాలలో తోటి సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కూడా మీరు ఏ మాత్రం పట్టించుకోలేరు మరియు మీ దిద్దుబాట్ల వైఖరిని మార్చుకోలేరు.
1) తెవికీలో రచనలు లేదా దిద్దుబాట్లు చేయడం యొక్క అతిముఖ్య నియమం వివిధ ప్రామాణిక గ్రంథాలు, వెబ్‌సైట్ల నుంచి కొంతకొంత సమాచారం గ్రహించి ఇక్కడ నాణ్యమైన వ్యాసాలు తయారుచేయడం. సమాచారం చేర్చడమే తెవికీకి అతిముఖ్యమైనది. కాని మీ ఇన్నేళ్ళ దిద్దుబాట్ల ప్రకారం చెప్పాలంటే మీరు ఏనాడు ఇలాంటి ప్రామాణిక సమాచారం వ్యాసాలలో చేర్చలేరు. మీ దిద్దుబాట్లు అన్నీ ఖాళీ విభాగాలు చేర్చుట, ఉన్న వ్యాసాలనే పేరుమార్పులతో సృష్టించుట, అనవసర లింకులు ఇచ్చుట, తప్పుడు సమాచారం చేర్చుట, ఇన్ఫోబాక్సులు కాపీపేస్టులు చేయుట, నిష్పయోజనమైన సాధారణ సమాచారం చేర్చుట ... ఇలాంటివే కొనసాగిస్తున్నారు.
2) ప్రస్తుతకాలంలో తెవికీకి నిర్వాహకుల కొరత ఉంది. ఉన్న చురుకైన నిర్వాహకులు మీ ఒక్కరి దిద్దుబాట్లు పరిశీలించడానికి కూడా సమయం సరిపోవడం లేదు. దీనితో చాలా వ్యాసాలలో అనవసర సమాచారం, తప్పుడు సమాచారం మిగిలిపోతోంది. మీ దిద్దుబాట్లు తెవికీకి ఒక పెద్ద గుదిబండలా తయ్యారౌతున్నాయి! మీ దిద్దుబాట్ల వల్ల తెవికీ నాణ్యత దెబ్బతింటోంది.
3) ఖాళీ విభాగాలు, గ్రామ వ్యాసాలలో సాధారణ సమాచారం చేర్చరాదని ఇదివరకే చర్చలు జరిగిననూ మీరు ఏ మాత్రం పట్టింకోవడంలేదు. పొరపాట్లపై పొరపాట్లు చేస్తున్నారు. ఊహాత్మక సమాచారం మరియు మూలరహిత సమాచారం చేయరాదనే నియమ-నిబంధనలకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు. పలుమార్లు చెప్పినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఊహాత్మక సమాచారం చేర్చుతున్నారు. ఇది తెవికీ మూలనియమానికి విరుద్ధము. మీరు చేర్చే సాధారణ సమాచారం నిర్థారించతగనిది మరియు మూలాలు లేనివి. కాబట్టి ఈ సమాచారం చేర్చడం నియమ ఉల్లంఘన కిందికి వస్తుంది.
4) వ్యాసాలలో మరీ అధికంగా లింకులు ఉండరాదనేది నియమము. దీన్ని కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. ఇదివరకే లింకులున్న వ్యాసాలలో కూడా మళ్ళీ లింకులు ఇస్తున్నారు. ఈ లింకులు ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించడం లేదు. మీరిచ్చిన లింకులు చాలావరకు ఎర్రలింకులు కావడమో, దారిమార్పులకు దారితీయడమో, అయోమయ నివృత్తి పేజీలకు వెళ్ళడమో లేదా వ్యాసానికి సంబంధం లేని పేజీలకు పోవడమో, అనవసర లింకులు కావడమో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు కాబట్టి లింకులు అధికమైతే పాఠకులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది లింకుల దుశ్చర్యగా పరిగణించబడుతుంది. ఇది నియమ ఉల్లంఘన. తోటి సభ్యులు తెలియజేసిననూ మళ్ళీ మళ్ళీ తప్పిదాలు చేయడం పొరపాటు కిందికి కూడా రాదు. ఇది వ్యూహాత్మక నియమ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇదివరకే ఈ విషయం రచ్చబండలో నిర్వాహకులు చెప్పిననూ మీరు పట్టింకోవడం లేదు.
5) గ్రామవ్యాసాలలో సాధారణ సమాచారం మరియు ఊహాత్మక సమాచారం చేర్చరాదని కొన్ని మాసాల క్రితమే చర్చ జరిగింది. ఒక కొత్తసభ్యుడు కూడా మీ దిద్దుబాట్లను హేళనపరుస్తూ వందలాది గ్రామవ్యాసాలలో సాధారణ సమాచారం చేర్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇటీవల రచ్చబండలో తెలియజేసిననూ మీ వైఖరిలో మార్పు లేదు. ఊహాత్మక సమాచారం చేర్చడమన్నది తెవికీ నియమాలకు విరుద్ధముగా పరిగణించబడుతుంది.
