MD. అబ్దుల్ ఖలీమ్ ఆజాద్ (MPA THEATRE, BFA, B.COM,) సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత.,

MD. అబ్దుల్ ఖలీమ్ ఆజాద్ సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత.,

ఖలీమ్ థియేటర్ (కళా వికసిత కల్చరల్ థియేటర్) అనే సంస్థను స్థాపించి, నాటకరంగంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తూ తానే స్వయంగా నాటకాలు రాస్తూ, దర్శకత్వం వహిస్తూ నాటకరంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సినీ మరియు నాటక రంగంలో ఎందరో యువకులకు శిక్షణ ఇస్తున్నారు, పదికి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. నాటక రంగం తో పాటు సినిమా రంగంలో కూడా సాంకేతిక నిపుణుడిగా (ఆర్ట్ అసిస్టెంట్ ) గా కొనసాగుతున్నారు.

MD అబ్దుల్ ఖలీమ్ 1989 లో జూన్ 15 అప్పంపల్లి గ్రామం కౌకుంట్ల మండలం, మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో జన్మించాడు 2008 లో హైద్రాబాద్ వచ్చి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్స్ , బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(BFA) పూర్తి చేసుకొని నటన పై మక్కువతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కలల శాఖా యందు, M.A థియేటర్ ఆర్ట్స్ లో ప్రవేశం పొంది 2018 లో మాస్టర్స్ పూర్తి చేసుకుని, పద్యనాటకం PG. డిప్లొమా కూడా ఇదే యూనివర్సిటీ లో పూర్తి చేసుకున్నాను. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నటనలో శిక్షణ ఇస్తూ 2019 లో అప్పంపల్లి ZPHS ప్రభుత్వ పాఠశాలల యందు విద్యార్థులచే “విత్తనం విలువ’ నాటకాన్ని “ రచనా దర్శకత్వంలో కురుమూర్తి స్వామి జాతర ప్రాంగణ వేదిక పై ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నందు నటన శిక్షకుడిగా పనిచేస్తూ, నటనను నేర్పిస్తూ, ఖలీమ్ థియేటర్ (కళా వికసిత కల్చరల్ థియేటర్) అనే సంస్థను స్థాపించారు.

      MA థియేటర్ చదువుకునే సమయం లొనే “ Brain wash ” నాటికను, హిందీ నుండి తెలుగులో  Brain wash / జిహాద్ / wrong stop పేరుతో, స్వేచ్ఛ అనువాదం చేసాను. 2017 లో సాంబశివ దర్శకత్వంలో student production లో భాగంగా పోటీ శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మరియు యువ నాటకోత్సవం లో భాగంగా రవీంద్ర భారతి లో మరికొన్ని  చిన్న వేదికల పై ప్రదర్శనలు జరిగింది.

2018 లో నా MPA పరీక్షలలో student production లో భాగంగా“ దిగ్ దర్శక్ ” హిందీలో ప్రియం జానీ (రచయిత దర్శకత్వం) నాటికను తెలుగు “ నాటక ప్రస్థానం ” నాటకం స్వేచ్ఛ అనువాదం చేసి సొంత దర్శకత్వంలో ప్రదర్శించారు.

2019 లో అప్పంపల్లి ZPHS ప్రభుత్వ పాఠశాలల యందు విద్యార్థులచే “విత్తనం విలువ’ నాటకాన్ని “ రచనా దర్శకత్వంలో కురుమూర్తి స్వామి జాతర ప్రాంగణ వేదిక పై ప్రదర్శించను.

2021 లో భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో “కలీమ్ థియేటర్” ఆధ్వర్యంలో పొట్లపల్లి రామారావు గారు రాసిన “సమాధి స్థలం” అనే చిన్న కథని నాటకంగా మలిచి, స్వీయ రచన దర్శకత్వంలో తేది 14/12/2021 “సమాధి స్థలం’ నాకాన్ని రవీంద్ర భారతి లో ప్రదర్శించడం జరిగింది.

2022 లో ఇస్లామిక్ (ముస్లిం) సమాజంలో జరిగే ఒక  అపోహతో కూడిన సాంప్రదాయ సమస్య మూలాధారంగా జరిగే విభిన్న కథాంశాన్ని ఎంచుకొని,  “తలాక్-ఇ-నిఖా” అనే ఉర్దూ నాటకాన్ని,  స్వీయ రచన, దర్శకత్వంలో  “తలాక్-ఇ-నిఖా” నాటకాన్ని 24/5/2022 రోజున తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ  సహకారంతో “కలీమ్ థియేటర్” ఆధ్వర్యంలో ప్రదర్శించడం జరిగింది.
27/06/2022 లో Dr. ఖాజా పాషా గారు రాసిన “ గాయత్రి D/O బషీర్ అహ్మద్” నాటికను నా దర్శకత్వంలో రవీంద్ర భారతి వేదిక పై ప్రదర్శించడం జరిగింది.
అంతే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా భాషా సాంస్కృతిక శాఖ మరియు “తెర” సంస్థ. ఆధ్వర్యంలో జరిగిన యువ నాటకోత్సవాలు అన్ని సీజన్లలో నటుడిగా సాంకేతిక నిపుణుడిగా పనిచేసారు.

