గద్దే పెద్దన్న
  గద్దే పెద్దన్న
 పక్షుల రాజ్యానికి రారాజు కావాలని
 పావురం వలే శాంతి పేరుతో విహరించి
 బాంబుల వర్షం కురిపిస్తుంది............
 సమాదుల మీద కూర్ఛొని శవాలను పీక్కు తింటుంది
 కండలను తిని ఎముకలతొ కొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తూపోతుంది
 
 పక్షుల మద్య ఛిచ్ఛుపెట్టి
 పచ్ఛికపై పఛార్లు చేస్తుంది
 శాంతి కోసమని ఒకసారి 
 అన్యాయమని మరొకసారి యుద్దం చేస్తుంది
 చమురుకోసం ఒక దేశంతొ
 చాదస్తమని మరో దేశంతో..
 ప్రపంచానికి గుడ్డి మాటలు చెప్తూ
 ముక్కు పెత్తనం చేస్తూ పోతుంది
 కట్టడీ చేయకుంటే పక్షజాతికే ప్రమాదం.....