వాడుకరి:Herovillains/ప్రయోగశాల

తన ప్రసంగాల ద్వారా కొత్తతరం భారతీయులలో దేశభక్తిని నింపి, నూతన శక్తిని ప్రేరణను నూతన శక్తిని, ప్రేరణను ఇచ్చి, భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను, భావదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేశారు రాజీవ్‌ దీక్షిత్‌ (నవంబర్ 30, 1967 - నవంబర్ 30, 2010) (Rajiv dixit) ఒక మహోజ్వల శక్తి.

రాజీవ్ దీక్షిత్ 1967 నవంబర్ 30 న రాథేశ్యాం దీక్షిత్ , మిథిలేష్ కుమారి లకు జన్మించాడు.

బాల్యం, చదువు

మార్చు

రాజీవ్ దీక్షిత్ జన్మదినం 1967 నవంబర్ 30. వారి స్వగ్రామం ఉత్తర్ ప్రదేశ్ లోని నాహ్ గ్రామంలో జన్మించాడు.

తల్లితండ్రుల సంరక్షణలో మాధ్యమిక విద్యను కొనసాగించిన తరువాత ఉన్నత విద్య కోసం 1994లో అలహాబాదుప్రయాగ లోని ఐ.ఐ.టి.ఇన్స్టిట్యూట్ లో బి.టెక్ చదివారు. తరువాత ఐఐటీ కాన్పూర్ లో శాటిలైట్ కమ్యూనికేషన్‌లో యం.టెక్‌ చేశారు. తరువాత ఫ్రాన్స్‌లో టెలికమ్యూనికేషన్‌లో పిహెచ్‌.డి. చేశారు. తరువాత ఒకప్పటి భారతీయ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె.అబ్దుల్‌కలామ్‌తో కలిసి సి.ఎస్‌.ఐ.ఆర్‌.లో శాస్త్రవేత్తగా కలిసి పనిచేశారు

పోరాటం

మార్చు

1998 లో స్విస్‌ బ్యాంక్‌లోని నల్లధనాన్ని గురించి తెలుసుకుని 2002 నుండి దాని గురించి ప్రజలకు తన ఉపన్యాసాల ద్వారా తెలియజేశారు. భారతీయుల నల్లధనాన్ని జాతీయ సంపదగా గుర్తించాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు.[1]

ఇంకా, పెప్సీ, కోకో కోలాల్లో పురుగు మందులున్నాయన్నాయని, వాటిని టాయ్‌లెట్‌ క్లీనర్స్‌గా ఉపయోగించవ్చని చెప్పారు.[2] వాటికి వ్యతిరేకంగా 1998లో ‘ఆజాదీ బచావో ఆందోళన్‌’ ఉద్యమాన్ని నడిపించారు. సెంట్రల్‌ లేబరేటరీ సైంటిస్ట్‌ డా||సునీతా నారాయణ్‌ కూడా పెప్సీ, కోకో కోలాల్లో పురుగు మందులున్న మాట నిజమని నిర్ధారించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి మన రూపాయి విలువ 1 డాలరుతో సమానంగా ఉండేది. అలాగే 1 రూపాయి బ్రిటన్‌ పౌండ్‌కి సమానంగా ఉండేది. ఇంకా ఫ్రాంక్‌, దస్మా కూడా మన 1 రూపాయికి సమానంగా ఉండేవనే విషయాన్ని తెలియజేశారు 'రాజీవ్‌ దీక్షిత్‌'.

అమెరికాలో కోల్గేట్‌ బాక్స్‌మీద ’14 సంవత్సరాల లోపు వారికి దూరంగా ఉంచండి’ అని వ్రాసి ఉంటుంది. అలాగే భారతదేశంలో వాడే పెప్సూడెంట్‌ బాక్స్‌ మీద ’12 సంవత్సరాల లోపు పిల్లలకు అందుబాటులో ఉంచకండి’ అని ఉంటుంది. కానీ వాటి ప్రచారం కోసం మాత్రం చిన్న పిల్లల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు రాజీవ్‌ దీక్షిత్‌. రాజీవ్‌దీక్షిత్‌ డాక్టరేట్‌, సైంటిస్ట్‌ అయినప్పటికీ వారు పేరుకు ముందుగానీ వెనుక గానీ ఎప్పుడూ వాటిని వాడుకునే వారు కాదు. అంతేకాక 09-01-2009 న ‘భారత్‌ స్వాభిమాన్‌’ అనే ఉద్యమాన్ని నడిపించారు రాజీవ్‌ దీక్షిత్‌.

