వాడుకరి:C.Chandra Kanth Rao/జిల్లా వ్యాసాలు - పరిశీలన

విజ్ఞాన సర్వస్వములో ముఖ్యమైన వ్యాసాలుగా పరిగణించగలిగే జిల్లా వ్యాసాలు మన తెవికీలో ఏ స్థాయిలో ఉన్నాయి? వీటి రచనలు లేదా అనువాదం ఎలా ఉంది? ఇది రచించిన వారికి జిల్లా సమాచారంపై పట్టు ఉందా? వ్యాసాలలో తప్పులు ఏ విధంగా ఉన్నాయి? జిల్లా వ్యాసాలపై సాధారణ పాఠకులు ఏ విధంగా అనుకుంటున్నారు? తదితర విషయాలకై జిల్లా వ్యాసాలను పరిశోధించి నేను ఇవ్వాలనుకుంటున్న నివేదిక ఇది. ఇలా చేయడం వల్ల రచనలు చేసే వారికి తాము రాసింది పరిశీలన చేసేవారు ఉంటారన్న భావనతో ఇక ముందైనా వ్యాసాలపై శ్రద్ధ వహిస్తారనీ, తద్వారా వ్యాస నాణ్యత పెరుగుతుందని దీని ఉద్దేశ్యం. వీటి పరిశీలన ఒక్క రోజుతో పూర్తయ్యే విషయం కాదు, కాబట్టి నివేదిక పలు భాగాలుగా ఉంటుంది. సమయం లభ్యమైనప్పుడల్లా విషయాల వారీగా కొంతకొంత నివేదిక జతపరుస్తాను.

సరిహద్దులు, అక్షాంశ-రేఖాంశాలు మార్చు

జిల్లా వ్యాసాలంటే వ్రాయాలంటే భౌగోళిక విషయాలపై పట్టు ఉండటం చాలా అవసరం. జిల్లా సరిహద్దులు, అక్షాంశ-రేఖాంశాలు ప్రతి జిల్లా వ్యాసంలో వ్రాయడం అవసరం. మరి ఆంగ్ల వ్యాసాల నుంచి తర్జుమా చేసిన మన జిల్లా వ్యాసాలలో భౌగోళిక అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒక సారి దృష్టిసారిద్దాం. యాధృచ్ఛికంగా పరిశీలించిన కొన్ని జిల్లా వ్యాసాలలో అనువాదం ఈ విధంగా ఉంది.

అక్షాంశ, రేఖాంశాలు మార్చు

జిల్లా వ్యాసాలలో అతి ముఖ్యమైన అక్షాంశ-రేఖాంశాలు చాలా చోట్ల తప్పుగా వ్రాయబడ్డాయి. అక్షాంశాలు 90 డిగ్రీలకు మించి ఉండవి కాని మన జిల్లాలు అంతకు మించి పైన ఉన్నాయి! మనదేశం గ్రీనిచ్‌కు తూర్పున ఉంటే కొన్ని జిల్లాలు మాత్రం పశ్చిమ రేఖాంశంలో ఉన్నాయి!

క్ర.సం. ఆంగ్ల పాఠ్యం మన అనువాదం వ్యాసం పేరు
1 The District lies between 90°55’15 to 91°16’ latitude and 25°40’ to 25°21’ longitude రి-భోయి జిల్లా 90°55’15 నుండి 91°16’ అక్షాంశ మరియు రేఖాంశాల మద్య ఉపస్థితమై ఉంది రి-భోయ్
2 It lies approximately between 91° 30' to 92° 40' East longitudes and 26° 54' to 28° 01' North latitudes ఉత్తర అక్ష్క్షంశం 26° 54' నుండి 28° మరియు దక్షిణ రేఖంశం 91° 30' నుండి 92° 40' లో ఉంది పశ్చిమ_కమెంగ్
3 80°28' E Longitude to 82°12' E longitude 30°28' నుండి 82°12' తూర్పు రేఖాంశంలో ఉంది. షాదోల్
4 The district lies between 23° 20’ and 24° 22' north latitudes, and 77° 16’ and 78° 18’ east longitudes జిల్లా 23 - 0 నుండి 20’ మరియు 24 - 0 నుండి 22' ఉత్తర అక్షాంశం మరియు 77 - 0 నుండి 16’ మరియు 78 - 0 నుండి 18’ డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది విదీష
5 The district is situated between 21°22' and 22°35' north latitudes and 74°25' and 76°14' east longitudes 21°22' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 22°35' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది ఖర్‌గొన్
6 it is situated in between 26-53 to 27-46 north latitude and 79-41 to 80-46 east longitude 79-41 డిగ్రీల అక్షాంశం మరియు 80-46 లో రేఖాంశంలో ఉంది హర్దోయ్
7 Senapati District is located between 93.29° and 94.15° East Longitude and 24.37° and 25.37° North Latitude సేనాపతి జిల్లా మణిపూర్ రాష్ట్ర ఉత్తర భూభాగంలో డిగ్రీల 93.29° మరియు 94.15° అక్షాంశం మరియు 24.37° మరియు 25.37° డిగ్రీల రేఖాంశం వద్ద ఉంది. సేనాపతి

