కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో గల అంకాలమ్మ చరిత్ర


కడప జిల్లాలోని పేరు గాంచిన శ్రీ శ్రీ దుంపలగట్టు అంకాలమ్మ తిరునాల రేపటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు ప్రతి ఏడది ఏప్రిల్ పౌర్ణమి కి ప్రారంభమే ఈ తిరుణాల మూడు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తారు

"ఏప్రిల్ లో వచ్చే పౌర్ణానికి ప్రారంభమై మూడు రోజులు పాటు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు చుట్టుపక్కల గ్రామస్తులు బియ్యం కొలతతో ప్రారంభమై బోనాలతో ముగియనున్న అంకాలమ్మ తిరుణాల"

అంకాలమ్మ చరిత్ర. దుంపలగట్టు లోని మామిళ్ల పిచ్చి రెడ్డి గారి స్వగృహంలో ఇల్లు నిర్మిస్తుండగా భూగర్భంలో నుంచి జన్మించిందని పూర్వీకులు తెలియజేశారు. ఆ కుటుంబ పెద్ద కు కల లో ప్రత్యక్ష మై విగ్రహం ఊరిబయట తీసి గుడి కట్టాలని కోరినట్లు పూర్వీకుల సమాచారం. అది కూడా ఎడ్ల బండి ద్వారా తరలించి ప్రతిష్టించాలని వారికి చెప్పినట్టు నానుడి మీ గృహం నుంచి తరలించే టప్పుడు 2 దున్నపోతుల ద్వారానే తరలించాలని అది కూడా ఒకటి మెల్లకన్ను దున్నపోతు మరొకటి ఎలాంటి అంగవైకల్యం లేని దున్నపోతు తో నన్ను తరలించాలని కోరినట్లు సమాచారం. ఆమె చెప్పిన మాటలు వినకుండా ఎడ్లబండి తో ప్రయాణం సాగించే ప్రయత్నం చేయగా ఆ ఎద్దులు అక్కడి నుంచి కదలలేక పోయాయని దానికి తోడు మరో ఎద్దుల జతను కట్టిన కదలక పోవడంతో తిరిగి అమ్మవారు చెప్పిన విధంగా ప్రయత్నించినప్పుడు బండి సులువుగా కదిలిందని పూర్వీకులు చెప్పకనే చెబుతున్నారు.

మామిళ్ల పిచ్చి రెడ్డి స్వగృహంలో వెలిసిన అంకాలమ్మ వారి తోబుట్టువుగా భావించి వారు పసుపు కుంకుమ ఇవ్వడం తో తిరుణాల ప్రారంభమవుతుంది. ఈ దుంపలగట్టు అంకాలమ్మ కు ఏడు మంది అక్కా చెల్లెలు కాగా పోతులయ్య ఒక్కడే తమ్ముడు ఆయన గ్రామం ప్రధాన ద్వారం లో ఉంటూ గ్రామం తో పాటు అక్కాచెల్లెళ్లకు

కాపాడతాడని అని గ్రామస్తులు తెలియజేశారు. ఒకప్పుడు బయనపల్లె దుంపలగట్టు అంకాలమ్మ అని పిలిచేవారని, బయనపల్లె అనే గ్రామం అంకాలమ్మ పడమటి భాగంలో ఉండి తూర్పు భాగంలో దుంపలగట్టు ఉండడంవల్ల బైనపల్లి దుంపలగట్టు అంకాలమ్మ అని పిలిచేవారని తర్వాత కొద్ది కాలానికి బయనపల్లె గ్రామం అందరూ వదిలి వెళ్లడంతో గ్రామము కనుమరుగైపోయింది. అక్కడ ఆచార్యులు వంశం మాత్రమే నివసించేవారని వారందరూ అక్కడి నుంచి ఖాళీ చేయడంతో ఆ ప్రాంతాన్ని మొత్తం బ్రహ్మంగారి మఠానికి దేవస్థానానికి సంబంధించిన భూములు కావడం విశేషం.ఒకప్పుడు బయనపల్లె దుంపలగట్టు అంకాలమ్మ అని పిలిచేవారని, బయనపల్లె అనే గ్రామం అంకాలమ్మ పడమటి భాగంలో ఉండి తూర్పు భాగంలో దుంపలగట్టు ఉండడంవల్ల బైనపల్లి దుంపలగట్టు అంకాలమ్మ అని పిలిచేవారని తర్వాత కొద్ది కాలానికి బయనపల్లె గ్రామం అందరూ వదిలి వెళ్లడంతో గ్రామము కనుమరుగైపోయింది. అక్కడ ఆచార్యులు వంశం మాత్రమే నివసించేవారని వారందరూ అక్కడి నుంచి ఖాళీ చేయడంతో ఆ ప్రాంతాన్ని మొత్తం బ్రహ్మంగారి మఠానికి దేవస్థానానికి సంబంధించిన భూములు కావడం విశేషం.