Devagiri Pankajan
నమస్కారాలు, నేను వికీపీడియా ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నాను..!
నాపేరు పంకజన్ దేవగరి. భారత్ లోని మహారాష్ట్ర రాష్ట్ర రాజధానిగానే కాకుండా దేశానికి వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన ముంబయి నగరంలో నేను నివాసముంటున్నాను(చారిత్రకంగా, వాణిజ్య పరంగా, పర్యాటకపరంగా ముంబయి నగరానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అరేబియా మహాసముద్రం ఒడ్డున ముంబయి నగరం ఉంటుంది). నా వయస్సు 29 సంవత్సరాలు. నా స్వస్థలం భారత్ లోని హైదరాబాద్ నగరం. ఇటీవలే అనేక పోరాటాల ఫలితంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హైదరాబాదే రాజధానిగా ఉండేది. నా మాతృభాష తెలుగు. నేను ప్రస్తుతం ముంబయి నగరంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాను. నేను మా ఊరిలో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, మెడికల్ రంగంపై ఉన్న మక్కువతో, ఆ రంగంలో మరింత విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, మెలకువలను పెంపొందించుకోవడానికి బి.ఫార్మసీ చేయాలనుకున్నాను. ఇందులో భాగంగానే భారత్ లోని ఓ ప్రముఖ విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫార్మసీ కళాశాలలో చేరాను. ఈ సమయంలో అనేక విషయాలను నేర్చుకుని, పరీక్షలు రాసి విజయవంతంగా బి.ఫార్మసీ డిగ్రీ పూర్తి చేశాను.
వైద్యరంగంలో నానాటికి వస్తున్న మార్పులకు తోడు, కొత్త కొత్త రోగాలు మానవ జాతి మనుగడకు ప్రమాదంగా మారడం గమనించాను. అందుకే నేను చదువుకున్న రంగంలో తక్కువ ఖర్చుతో మందులు తయారు చేసే పరిశోధనల్లో నా జ్ఞానాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఈ దిశగా ఇప్పటికే సాగుతున్న నా ప్రయోగాలు ఈవిజయవంతమై ప్రజలకు సహాయ సహకారాలను అందించేందుకు నేను విశేషంగా ప్రయత్నిస్తున్నాను. ఇందులో భాగంగానే ప్రస్తుతం భారత్ లోని మహారాష్ట్ర రాజధాని అయిన ముంబయి నగరంలో ఓ ప్రముఖ ఫార్మసీ కంపెనీలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాను. వికీపీడియా ద్వారా నా గురించి ఎప్పటికప్పడు మీకు సమాచారం అందించాలని, విశేషాలను షేర్ చేయాలనే ఉద్ధేశ్యంతో నేను మీ ముందుకు వచ్చాను.