నాటక రంగంలో చేసిన కృషి

నాటక రచనలు& దర్శకత్వం :

• విత్తనం విలువ


జిహాద్ (మూలం హిందీ అనువాదం తెలుగు)

• నాటక ప్రస్థానం (మూలం హిందీ అనువాదం తెలుగు)

• సమాధి స్థలం

• తలాక్-ఇ-నిఖా

• శవం చేసిన సహాయం

•ఏమో గుర్రం ఎగరావచ్చు

• సర్పంచ్ స్వరాజ్యం

• ఫేమస్ రీల్స్ లొల్లి (ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ బేగంపేట్ ఫ్రీ వర్క్ షాప్)

సాంకేతిక నిపుణుడిగా చేసిన నాటకాలు :

• అశ్శరభ శరభ • అంబల బండ • దిక్సూచి • అశ్వత్థామ(పద్యనాటకం) • మోరియా • ఇచ్చంద్రం • స్మరామి సమరయోధ • పావు టికెట్ పరేషాన్ • రాయి • చాకలి ఐలమ్మ • చరమ స్థలం • టియర్స్ ఆఫ్ బ్లడ్ • పైసా వసూల్ • సర్దార్ సర్వాయి పాపన్న (puts student production) • బంగారు తల్లి • పరాయి • H2o సిస్ • పుష్ప నారి •

పనిచేసిన కొన్ని నాటక సంస్థలు

• దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ • ప్రియ నటనం • సహృదయా కల్చరల్ థియేటర్ • మిఠాయి ఆర్ట్స్ థియేటర్ ఆర్గనైజేషన్, • స్మైల్ థియేటర్, • క్రియేటివ్ థియేటర్, • మనం ఫౌండేషన్ • సుమిత్ర యూత్ అసోసియేషన్ • ఇండియన్ మైమ్ అకాడమీ • శివాని ఆర్ట్స్ అసోసియేషన్

వంటి సంస్థలలో ఎన్నో నాటకాలకు 100 కి పైగా ప్రదర్శనలకు నటుడిగా సాంకేతిక నిపుణుడిగా పని చేయడం
జరిగింది.

రంగస్థల కళల శాఖలో విద్యార్ధి గా ఉన్నపటి నుండి ప్రస్తుతం వరకు Dr. కోట్ల హనుమంతరావు పీఠాధిపతి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గారు, Dr. బి. హెచ్. పద్మప్రియ (అసిస్టెంట్ ప్రొఫెసర్ ) రంగస్థల కళలు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మరియు గారు, Dr. అంథోని రాజ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) గారు మరియు కల్యాణి సుందరమ్మ గారి దర్శకత్వంలో కొన్ని నాటకాలలో నటుడిగా, మళ్ళది గోపాలకృష్ణ గారు, dr. రాయల హరిశ్చంద్ర గారి దగ్గర సాంకేతిక నిపుణుడిగా అనుభవాన్ని గడించను.

ఇండియన్ మైమ్ అకాడమీ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన 12 రోజుల మైమ్ వర్క్ షాప్ లో అసిస్టెంట్ instructor గా పనిచేసాను.
మిఠాయి ఆర్ట్స్ థియేటర్ అధ్వర్యంలో నాటక శిక్షణ శిబిరాలలో నట శిక్షకుడిగా

• మిఠాయి థియేటర్ ఆధ్వర్యంలో TSWR ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మల్కాజిగిరి లో 3 సంవత్సరాలు 2016 నుండి 2018 వరకు గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేసాను.

• యంగ్ థియేటర్ ఫర్ చిల్డ్రన్ లో భాగంగా ఆల్గోరితమ్ ప్రోగ్రామ్ కి థియేటర్ టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేసాను.

• తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో మిఠాయి ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో లో 2017 లో థియేటర్ ఫర్ యంగ్ ఆడియెన్స్ వర్క్ షాప్ లో థియేటర్ టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేసాను

• తెలంగాణ గిరిజన మరియు సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులకు 2018 లో సమ్మర్ సమురాయ్ కార్యక్రమంలో భాగంగా మిఠాయి థియేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిల్డ్రన్ థియేటర్ వర్క్ షాప్ లో థియేటర్ టీచింగ్ ఫ్యాకల్టీ గా పని చేసాను


• తెలంగాణ గిరిజన మరియు సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులకు 2013 లో సమురాయ్ కార్యక్రమంలో భాగంగా మిఠాయి ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో “తూ బాబా” ఏకాంకికను ప్రదర్శన చేయించారు

( ఏకాంకికను concept and designing చేసి రవీంద్ర భారతి వేదికపై ప్రదర్శించడం జరిగింది.)

