వాడుకరి:Chaduvari/కొత్త వాడుకరుల కోసం
వికీపీడియాకు కొత్త వాడుకరులను పరిచయాం చేసి, వారికి వికీపీడియా పట్ల ఆసక్తిని కలిగిస్తూ, వారిని నిబద్ధత కలిగిన వికీపీడియన్లుగా మలచడానికి అవలంబించాల్సిన పద్ధతులను ఇక్కడ పరిశీలిద్దాం.
కొత్త వాడుకరి ప్రస్థానం
మార్చువికీ సాంకేతికతను, వికీ నియమ నిబంధనలను తక్కువగా, కేవలం అవసరమైనంతా మేరకే పరిచయం చేస్తూ కొత్త వాడుకరికి ఆసక్తి కలిగించేలా ప్రయత్నించడమే ఈ దశ లక్ష్యం. ఈ దశలో కొత్త వాడుకరికి కింది ఆంశాలను నేర్పాలి
క్ర సం | అంశం | వీడియో వ్యవధి | గురూపదేశం | వాడుకరి కృషి, ప్రయోగాలు |
---|---|---|---|---|
1 | తెలుగు వికీపీడియా అనగా నేమి? | 2 గంటలు | ||
2 | లాగినవడం (వీడియో పాఠం) - | అర గంట | ||
3 | తెలుగు వికీపీడియా ఇంటరుఫేసు పరిచయం (వీడియో పాఠం) (5 నిముషాలు) | 5 | 4 గంటలు | |
4 | అభిరుచులు గురించిన పాఠం (వీడియో పాఠం) (6 నుండి 8 నిముషాలు) | 8 | 4 గంటలు | |
4.1 | భాష అభిరుచులను సెట్ చేసుకోవడం | |||
4.2 | సంతకం | |||
4.3 | దిద్దుబాట్లు | |||
6 | తెలుగులో రాయడం ఎలా 1 (లిప్యంతరీకరణ) (3 నిముషాలు) | 3 | 1 గంట | 4 గంటలు |
7 | ప్రయోగశాల పాఠం (3 నిముషాలు) | 3 | 1 గంట x 4 | 12 గంటలు |
8 | వికీ సాంకేతికత పరిచయం | |||
8.1 | పేరుబరులు (మొదటి, చర్చ, వాడుకరి, వాడుకరి చర్చ) (3 నిముషాలు) | 3 | అర గంట | |
8.2 | వర్గాల గురించి - ఎందుకు, ఎలా (3 నిముషాలు) | 3 | 1 గంట | 4 గంటలు |
8.3 | సంతకం గురించి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు వగైరాలు (2 నిముషాలు) | 2 | అర గంట | |
8.4 | లింకులు: అంతర్గత లింకులు, బయటి లింకులు, - ఎప్పుడు, ఎలా? (3 నిముషాలు) | 3 | 1 గంట | 4 గంటలు |
9 | భాష, శైలి గురించి (5 నిముషాలు) | 5 | 1 గంట | |
10 | వ్యాసం యొక్క రూపురేఖల గురించి | 5 | 1 గంట | |
11 | దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి | 5 | 1 గంట | 4 గంటలు |
పై శిక్షణ మొత్తానికి ఒక వారం రోజులు పడుతుంది. ఆ తరువాత కొత్త వాడుకరి వ్యాసాఅలపై దిద్దుబాట్లు మొదలు పెడతారు. గురు వాడుకరి, వారిని అనుసరిస్తూ, వారి తప్పొప్పులను గమనిస్తూ సవరిస్తూ ఉంటారు. ఏ తప్పులను వెనువెంటనే సవరించాలి, వేటిని నిదానంగా సవరించవచ్చు అనేవాటిని నిర్ధారించి పెట్టుకోవాలి.
శిక్షణ ఇచ్చేటపుడు వారికి ఉదాహరణలుగా, నమూనాలుగా చూపేందుకు అనువైన వ్యాసాల జాబితాను తయారు చేసుకోవాలి.
కొత్త వాడుకరి 250 దిద్దుబాట్లు చేసేసరికి, పై అంశాలపై అవగాహన వస్తుంది.
రెండవ స్థాయి వాడుకరికి
మార్చువికీపీడియాలో చేరి, క్రమం తప్పకుండా రాస్తూ మొదటి అంచే లోని అంశాల పట్ల అవగాహన కలిగిన వాడుకరులను ఈ స్థాయి లోకి చేర్చవచ్చు.
- వికీ నియమ నిబంధనలు - మూల స్థంభాలు,
- చేసేవి
- చెయ్యకూడనివి
- తెలుగులో రాయడం ఎలా 2 (ఇన్‌స్క్రిప్టులు)
- మీడియా వికీ గురించి, వికీమీడియా గురించి, వివిధ ప్రాజెక్టుల గురించి
- తెలుగులో వివిధ మీడియా వికీ ప్రాజెక్టుల గురించి (వికీపీడియా, వికీసోర్సు వగైరాలు)
- వికీ సాంకేతికత
- పేరుబరులన్నిటి గురించి
- మూసలు
- ప్రత్యేక పేజీలు
- మూలాలను చేర్చడం
- వికీపీడియా పేరుపబరిలోని వ్యాసాలు
- సహాయం పేరుబరిలోని వ్యాసాలు
- అనువాద పరికరం
- వాడుకరులు, పాత్రలు, అధికారాలు
- మీరు నిర్వాహకులవడం ఎలా
- తెలుగు వికీపీడియాను ఎలా అభివృద్ధి చెయ్యాలి - మీ సలహాలు
-