వాడుకరి:C.Chandra Kanth Rao/తెవికీ కవిత

2003లో తెవికీ ప్రారంభమయ్యేనయా
వెన్న నాగార్జున దీన్ని ప్రారంభించేనయా
చావా, వాకాలు తొలితరం సభ్యులయా
చదువరి, వైజాలు అభివృద్ధి చేసేరయా
శతసంఖ్య వ్యాసాలు 2005లో పూర్తయ్యేనయా
గ్రామవ్యాసాలు వైజాబాటు ఘనతనయా
మండల బొమ్మలు ప్రదీపు చేర్చేనయా
బాటుతో ముఖ్య పనులు చేసింది ఇతనేనయా
దేశభాషా వికీలలో నొకప్పుడు ప్రథమంబునయా
హిందీ భాషావికీ మనల్ని దిగజార్చేనయా
ప్రథమ స్థానంకై మళ్ళీ కృషి చేద్దామయా
మనవెనకున్న వికీలపై ఒక కన్ను వేద్దామయా
2008 తెవికీకి స్వర్ణయుగంబునయా
ఈనాడు పుణ్యాన ఇది సాధ్యమయ్యేనయా
ఎందరో సభ్యులు అప్పుడు చేరారయా
తర్వాత అందరూ కనుమరుగు అయ్యారయా
గ్రామవ్యాసాలు తెవికీలో అతిముఖ్యమయా
పట్టుపట్టి ఈ వ్యాసాలను పొడిగించాలయా
ఎందరెందరికో ఇది ప్రయోజనకరమయా
అప్పుడు తెవికీ పేరు మారుమ్రోగునయా
పత్రికలలో మన వ్యాసాలు వచ్చాయయా
గుర్తింపు మాత్రం మాకు ఇవ్వలేదయా
బొమ్మలు సైతం వాడుకున్నారయా
సున్నం మాత్రం మాకు మిగిల్చారయా
ప్రపంచవ్యాప్తంగా సభ్యులున్నారయా
రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారయా
తెలుగులో వ్యాసాలు రచిస్తున్నారయా
భాషాభిమానుల మన్ననలు పొందుతున్నారయా
ప్రతిపేజీకి ఒక చర్చా పేజీ ఉంటుందయా
సందేహాలుంటే అందులో రాయవచ్చునయా
పేజీని కొత్త పేరుతో తరలించవచ్చునయా
తొలిగింపు పని మాత్రం నిర్వాహకులదేనయా
సభ్యుల మధ్య ఘర్షణలు మామూలేనయా
అవి మరచి తెవికీని అభివృద్ధి చేద్దామయా
చిన్న వ్యాసాలపై పెదపెద్ద చర్చలు వద్దయా
చర్చలు తగ్గించి వ్యాసాలు పెద్దవి చేద్దామయా
సినిమా వ్యాసాలపై కృషి కాసుబాబుదయా
పురాణ వ్యాసాల ఘనత సుజాతదయా
పుణ్యక్షేత్రాల రచనలు బ్లాగేశ్వరుడిదయా
ఇస్లాంమత వ్యాసాలు నిసార్ భయ్యాదయా
అధికారుల సంఖ్య నాలుగేనయా
నిర్వాహకుల సంఖ్య పద్దెనిమిదయా
సభ్యుల సంఖ్య వేలల్లో ఉందయా
చురుకైన వారు మాత్రం కొందరేనయా