వాడుకరి:Chaduvari/అనువాదం చేద్దాం పదండి

తెలుగు వికీపీడియా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే అంశాల్లో అనువాద పరికరం ఒకటి. పేజీల నాణ్యతను చెడగొట్టే కారకాల్లో కూడా ఇది ఎత్తు పీట మీదే ఉంటది.

ఈ పరికరాన్ని అశ్రద్ధగానో, నిర్లక్ష్యం గానో వాడితే, అది ప్రచురించే వ్యాసాల్లో నాణ్యత చచ్చి ఊరుకుంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఈ పరికరపు ఇంజనుతోనే అనువదించిన 1700 పైచిలుకు చచ్చు పుచ్చు వ్యాసాలను మూకుమ్మడిగా తొలగించాల్సి వచ్చింది.

ఈ పరికరం ద్వారా వివిధ భాషల్లో అనువాదాలు ఎలా జరుగుతున్నాయో చూపే పేజీ ఇది. ఇంకా మరిన్ని గణాంకాలు ఉంటే బాగుంటుంది. దీన్ని కనీసం ఏటా నాలుగు సార్లు తాజాకరిస్తూ ఉంటే బాగుంటుంది.2020 నవంబరులో 100 అనువాదాలను ప్రచురించాను

అనువాద పరికరాన్ని సరిగ్గా వినియోగించుకుంటే పెద్ద యెత్తున వ్యాసాలను రాయవచ్చు. పెద్ద వ్యాసాలనూ రాయవచ్చు. అంగుష్ఠం పరిమాణంలో ఉండే మొలకలను మాత్రమే ప్రచురించి సమాజం మీద వదిలేసే అంగుష్ఠమాత్రులకు, తమపై ఉన్న ఆ ముద్రను వదిలించుకునేందుకూ తామూ పెద్ద వ్యాసాలను రాయగలమని నిరూపించుకునేందుకూ ఈ అనువాద పరికరం ఒక వరం లాంటిది.

అనువాదం అంటే మక్కికి మక్కి అనువదించడం కాదు, వీలైనంత సహజమైన తెలుగులో ఉండాలి. "అంబేద్కర్ చేత రాజ్యాంగం రచించబడింది" అనేది తప్పెలా అవుతుంది అని వాదించొద్దు మహాప్రభో! "అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు" అనేది సహజమైన తెలుగు అని గ్రహించు.

అనువాద పరికరం మెరుగైంది, అవుతూ ఉంది. ఉండేకొద్దీ దాని ఉత్పాదకత పెరుగుతోంది. ఈ పరికరాన్ని నిక్షేపంగా వాడవచ్చు, వాడాలి. కానీ అది చేసే తప్పులను సరిదిద్దుకున్నాకే ప్రచురించాలి. ఆ తప్పుల్లో కొన్ని:

  1. మూలంలో And ఉన్న ప్రతీచోటా "మరియు" అని రాస్తుంది. వాటిని సవరించుకోవాలి
  2. కర్మణి వాక్యాలు రాస్తుంది. అలాంటి వాక్యాల్లో కనీసం 99% శాతం వాటిని కర్తరి వాక్యాలుగా మార్చాల్సి ఉంటుంది.
  3. "యొక్క" రాస్తూంటుంది. "వికీపీడియా యొక్క వాడుకరులు" అంటుంది. "వికీపీడియా వాడుకరులు" అని గదా అనాల్సింది. అంచేత వాటిని (కనీసం 90% కేసుల్లో) సవరించాల్సి ఉంటుంది
  4. అనువాదం చేసినపుడు అర్థాన్ని మార్చేస్తూ ఉంటుంది. సరిగ్గా వ్యతిరేక అర్థం వచ్చేలా అనువదిస్తూంటుంది. మరీ తరచుగా ఏమీ జరగదుకానీ జరుగుతుంది. చాలా జాగర్తగా ఉండాలి.
  5. ఢిల్లీ, ఔ లాంటి కొన్నిటిని అనువదించాల్సిన చోట అది చిత్రమైన తప్పులు చేస్తుంది. వాటిని సవరించాల్సి ఉంటుంది.

ఎన్ని లోపాలున్నా దానితో అనేక ఉపయోగాలూ ఉన్నాయి

  1. దాన్ని వాడి చాలా వేగంగా పనులు చెయ్యవచ్చు. పైన చూపిన తప్పులను సవరించుకుంటూ కూడా రెండు మూడు గంటల్లో 20, 30 వేల బైట్లను సునాయాసంగా అనువదించి (సైన్సు వ్యాసాలకు కొంత ఎక్కువ టైం పడుతుంది) సలక్షణమైన వ్యాసాన్ని ప్రచురించవచ్చు.
  2. వ్యాసంలో రావాల్సిన మూలాలన్నీ వచ్చేస్తాయి. మనమేమీ శ్రమ పడనక్కర్లేదు.
  3. వ్యాసంలో ఉండే హంగులు - సమాచారపెట్టెలు, మూసలు, వికీలింకులు, బొమ్మలు, వ్యాసరూపాన్ని నిర్ధారించే పేరాగ్రాఫులు వగైరాలు - అన్నీ ఆటోమాటిగ్గా వచ్చేస్తాయి