సరిహద్దులు మార్చు

జిల్లా వ్యాసాలలో సరిహద్దులు చూపించడమనేది అతిప్రధానమైన అంశం. అయితే అనువదించబడిన మన తెవికీ జిల్లా వ్యాసాలలో ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య సరిహద్దులలో చాలా పొరపాటు ఉన్నట్లుగా పరిశీలనలో తేలింది.

క్ర.సం. ఆంగ్ల పాఠ్యం మన అనువాదం వ్యాసం పేరు
1 state of Maharashtra state in the south జిల్లా ఉత్తర సరిహద్దులలో మహారాష్ట్ర రాష్ట్రం లోని ధార్ జిల్లా
(వివరణ: ధార్ జిల్లా మహారాష్ట్రలో లేదు)
ఖర్‌గొన్
2 Pune (SW) ఆగ్నేయ సరిహద్దులో పూనా జిల్లా అహ్మద్‌నగర్ జిల్లా
3 which flows west to east and forms the southern boundary of the district జిల్లా దక్షిణ సరిహద్దులో గూదావరినది పడమర దక్షిణాలుగా ప్రవహిస్తుంది గఢ్ చిరోలి జిల్లా
4 Telangana state to the south and southwest వాయవ్య సరిహద్దులో తెలంగాణా రాష్ట్రం గఢ్ చిరోలి జిల్లా
5 Kollam district is located on the southwest coast of India, bordering Laccadive Sea in the west, the state of Tamil Nadu in the east కొల్లం జిల్లా కేరళ రాష్ట్రం దక్షిణ సముద్రతీరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన లక్షద్వీపాల సముద్రతీరానికి పశ్చిమంలో ఉంది కొల్లం
6

జనాభా, జనసాంద్రత మార్చు

యాధృచ్ఛికంగా పరిశీలించిన జిల్లా వ్యాసాలలో చాలా చోట్ల జనాభాకు, జనసాంద్రతకు తేడా గుర్తించబడలేదు.

క్ర.సం. ఆంగ్ల పాఠ్యం మన అనువాదం వ్యాసం పేరు
1 the fifth most populous district in India జనసాంధ్రత పరంగా దేశంలో 5 వ స్థానంలో ఉంది ముంబై పరిసరం జిల్లా
2 It is the fourth least populous district in India (out of 640) భారతదేశంలోని 640 జిల్లలలో లాహౌల్ మరియు స్పితి జిల్లా జనసాంధ్రతలో 3 వ స్థానంలో ఉంది లాహౌల్
3 It is the fourth least populous district in the country దేశంలో అత్యల్ప జనసాంధ్రత కలిగిన దేశంలో ఇది నాగువ స్థానంలో ఉంది ఎగువ సియాంగ్
4 As of 2011 it is the most populous district of Arunachal Pradesh 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంగా ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది పపుమ్ పరె
5 Anjaw is the second least populous district in India భారతదేశంలోని అత్యల్ప జనసాంధ్రత కగిన జిల్లాలలో ఇది రెండవది అంజా
6 As of 2011 it is the second most populous district of Chhattisgarh 2011 గణాంకాలను అనుసరించి బిలాస్‌పూర్ జిల్లా చత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలలో 3 వస్థానంలో ఉందని గుర్తించబడింది బిలాస్‌పూర్

శీతోష్ణస్థితి, ఉష్ణోగ్రత మార్చు

క్ర.సం. ఆంగ్ల పాఠ్యం మన అనువాదం వ్యాసం పేరు
1 The temperature ranges from a minimum of 3.4 °C (38.1 °F) to a maximum of 34.1 °C (93.4 °F) అత్యధిక ఉష్ణోగ్రత 38.1 ° సెల్షియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 34.1° సెల్షియస్ సేనాపతి
2

హ్యూమన్‌టచ్‌లో గూగుల్ టచ్ మార్చు

అనువాదం హ్యూమన్‌టచ్‌తో చేసినట్లు ఉన్ననూ పట్టికలు, పేర్లు చాలా చోట్ల యాంత్రిక అనువాదం ఛాయలు కనిపిస్తున్నాయి. కనీసం భద్రపరిచే ముందు కూడా సరిచూడబడలేనట్లుగా గమనించబడింది.

