దిమిత్రి మెండలీవ్ (1834-1907) సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్. మూలకాల అధ్యయనం కొరకు కనుగొనబడ్డ ప్రతి మూలకానికి ఒక్కొక్క కార్డును తయారు చేసి దానిపై మూలక పరమాణు ద్రవ్యరాశిని చూపి, పరమాణు ద్రవ్యరాశి మరియు ధర్మాల ఆధారంగా కార్డులను ఏ విధంగా కలుపబడినవో వాటి నుండి మూలకాల ఆవర్తన పట్టికను శోధించడం జరిగింది. ప్రారంభ జీవితం [ మూలం ] అతను సైబీరియాలోని టోబ్లోస్క్‌లోని వెర్ఖ్నే ఆరెంజయానీ గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇవాన్ పావ్లోవిచ్ మెండలీవ్ మరియు మరియా డిమిత్రివ్నా మెండలీవ్. అతని తాత పేరు పావెల్ మాక్సిమోవిచ్ సోకోలోవ్. అతను రష్యన్ ఆర్థోడాక్స్ చర్చికి పాస్టర్