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతాపూర్ సంస్థలో “ హుమనైడ్ “ అనే సంగీత నాటకానికి ఆ స్కూల్ నటనలో శిక్షణ ఇవ్వడం మరియు పూర్తి సాంకేతిక విభాగంలో ఆర్ట్, సెట్, లైటింగ్, వంటి విభాగాలలో ముఖ్య భూమిక పోషించి పనిచేయడం జరిగింది.

• తెలంగాణ గిరిజన మరియు సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులకు 2023 లో “Sparkles” 15 రోజుల సమ్మర్ క్యాంప్ కార్యక్రమంలో భాగంగా మిఠాయి థియేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిల్డ్రన్ థియేటర్ వర్క్ షాప్ లో థియేటర్ టీచింగ్ ఫ్యాకల్టీ గా పని చేసారు.

Tswrs/jc Yellareddy Sparkles సమ్మర్ కాంప్ విద్యార్థులు క్లాస్ రూమ్ లో improvigetion class లో రచించిన మూఢనమ్మకాలు విశ్వాసాలపై అవగాహన కల్పించే విధంగా “లంగొటి బాబా“ మరియు కొన్ని ప్రైవేటు హాస్పిటల్లో అమాయక ప్రజల అవయవాలను వ్యాపారంగా చేసుకుని బ్రతికే డాక్టర్ గురించి తెలియజేసె “డా. ఫ్రెండ్ ధార్కారి శివ” పంచాయతీలతో పొద్దు గడిపే నిరక్షరాస్య గ్రామ అధికారి గురించిన “పాపారాయుడు పంచాయతీ” అనే మూడు అత్యంత హాస్యభరితమైన ఏకాంకికలకు దర్శకత్వం వహించి విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది.

నటుడిగా నాట శిక్షకుడిగా పని చేస్తూ నాటకం పై మక్కువతో ఎన్నో నాటకాలలో నటుడిగా మరియు రంగాలంకరణ, రంగోదీపనం సాంకేతిక నిపుణుడిగా నాటకరంగంలో కొనసాగుతున్నారు.


పరిశోధక పత్ర సమర్పణలు

• నవీన నృత్య – నాటక ప్రయోక్త డాక్టర్ అనిత రావు

      (The women in art and culture )

• The importance of pagati veshalu in Telugu folklore and uniqueness of veshagalla’s makeup

(A Performing arts various dimensions)

• ప్రాచీన తెలుగు సాంస్కృతిక జానపద కళారూపాలలో పగటి వేషాలు మరియు జానపద నాటక ప్రదర్శనలో ఆహార్యం యొక్క ప్రాముఖ్యత

(Centre of Excellence for Studies in Classical Telugu, Central Institute of Indian Languages (Mysore), (Ministry of Education, Dept. of Higher Education, Govt. of India) And Adikavi Nannaya University Jointly Organizing A three-day National Seminar )

• తెలుగు నాటకరంగం – సాహిత్యంలో స్త్రీల పాత్ర

• రసరంజని ఆధ్వర్యం లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో

జరుగుతున్న 5 రోజుల వర్క్ షాప్ “నాటకం వ్రాయడం ఎలా?” (27-10-22- 31-10-22) పాల్గొన్నాను.

సినిమా అనుభవం.

• ఆచార్య, • భీమ్లానాయక్ • RRR • మసూద • లాటి (తమిళం, తెలుగు) • పరహుషార్ • దసర • సాలార్ • బహిష్కరణ (web series)మరియు కొన్ని వెబ్ సిరీస్ లోల. • ప్రసన్న వదనం • కేబుల్ రెడ్డి

సినిమా రంగంలో సాంకేతిక నిపుణుడిగా(ఆర్ట్ అసిస్టెంట్)

• కలర్ ఫోటో • మసూద • పేకమేడలు • కట్టా (short film) • The unheard (web series) • బహిష్కరణ (web series) • ప్రసన్న వదనం • కేబుల్ రెడ్డి


   ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ “ క్రాంతి కుమార్ రెడ్డి ”  గారితో దగ్గర ఆర్ట్ అసిస్టెంట్ (అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్)   గా పనిచేస్తున్నారు.

ఖలీమ్ థియేటర్ (కళా వికసిత కల్చరల్ థియేటర్) నిర్వహణలో కార్యక్రమాలు:

• విత్తనం విలువ • సమాధి స్థలం • తలాక్–ఎ–నిఖా ( ఉర్దూ నాటకం) • గాయత్రి D/O బషీర్ హమ్మద్ • ఫేమస్ రీల్స్ లొల్లి (ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ బేగంపేట) 30 days basic యాక్టింగ్ వర్క్ షాప్ • కర్ర సాము (అప్పంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు) 12 days work shop •