క్ర.సం. ఆంగ్ల పాఠ్యం మన అనువాదం వ్యాసం పేరు
1 Shree Ganesh Vidyalay , Hamal galli latur శ్రీ గణేష్ విద్యలయ్' , కోపం చూపించేందుకు మాత్రం ఒకే గాలీ లాతూర్ లాతూర్ జిల్లా
2 chakaradhan:-myths devi durga save the children from illness చకరధన్: - పురాణాలు దుర్గా దేవి అనారోగ్యం నుండి పిల్లలు సేవ్ తికంగర్
3 Baldeogarh:-Baldeogarh ki TOP (तोप) is famous in Bundelkhand బాల్డియోగర్ : - బాల్డియోగర్ కి టాప్ (तोप) బుందేల్ఖండ్ ప్రాచుర్యంలో ఉంది తికంగర్
4 Shree Venktesh Vidayalay, Behind Main Bus Stand, Latur శ్రీ వెంక్తెష్ విదయలయ్, ప్రధాన బస్ వెనుక, లాతూర్ స్టాండ్ లాతూర్ జిల్లా
5 Shitalnath Maharaj Mandir, Khadgaon, Goragawale bk Tal-chopda is located on the bank of river guli శీతల్నాద్ మహారాజ్ మందిర్, ఖద్గఒన్, గొరగవలె బి.కె తాల్-చొప్ద బ్యాంకు మరియు నది గులి మీద ఉన్న జలగావ్ జిల్లా
6 Namdevrao Poreddiwar College Of Engineering,Gadchiroli ఇంజనీరింగ్, గడ్చిరోలి యొక్క నాందేవ్రావు పొరెదివర్ కాలేజ్ గఢ్ చిరోలి జిల్లా
7 Baba Amte India's Social and moral leader (born December 24, 1914 ) at Hinganghat బాబా ఆమ్టే భారతదేశం యొక్క సామాజిక మరియు హింగంఘాట్ (డిసెంబరు 24, 1914 న జన్మించింది) నైతిక నాయకుడు వార్ధా
8 Utran- in Erandol taluka famous for high quality lemon. Lasur tal - Chopada ఉత్రన్ - అధిక నాణ్యత నిమ్మకాయలు ప్రసిద్ధి ఎరందొల్ లో. లసుర్ తల్ - చొపద్ జలగావ్ జిల్లా
9 Ajanta Caves developed during the reign of Chalukya kingdom are only 50 km from Jalgaon అజంతా గుహలు చాళుక్య రాజ్యం హయాంలో అభివృద్ధి' 'మాత్రమే 50 ; జల్గావ్ నుండి క్మ్ జలగావ్ జిల్లా
10 Munjoba Devasthan is located in Waghod in Raver taluka. Phaijpur in Yawal taluka ముంజొబ దెవస్థన్ రవెర్ తాలూకా లో వఘొద్ లో ఉన్న. యవల్ తాలూకా లో ఫైజ్పుర్ జలగావ్ జిల్లా

సాంకేతిక పదాల అనువాదం మార్చు

అనువాదమే కాని వ్యాసాలు మార్చు

చాలా వ్యాసాలలో ఆంగ్లపాఠ్యం పెట్టి వదిలేయబడింది. ఆ జిల్లావ్యాసాలలో అనువాదం అస్సలు చేయబడలేదు. మరికొన్ని జిల్లాలలో పాక్షిక అనువాదం మాత్రమే చేయబడింది. మరికొన్ని చాలా జిల్లాలలో వ్యాసంలో అక్కడక్కడా ఆంగ్ల పాఠ్యం అలాగే ఉంచబడింది.

అనువాదం కాని వ్యాసాలు 1) ఛింద్వారా 2) ధూలే జిల్లా 3) షోలాపూర్ జిల్లా 4) భండారా జిల్లా 5) పర్భణీ 6) కిన్నౌర్ 7) తౌబాల్ 8) మేవాత్ 9) గుర్‌గావ్ 10) ఫతేబాద్ 11) ఫరీదాబాద్ 12) శ్రీనగర్ 13) బాద్‌గం 14) ఫిరోజాబాద్
పాక్షిక అనువాదం 1) పూణె జిల్లా 2) చంబా 3) బాలడ్ జిల్లా 4) అంబాలా 5) భివాని 6) జౌంపూర్
వ్యాసంలో అక్కడక్కడా వదిలేయబడ్డ అనువాదం కాని భాగాలు
సమాచారమే లేని వ్యాసాలు 1) జాంజ్‌గిర్ 2) భండారా

పాక్షిక అనువాద వ్యాసాలు మార్చు

మూస వాక్యాలు మార్చు

అంకెలు మాయం మార్చు