6) గ్రామవ్యాసాలలో మీ ఇష్టమున్నట్లుగా వ్యాసానికి సంబంధం లేని వర్గాలు చేరుస్తున్నారు. మండలాలకు సంబంధించిన వర్గాలు, కవులకు సంబంధించిన వర్గాలు, కథారచయితలకు సంబంధించిన వర్గాలు, ప్రాజెక్టులకు సంబంధించిన వర్గాలు, వికీపీడియన్ల వర్గాలు ... ఇలా సంబంధం లేని వర్గాలు చేర్చుట వల్ల వర్గాల ద్వారా వ్యాసాలు చేరుకొనేవారికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి మీ దిద్దుబాట్లు తప్పుడు దిద్దుబాట్లుగా మరియు తెవికీని తప్పుదోవ పట్టించే దిద్దుబాట్లుగా పరిగణించబడతాయి. ఇవి ఏదో పొరపాటున జరిగిన దిద్దుబాట్లుగా కూడా భావించడానికి వీలులేదు. ఎందుకంటే పలుపర్యాయాలు సూచించినప్పటికీ ఇలాంటి దిద్దుబాట్లు పునరావృత్తం కావడం వ్యూహాత్మక లేదా ఉద్దేశ్యపూర్వక తప్పుడు దిద్దుబాట్లుగానే పరిగణించబడతాయి.
7) తెవికీలో ఇన్నేళ్ళ నుంచి అనుభవమున్న పలు సభ్యుల కృషితో నాణ్యమైన వ్యాసాలు తయారయ్యాయి. వాటిని కాపాడుకోవాల్సిన దశలో ఉంటూ కూడా మీరు వ్యాసనాణ్యతను దెబ్బతీస్తున్నారు. వేలాది గ్రామవ్యాసాలలో ఖాళీ విభాగాలు చేర్చారు, వేలాది గ్రామవ్యాసాలలో తప్పుడు సమాచారం చేర్చారు, వేలాది గ్రామవ్యాసాలలో ప్రయోజనం లేని సాధారణ సమాచారం చేర్చారు. ఇలా ఒకటి తర్వాత మరొకటి నిష్పయోజనమైన దిద్దుబాట్లు చేయడం వల్ల తెవికీలో చాలా వరకు వ్యాసనాణ్యత దెబ్బతింది. తెవికీ అభివృద్ధి దృష్ట్యా ఆలోచించినప్పుడు ఇలాంటి దిద్దుబాట్లు చేసేవారిపై తగుచర్య తీసుకోగలిగే అవకాశం ఉంది.
8) తెవికీలో ఇప్పటికే ఉన్ననూ వందలాది వ్యాసాలను కొద్దిపేరుమార్పులతో మళ్ళీ సృష్టించారు. చాలావరకు తొలగింపునకు గురైననూ ఇంకనూ వందలాది వ్యాసాలు తొలగించవలసి ఉంది. ఈ విషయంలో తోటి సభ్యులు ఇచ్చిన సలహాలను మీరు పాటించలేరు. మీరు ఏ మాత్రం పరిశీలన చేయకనే కొత్త వ్యాసాలు సృష్టిస్తున్నారు. దీనివల్ల నిర్వాహకుల విలువైన సమయం వృధాకావడమే కాకుండా తెవికీకి నష్టం వాటిల్లింది.
9) గతంలో గ్రామవ్యాసాలలో మీరు చేర్చిన దిద్దుబాట్లపై అభ్యంతరపర్చిన సమాచారానికి ఇప్పుడు లింకులిస్తున్నారు. అభ్యంతరపర్చిన సమాచారానికి లింకులివ్వడం నిష్పయోజకరము అయినా కొనసాగిస్తున్నారు. దిద్దుబాట్ల పరిశీలనపై నిఘా ఉంచే తోటి సభ్యులకు ఇది ఇబ్బందికరంగానూ, వృధాపనిగానూ మారింది. తద్వారా తోటి సభ్యులు తెవికీకి కేటాయించే విలువైన సమయం పనికిరాకుండా పోతోంది.
10) వికీపీడియా సమగ్రతను దెబ్బతీసే విధంగా పేజీల్లో అవాంఛనీయమైన దిద్దుబాట్లు చేయడాన్ని దుశ్చర్యగా పరిగణించబడతాయి. మీ దిద్దుబాట్లు కూడా అవాంఛనీయ దిద్దుబాట్లుగా ఉంటున్నాయి. కాబట్టి ఇది నియమవిరుద్ధము. మీ పని నిష్ప్రయోజనకరంగా ఉండుటయే కాకుండా తోటి సభ్యుల విలువైన కాలాన్ని హరిస్తున్నారు.
మొత్తంపై మీ దిద్దుబాట్ల వల్ల తెవికీకి ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉన్నట్లుగా నిర్థారించబడింది. కాబట్టి ప్రస్తుతం కొనసాగిస్తున్న మీ దిద్దుబాట్లను తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ఆపవలసిందిగా కోరుచున్నాను. ముందుగా నియమాలపై అవగాహన కల్పించుకొని, ఇదివరకు వివిధ సందర్భాలలో తోటిసభ్యులు ఇచ్చిన సూచనలను అర్థం చేసుకొని, తోటి సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ ఆపై మాత్రమే మీ దిద్దుబాట్లు కొనసాగించగలరు. లేనిచో మీపై తగుచర్య తీసుకోబడునని తెలుపుతున్నాను. ధన్యవాదములతో... సి. చంద్ర కాంత రావు- చర్చ 14:50, 31 జనవరి 2017 (UTC)
|