వాడుకరి:Meena gayathri.s/కత్రినా కైఫ్

కత్రినా కైఫ్  (జననం 16 జులై 1983) బ్రిటిష్ నటి, మోడల్.[1] ఆమె తండ్రి కశ్మీరీ కాగా, తల్లి బ్రిటన్ కు చెందినవారు. ఆమె బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు, మళయాళం సినిమాల్లో కూడా కనిపించారామె.is a British[2] ఆమె చాలా ప్రఖ్యాతమైన మోడల్ కూడా. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఈమె కూడా ఒకరు. కత్రినాను మీడియా అత్యంత ఆకర్షణీయమైన సెలెబ్రటీగా గుర్తించింది.

బ్రిటిష్ హాంగ్ కాంగ్ లో జన్మించిన కత్రినా, భారత్ కు రాకముందు ఎన్నో దేశాలు తిరిగారు వీరి కుటుంబం. ఆమె టీనేజ్ లో ఉన్నప్పుడు మొదటిసారి మోడలింగ్ చేశారు. ఆ తరువాత దానినే కెరీర్ గా మలచుకున్నారు కత్రినా. లండన్ లో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో నిర్మాత కైజద్ గుస్తాద్ ఆమెకు తన సినిమా బూమ్(2003)లో నటించమని అడిగారు. ఆమె ఒప్పుకుని ఈ సినిమా చేశారు కానీ, ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ కావడమే కాక విమర్శాత్మకంగా కూడా విఫలమైంది. ఈ సినిమాలో నటించేటప్పుడు ఆమెకు మోడలింగ్ లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమెకు హిందీ రాకపోవడంతో సినిమా అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. తరువాత ఆమె తెలుగులో మల్లిశ్వరి(2004) సినిమాలో నటించారు. ఈ సినిమా ఏవరేజ్ గా ఆడింది. బాలీవుడ్ లో తరువాత ఆమె చేసిన మైనే ప్యార్ క్యూ కియా?(2005), నమస్తే లండన్(2007) వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నా, ఆమె నటనకు మాత్రం విమర్శలు వచ్చాయి.

Notes మార్చు

References మార్చు

  1. Hafeez, Mateen (30 August 2010). "Working in Bollywood for years, but shy of citizenship?". The Times of India. Retrieved 19 April 2016.
  2. Hafeez, Mateen (30 August 2010). "Working in Bollywood for years, but shy of citizenship?". The Times of India. Retrieved 19 April 2016.

[[వర్గం:1983 జననాలు]] [[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]