నా పేరు దాసరి ప్రవీణ్. నేను విజయవాడలోని ఆంధ్ర లొయోల కళాశాలలో (www.andhraloyolacollege.ac.in/)ఇంటర్, డిగ్రీ, మరియు పీజీ చదువుకున్నాను. నేను ఇదే కళాశాలలో ఆంగ్లభాష అధ్యాపకునిగా గత 22 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. నాకు తెలుగు భాషమీద మక్కువ ఎక్కువ. దైవధ్యానం, వాక్పరిచర్య తర్వాత సంగీతం అంటే ప్రాణం. నా తల్లి పేరు మెర్సి కమలాబాయి, తండ్రి పేరు డి. వి. డానియల్. నా భార్య పేరు సోజి, నాకు ఇద్దరు కుమారులు: ప్రహర్ష్, ప్రఖ్యాత్.

పుట్టిన తేది మార్చు

నేను 16 అక్టోబర్ 1966 న పుట్టాను.

పుట్టిన స్థలం మార్చు

నేను గుంటూరులోని కుగ్లర్ ఆసుపత్రిలో పుట్టాను.


ఉన్నత విద్యాభ్యాసం మార్చు

నేను ఆంధ్ర లొయోల కళాశాలలో ఇంటర్ నుండి పిజి వరకు చదివాను. నాకు విద్యాబోధన చేసిన గురువులలో ప్రముఖులు: సర్వ శ్రీ కె. వి. విజయబాబు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎం. సురేశన్, పి. వీరబ్రహ్మం, పి. రామానుజం, ఫాదర్ సి. పీటర్ రాజ్.

ఉద్యోగం మార్చు

ఆంధ్ర లొయోల కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా గత 22 సంవత్సరాలుగ పనిచేస్తున్నాను.

[1]

  1. సంగీతం, ప్రవీణ్ దాసరి, దాసరి ప్రచురణలు, విజయవాడ, 2014