స్వామి వివేకానంద భారతదేశానికి ఎలా నూతన శక్తిని ఇచ్చారో, అదే విధంగా తన ప్రసంగాల ద్వారా కొత్తతరం భారతీయులలో దేశభక్తిని నింపి, నూతన శక్తిని, ప్రేరణను ఇచ్చి, భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను, భావదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేశారు 'రాజీవ్‌ దీక్షిత్‌'. స్వదేశీ చికిత్స పేరుతో 'వాగ్భటుడు' మొదలైన మహర్షులు రాసిన ఆయుర్వేద రహస్యాలను సామాన్య జన బహుళ్యంలో ప్రచారం చేసి, అల్లోపతిలో లక్షలు పోసినా నయం కానీ అనేక వ్యాధులకు సులువైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు 'రాజీవ్‌ దీక్షిత్‌'. రోగాలను నయం చేసుకోవడమే కాదు, రోగాలు రాకుండా సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పారు.


ఆదర్శ జీవనం

మార్చు

'రాజీవ్‌ దీక్షిత్‌' శాస్త్రవేత్తగా యు.ఎస్‌.ఎ.లో, యు.కె.లో తన జీవితం ఎంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ భారతదేశంలో మల్టీనేషనల్‌ కంపెనీలు చేస్తున్న దోపిడీల గురించీ, నల్లధనం గురించి, ఇంకా భారతదేశంలోని ఆయుర్వేద వైద్యంలోని గొప్పతనాన్ని తెలియజేయటానికి భారతీయ ప్రజలను చైతన్యపరచటానికి సామాన్య భారతీయునిగా ఆదర్శ జీవనం జీవించారు. ఉన్నతమైన విద్యనభ్యసించినా, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను చూసి, తన జీవితం కంటే దేశభవిష్యత్తు ముఖ్యమని, తన జీవితాన్నే పణంగా పెట్టి, స్వదేశీ ఉద్యమం నడిపారు రాజీవ్‌ దీక్షిత్‌. భారతీయులకు తెలియకుండా దాచిపెట్టిన అనేక విషయాలను బట్టబయలు చేశారు. మనలో ఎప్పుడైనా ఆత్మన్యూనత కలిగినా, భారతీయులు ఇతర దేశీయులకంటే తక్కువ అనిపించినా, రాజీవ్‌ దీక్షిత్‌ గారి ప్రసంగాలను వింటే, ఇక వారు ఎప్పటికి ఆత్మన్యూనతకు లోనవ్వరు. ఆధునిక భారతావనిలో నిజమైన దేశభక్తుడు రాజీవ్‌ దీక్షిత్‌. వారి వలన అనేకమంది భారతీయులు స్ఫూర్తిని పొందారు.

వారు జన్మించింది 30 నవంబరు అయితే, మరణించింది కూడా 30 నవంబరు కావడం విచిత్రం. 30-11-2010న ‘భారత స్వాభిమాన్‌’ ప్రచార యాత్రలో భాగంగా చత్తీస్‌ఘడ్‌లోని బిలాయ్‌ గ్రామంలో ఆకస్మికంగా మరణించారు.

ప్రచురణలు

మార్చు

రాజీవ్ దీక్షిత్ అనేక పుస్తకాలను వ్రాసారు.[3] మరియు అనేక ఉపన్యాసాలు కూడా ఇచ్చారు.[4]

  • 4-volume Swadeshi Chikitsa
  • Gau Mata Panchgavya Chikitsa.
  1. Lecture on Poverty Population & Black Money in Swiss Bank
  2. Do Not Drink Coke,Pepsi.Its Really Toilet Cleaner
  3. Rajiv Dixit Books, Ringaal
  4. [http:https://www.youtube.com/user/RajivDixitMission/videos RajivDixitMission] {{citation}}: Check |url= value (help)