వాలు పాఠ్యంశ్రీధర లక్ష్మీనరసింహం 1929లో వెంకటగిరి టౌన్ జన్మించాడు. ఇతని తండ్రి శ్రీధర వెంకటసుబ్బయ్య వెంకటగిరి రాజాగారి ఆలయాల మీద అములుదారు. వెంకటసుబయ్యకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు నరసింహం వెంకటగిరిలో హైస్కూల్ చదువు పూర్తయిన తరవాత గుంటూరు హిందూ కాలేజీలో ఇఇంటర్మీడియేట్పూర్తిచేసి, ఆంధ్రాయూనివర్సిటీ, విశాఖలో బీకామ్ చదివాడు. ఆ విశ్వవిద్యాలయం రిజిస్ట్రారు గోపాలస్వామి నాయుడు ఇతని లోని నాటకకళ మీది శ్రద్ధను చూచి విశ్వవిద్యాలయ సాంస్కృతిక ఉత్సవాలలో నాటకాలలో వేషాలు వేయించాడు. వెంకటగిరిలో ఆచార్య ఆత్రేయ వంటి వారి వలన ప్రజల్లో నాటకాల పట్ల ఆకర్షణ ఉండేది.నరసింహం కల్చరల్ ఆర్ట్స్ అసోసియేషన్ సభ్యడుగా చేరి, వెంకటగిరిలో, ఇతర పరిషత్తులలో పోటీ నాటక పరిషత్తు ప్రదర్శనల్లో పాల్గొని నటనలో అనుభవం సంపాదించాడు.

1953లో పోస్టల్ శాఖ ఉద్యోగంలో చేరి, నెల్లూరు, కోట, రాపూరు, వెంకటగిరి మొదలయినచోట్ల పోస్టుమాస్టర్ గా చేస్తూ నాటక ప్రదర్శనల్లో పాల్గొనేవాడు . ఏకపాత్రాభినయం, లలితసంగీతం, జానపద సంగీత పోటీలలో పాల్గొని పురస్కారాలు పొందేవాడు. ఇతను తిరుపతిలో పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత సినిమాలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో మామగారు సినిమాలో ముఖ్యపాత్ర ధరించి మెప్పించాడు. ఉద్యోగధర్మం, పిల్లల చదువులకు సినిమా నటన అడ్డుకాకుడదనే, అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. తిరుపతి, వేంకటగిరి, గూడూరు, నెల్లూరు లో జరిగిన ఎన్నో నాటక పరిషత్తులో నిర్ణేతగా న్సిస్పక్షపాతంగా వ్యవహరించినట్లు మంచి పేరు తెచ్చుకొన్నాడు.

1987 డిసెంబరులో ఉద్యోగవిరమణ తర్వాత నరసింహం ఆధ్యాత్మిక భజన పాటలు పాడడం, పాటలు రచించడం కొన్నాళ్ళు, తర్వాత వెంకటగిరి రాజా డాక్టర్ భాస్కరసాయికృష్ణ యాచేంద్ర "గేయధార" కార్యక్రమాల్లో ఆ ప్రక్రియను ప్రేక్షకులను పరిచయం చేస్తూ యాచేంద్రతో పాటు అనేకప్రదర్శన్లో పాల్గొని గేయధార కార్యక్రమం జయప్రదం కావడానికి తోడ్పడ్డాడు.

ఇతను రాసిన కొన్ని భక్తి గీతాలు రికార్దు అయ్యాయి.

నరసింహం మంచి ఉపన్యాసకుడు. అనేక సభల్లో సభారజకంగా ఉపన్యసించాడు 91ఒకటోఏట ఇతని పెద్దకుమారుడు, భారత సైన్యంలో మేజర్ హోదాలో పనిచేసి విశ్రాంత జీఏవిటం గడుపుతున్న డాక్టర్ సత్యనారాయణ మరణించడంతో ఆ దిగులుతో 92వ ఏట నెల్లూరులో పిల్లల వద్ద 2021 సెప్టెంబర్ 9న పూర్ణజీవితం అనుభవించి అసువులు బాశాడు.