స్పెక్ట్రోస్కోపీ


స్పెక్ట్రోస్కోపీ అనగా ఒక పదార్ధం ద్వారా ప్రసరింపజేసిన విద్యుదయస్కాంత వికిరణం యొక్క వర్ణపటం. పదార్థం (అణు లేదా పరమఅణు) తో విద్యుదయస్కాంత కిరణాల (అతినీలలోహిత (UV), కనిపించే(Vis), పరారుణ (IR), మరియు రేడియో కిరణంలు) శోషణ, ఉద్గార, లేదా వివర్తన వివరణ స్పెక్ట్రోస్కోపీ. అణువుల యొక్క పరిమాణాత్మక మరియు గుణాత్మక సమస్యల పరిష్కారo కొరకు అనేక స్పెక్ట్రోస్కోపిక్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పదార్థం సంబంధించి అణువుల లేదా పరమఅణువుల స్పెక్ట్రోస్కోపిక్ పద్ధతులు, వివిధ రకాల విద్యుదయస్కాంత కిరణాల సంబంధించి శోషణ, ఉద్గార, లేదా వివర్తన వంటి స్పెక్ట్రోస్కోపిక్ పద్ధతులు ఉన్నాయి. స్పెక్ట్రోస్కోపిక్ పద్ధతులను తరచూ వివిధ పరమఅణువులు మరియు అణువులును గుర్తించడానికి, కాలుష్య లేదా కలుషితాలను అత్యంత సమర్థవంతంగా గుర్తించడానికి మరియు ఘన స్ఫటికాలు పరమాణువుల అమరిక పరిశీలించడానికి ఉపయోగిస్తారు.

స్పెక్ట్రోస్కోపీ పద్ధతులను వర్గీకరణ మార్చు

విద్యుదయస్కాంత కిరణాల మరియు పదార్థం మధ్య పరస్పర పరిణామాల ఆధారంగా స్పెక్ట్రోస్కోపీ పద్ధతులను అనేక ఉప విభాగాలుగా వర్గీకరించవచ్చు.

'శోషణ స్పెక్ట్రోస్కోపీ: మార్చు

విద్యుదయస్కాంత కిరణాలలను అణువులు గ్రహించటం జరుగుతుంది, తద్వారా విద్యుదయస్కాంత కిరణాల శక్తి పదార్థం బదిలీ అవుతుంది.

'ఉద్గార స్పెక్ట్రోస్కోపీ: మార్చు

అణువులు విద్యుదయస్కాంత కిరణాలలను విడుదల చేస్తాయి, ఈ ప్రక్రియలో పదార్థం శక్తి ని విద్యుదయస్కాంత కిరణాల రూపం లోవిడుదల చేయబడతాయి.

స్పెక్ట్రోస్కోపీ రకాలు == విద్యుదయస్కాంత కిరణాల శక్తి పదార్థం ప్రత్యేక సంకర్షణ కాబట్టి స్పెక్ట్రోస్కోపిక్ అధ్యయనాలు రూపొందించబడ్డాయి. అతినీలలోహిత (UV), కనిపించే(Vis), పరారుణ (IR), లేదా రేడియో కిరణంలు అణువుల శోషణ లేదా ఉద్గార బట్టి అతినీలలోహిత (UV),, పరారుణ స్పెక్ట్రోస్కోపీ రకాలు వర్గీకరణ చేసారు.

అతినీలలోహిత స్పెక్ట్రోస్కోపీ' మార్చు

అన్ని అణువులు అతినీలలోహిత (UV) కిరణంలు గ్రహిస్తాయి. అణువుల పె అతినీలలోహిత (UV) కిరణంలు ప్రసరింప చేసినపుడు, అణువుల బాహ్య ఎలక్ట్రాన్లు అతినీలలోహిత కిరణంల శక్తిని గ్రహిస్తాయి. ప్రతి అణువులు ప్రత్యేకమైన తరంగ ధైర్ఘ్యము లేదా ఫ్రీక్వెన్సీ కలిగిన అతినీలలోహిత (UV) కిరణంలు గ్రహిస్తాయి. శోషణ బడిన అతినీలలోహిత కిరణాల తరంగ ధైర్ఘ్యము ఆధారంగా అణువులు గుర్తించవచ్చు.

పరారుణ స్పెక్ట్రోస్కోపీ' మార్చు

అణువుల పె పరారుణ (IR) కిరణంలు ప్రసరింప చేసినపుడు, అణువులు పరారుణ కిరణంల శక్తిని గ్రహిస్తాయి. ఈ తక్కువ శక్తి అణువుల సమూహాల ప్రకంపన మరియు భ్రమణ ప్రేరణ కలిగిస్తుంది. అణువులలలోని పరమఅణుల మధ్య బంధనాలు వివిధ పౌనఃపున్యాల వద్ద కంపనాలు చెందుతాయి. అణు బంధం కంపనాలు ఆధారంగా అణువులు గుర్తించవచ్చు. పరారుణ స్పెక్ట్రోస్కోపీ, ముఖ్యముగా కర్బన సమ్మేళనాలలలోని సమూహాలను తెలుసుకోవడానికి ఉపయోగపడూతుంది.

 


 
ఇ అర్