ఇతర భారతీయ భాషలతో పోలిస్తే తెలుగులో అనువాదాలు తక్కువగా ఉంటున్నై. మనం మరింత ఎక్కువగా దీన్ని వినియోగించాలి. అనువాద గణాంకాలు చూడండి

గణాంకాలు

మార్చు
వివిధ భాషల్లో అనువాద పరికరం ద్వారా ప్రచురించిన వ్యాసాల సంఖ్యలో వృద్ధిక్రమం
2019

అక్టో 15

2020

మే 7

2020

జూలై 5

2020

నవం 27

2019 అక్టో 15

2020 నవం 27

మధ్య ప్రచురణల్లో వృద్ధి

2019 అక్టో 15

2020 నవం 27

మధ్య అనువాదకుల్లో వృద్ధి

తెలుగు 1145 1518 1569 1963 71.4% 2.8%
తమిళం 9756 12804 13066 14634 50.0% 3.3%
మలయాళం 4243 5380 5586 6102 43.8% 8.0%
కన్నడం 1083 1555 1712 2055 89.8% 15.3%
హిందీ 2590 3288 3396 3845 48.5% 19.5%
బెంగాలీ 5551 8274 9261 11410 105.5% 13.0%
మరాఠీ 329 435 552 729 121.6% 11.7%
పంజాబీ 6407 8551 8742 9111 42.2% 9.1%
ఉర్దూ 997 1767 2054 3076 208.5% 19.1%
ఒడియా 1435 1496 1510 1560 8.7% 14.1%
గుజరాతీ 1734 1912 1939 2053 18.4% 13.8%
2020 మే 7 నాటి అనువాదాలు / అనువాదకులు గణాంకాలు
అనువాదాలు అనువాదకులు నిష్పత్తి
తెలుగు 1518 212 7.16
తమిళం 12804 891 14.37
మలయాళం 5380 327 16.45
కన్నడం 1555 177 8.79
హిందీ 3288 477 6.89
బెంగాలీ 8274 889 9.31
మరాఠీ 435 137 3.18
పంజాబీ 8551 209 40.91
ఉర్దూ 1767 199 8.88
ఒడియా 1496 64 23.38
గుజరాతీ 1912 145 13.19
2020 మే 7 నాటికి పూర్తైన/పురోగతిలో ఉన్న అనువాదాలు
ఫూర్తైనవి పురోగతిలో శాతం
తెలుగు 1518 319 21.0%
తమిళం 12804 536 4.2%
మలయాళం 5380 378 7.0%
కన్నడం 1555 241 15.5%
హిందీ 3288 440 13.4%
బెంగాలీ 8274 1216 14.7%
మరాఠీ 435 107 24.6%
పంజాబీ 8551 159 1.9%
ఉర్దూ 1767 204 11.5%
ఒడియా 1496 27 1.8%
గుజరాతీ 1912 45 2.4%
2020 జూలై 5 నాటి గణాంకాలు
ఫూర్తైనవి పురోగతిలో శాతం
తెలుగు 1569 360 22.9%
తమిళం 13066 554 4.2%
మలయాళం 5586 385 6.9%
కన్నడం 1712 238 13.9%
హిందీ 3396 441 13.0%
బెంగాలీ 9261 1284 13.9%
మరాఠీ 552 124 22.5%
పంజాబీ 8742 152 1.7%
ఉర్దూ 2054 217 10.6%
ఒడియా 1510 31 2.1%
గుజరాతీ 1939 39 2.0%
2020 జూలై 5 నాటి అనువాదాలు / అనువాదకులు గణాంకాలు
అనువాదాలు అనువాదకులు నిష్పత్తి
తెలుగు 1569 215 7.30
తమిళం 13066 903 14.47
మలయాళం 5586 336 16.63
కన్నడం 1712 180 9.51
హిందీ 3396 505 6.72
బెంగాలీ 9261 935 9.90
మరాఠీ 552 144 3.83
పంజాబీ 8742 218 40.10
ఉర్దూ 2054 212 9.69
ఒడియా 1510 66 22.88
గుజరాతీ 1939 152 12.76
2020 నవంబరు 27 నాటి గణాంకాలు
ఫూర్తైనవి పురోగతిలో శాతం
తెలుగు 1963 529 26.9
తమిళం 14634 736 5.0
మలయాళం 6102 559 9.2
కన్నడం 2055 281 13.7
హిందీ 3845 488 12.7
బెంగాలీ 11410 1208 10.6
మరాఠీ 729 156 21.4
పంజాబీ 9111 164 1.8
ఉర్దూ 3076 246 8.0
ఒడియా 1560 46 2.9
గుజరాతీ 2053 75 3.7
2020 నవంబరు 27 నాటి అనువాదాలు / అనువాదకులు గణాంకాలు
అనువాదాలు అనువాదకులు నిష్పత్తి
తెలుగు 1963 218 9.00
తమిళం 14634 920 15.91
మలయాళం 6102 353 17.29
కన్నడం 2055 204 10.07
హిందీ 3845 570 6.75
బెంగాలీ 11410 1005 11.35
మరాఠీ 729 153 4.76
పంజాబీ 9111 228 39.96
ఉర్దూ 3076 237 12.98
ఒడియా 1560 73 21.37
గుజరాతీ 2053 165 12.44